వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వేలో ఆసక్తికరం: బీజేపీ వద్దు, ప్రధానిగా మోడీయే కావాలి, రాహుల్ పోటీయే కాదు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గడ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాలలో ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ చేసిన అనంతరం ఏబీపీ మొదటి మూడు రాష్ట్రాలలో సర్వే నిర్వహించింది. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రాల్లో వరుసగా రెండు, మూడుసార్లు బీజేపీ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారనే కోణంలో సర్వే చేశారు. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ముందంజలో ఉంది. అదే సమయంలో ఈ రాష్ట్రాల్లోని ప్రజలు కేంద్రంలో మాత్రం బీజేపీ ఉండాలని, నరేంద్ర మోడీ ప్రధానిగా మరోసారి కావాలని కోరుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.

మోడీకి భారీ షాక్: సర్వే... ఆ 3 రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్‌దే! ఎవరికి ఎన్ని సీట్లు అంటే?మోడీకి భారీ షాక్: సర్వే... ఆ 3 రాష్ట్రాల్లో అధికారం కాంగ్రెస్‌దే! ఎవరికి ఎన్ని సీట్లు అంటే?

రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో నీటి సరఫరా, ఉద్యోగాల, రోడ్ల అభివృద్ధిపై సర్వే చేయగా వాటర్ సప్లై రాజస్థాన్‌లో 21.8 శాతం, ఎంప్లాయిమెంట్ 17 శాతం, మధ్యప్రదేశ్‌లో ఎంప్లాయిమెంట్ 18 శాతం, వాటర్ సప్లై 15.7 శాతం, చత్తీస్‌గఢ్‌లో రోడ్లు 21.6 శాతం, ఎంప్లాయిమెంట్ 16.5 శాతంగా ఉంది.

 మూడు రాష్ట్రాల్లో వ్యతిరేకత

మూడు రాష్ట్రాల్లో వ్యతిరేకత

వరుస బీజేపీ పాలన కారణంగా ఈ మూడు రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకత కనిపిస్తోందని సర్వేలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు తదితరులపై వ్యతిరేకత ఉంది.

మోడీ ప్రభుత్వంపై సానుకూలత

మోడీ ప్రభుత్వంపై సానుకూలత

ఇక్కడ మరో విషయం ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత ఉన్న ప్రజలు.. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై మాత్రం సానుకూలంగా ఉన్నారని సర్వేలో వెల్లడైంది. ఈ మూడు రాష్ట్రాల్లో దాదాపు 50 శాతం మందికి పైగా కేంద్రంలో బీజేపీయే అధికారంలో ఉండాలని, నరేంద్ర మోడీ మారాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలపై వ్యతిరేకత, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకత లేకపోవడానికి.. రాష్ట్రంలో వరుసగా బీజేపీ అధికారంలోకి రావడమే కారణంగా కనిపిస్తోంది.

విపక్షాల కంటే బీజేపీ సీఎంలు ముందంజలోనే ఉన్నా

విపక్షాల కంటే బీజేపీ సీఎంలు ముందంజలోనే ఉన్నా

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్‌గఢ్ సీఎం రమణ్ సింగ్‌ల పట్ల విపక్షంలోని నేతల కంటే ప్రజలు సానుకూలంగా ఉన్నారు. అదే సమయంలో రాజస్థాన్‌లో మాత్రం బీజేపీ సీఎం వసుంధరా రాజే కంటే కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ పట్ల సానుకూలంగా ఉన్నారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపు దాదాపు కనిపిస్తోంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో మాత్రం టఫ్ ఫైట్ కనిపిస్తోంది.

 రాహుల్ గాంధీ పోటీయే కాదు

రాహుల్ గాంధీ పోటీయే కాదు

మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌లలో ముఖ్యమంత్రులపై పాజిటివ్ ఒపీనియన్ ఉండటంతో ఇక్కడ వారి భుజస్కంధాల పైనే బీజేపీ గెలుపు వేసుకుంటున్నారు. బీజేపీ నరేంద్ర మోడీ పైన కూడా ఆశలు పెట్టుకుంది. రాజస్థాన్‌లో వసుంధరా రాజే వల్ల పార్టీకి నష్టమని చాలామంది భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రచారం చేసిన కాంగ్రెస్‌కు దెబ్బ, మోడీ ప్రచారం చేస్తే బీజేపీలో ఉత్సాహం అనే వాదనలు ఉన్నాయి. ఇది బీజేపీకి ప్లస్ అవుతుందేమో చూడాలని అంటున్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో బీజేపీ ప్రభుత్వం మారాలనుకుంటున్న వారు కూడా కేంద్రంలో మాత్రం మోడీయే ప్రధాని ఉండాలని కోరుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది. సర్వే ద్వారా అసలు మోడీకి రాహుల్ గాంధీ పోటీయే కాదని చాలామంది అభిప్రాయపడ్డారు.

English summary
Across all 3 states more than 50% of respondents did not want to change the central government or the Prime Minister. Therefore, in a situation where state governments are unpopular but central government is popular we might observe the split voting pattern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X