వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈసీపై ఢిల్లీ సీఎం సంచలన ఆరోపణ.. పోలింగ్ ముగిసి 24 గంటలైనా తేలని ఓటింగ్ శాతం.. ట్యాంపరింగ్ అనుమానాలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines | Asaduddin Owaisi Warns BJP

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి పోలింగ్ ముగిసి 24 గంటలు పూర్తయ్యాయి.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)నే మళ్లీ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి.. కానీ బీజేపీ మాత్రం ఎగ్జిట్ పోల్స్ రివర్స్ అవుతాయని.. అమిత్ షా చెప్పినట్లు 45 సీట్లకు తక్కువ కాకుండా గద్దెనెక్కుతామని ఘంటాపథంగా చెబుతోంది. పార్టీల సంగతి అటుంంచితే.. ఎన్నికల సంఘం ఇప్పటిదాకా తుది పోలింగ్ శాతంపై అధికారిక ప్రకటన చేయకపోవడం అనుమానాలకు, విమర్శలకు తావిచ్చినట్లయింది. దీనిపై సీఎం కేజ్రీవాల్ సంచలన కామెంట్లు చేశారు.

పోలింగ్ శాతం ఎంత?

పోలింగ్ శాతం ఎంత?

ఢిల్లీలో శనివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. పోలింగ్ ముగిసే సమయానికి 57.06 శాతం ఓటింగ్ నమోదైందని, పూర్తి స్థాయి లెక్కలు వచ్చిన తర్వాత ఇది పెరిగే అవకాశముందని ఎన్నికల అధికారులు తెలిపారు. అయితే శనివారం రాత్రిగానీ, ఆదివారం ఉదయంగానీ ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయలేదు. సాయంత్రం దాకా ఎదురు చూసిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఈసీ తీరును తీవ్రంగా తప్పుపట్టింది.

సీఎం షాకింగ్ కామెంట్స్..

సీఎం షాకింగ్ కామెంట్స్..

‘‘పోలింగ్ పూర్తయిన ఇన్ని గంటల తర్వాత కూడా ఓటింగ్ శాతంపై ఈసీ ప్రకటన చేయకపోవడం నాకైతే షాకింగ్ గా అనిపిస్తోంది. అసలు ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారు? పోలింగ్ శాతాన్ని ప్రకంచాలి కదా?''అని సీఎం కేజ్రీవాల్ ఈసీని ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ో ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీకి ఈసీ అనుకూలంగా వ్యవహరిస్తున్నదని, ట్యాంపరింగ్ ద్వారా పోలింగ్ శాతాన్ని పెంచుకుని, తద్వారా ఫలితాల్ని తారుమారుచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

అతి తక్కువ శాతం..

అతి తక్కువ శాతం..


శనివారం సాయంత్రానికి వెల్లడైన లెక్కల ప్రకారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 57.06 శాతం పోలింగ్ నమోదైంది. గత లోక్ సభ ఎన్నికలు, 2015నాటి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే ఈ శాతం చాలా తక్కువగా ఉండటం చర్చనీయాంశమైంది. 2015లో ఢిల్లీ అసెంబ్లీకి 67.5 శాతం ఓటింగ్ నమోదైంది. ఇప్పుడు కూడా శాతం లెక్కలు పెరుగుతాయని ఈసీ అధికారులు చెప్పినా... అధికార లెక్కలు మాత్రం విడుదల చేయకపోవడం అనుమానాలకు తావిచ్చినట్లయింది.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal on Sunday said it was "absolutely shocking" that the Election Commission has not released the final turnout percentage of assembly polls held yesterday in delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X