వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్డర్ హత్య: గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను దోషిగా తేల్చిన టాడా కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: ప్రదీప్ జైన్ అనే వ్యక్తి హత్య కేసులో గ్యాంగ్‌స్టర్ అబూ సలేంను న్యాయస్థానం దోషిగా తేల్చింది. ప్రత్యేక టెర్రరిస్ట్ అండ్ డిస్‌రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ (టాడా) కోర్టు సోమవారం నాడు 1995లో హతుడైన ప్రదీప్ జైన్ కేసులో తీర్పును చెప్పింది.

ఈ కేసులో అబూ సలేంను దోషిగా తేల్చింది. స్పెషల్ ట్రయల్ జడ్జి.. అబూ సలేం, మెహ్దీ హసన్, బిల్డర్ వీరేంద్ర జాంబ్‌ల పైన విచారణను పూర్తి చేసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్యాంగ్ స్టర్ అబూ సలేం ప్రాపర్టీ విషయంలో ప్రదీప్ జైన్‌ను హత్య చేశారు.

Abu Salem convicted in Pradeep Jain murder case

ప్రదీప్ జైన్ ముంబై సిటీ బేస్డ్ బిల్డర్. అతను 1995 మార్చి 7వ తేదీన జుహు బంగ్లా వద్ద హత్యగావించబడ్డాడు. ఈ కేసులో నిందితుడైన నమీమ్ ఖాన్ అప్రూవర్‌గా మారాడు. మరో నిందితుడు రియాజ్ సిద్ధిఖీ కూడా మొదట అప్రూవర్‌గా మారాడు.

పోలీసులు అన్ని కోణాల్లో విచారించి అబూ సలీమ్ ఇతరుల పాత్ర ఉన్నట్లుగా గుర్తించారు. సిద్ధిఖీ పోలీసు విచారణలో అబూ హత్యలో అబూ సలేం పాత్రను చెప్పాడు. విచారణలో అతను నిందితుడిగా తేలాడు. కాగా, అబూ సలేం 1993 ముంబై సీరియల్ బాంబు బ్లాస్ట్ కేసుల్లో నిందితుడు కూడా.

English summary
A Special Terrorist and Disruptive Activities Act (TADA) court on Monday convicted extradited alleged gangster Abu Salem ‎ in the 1995 Pradeep Jain murder.‎
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X