వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆమెను పెళ్లి చేసుకోవాలి, అనుమతించండి: గ్యాంగ్‌స్టర్ అబూసలేం

ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్ అబుసలేం పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ముంబై పేలుళ్లకు పాల్పడి 257మంది ప్రాణాలు తీసి, 713మంది గాయాలపాలవడానికి కారణమయ్యాడు అబూసలేం.

|
Google Oneindia TeluguNews

ముంబై: వందలాది మంది ప్రాణాలు తీసిన ముంబై పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడైన గ్యాంగ్‌స్టర్ అబుసలేం పెళ్లి చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ముంబై పేలుళ్లకు పాల్పడి 257మంది ప్రాణాలు తీసి, 713మంది గాయాలపాలవడానికి కారణమైన అబూసలేం.. ముంబ్రా మహిళను పెళ్లి చేసుకునేందుకు రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లేందుకు అనుమతించాలని కోరాడు.

1993నాటి ముంబై పేలుళ్లలో కీలక పాత్ర సూత్రదారి అయిన అబూసలేంను 2005లో అరెస్ట్ చేసి పోర్చుగల్ నుంచి భారత్ తీసుకొచ్చారు. దాదాపు 12కేసుల్లో నిందితుడిగా ఉన్న అతడిని కోర్టు.. ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేల్చింది.

Abu Salem files fresh plea to marry Mumbra woman

అయితే, అబూసలేం 2015 తొలిసారి పెళ్లి అనుమతి కోసం పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, అప్పట్లో అతడి పిటిషన్ పెండింగ్‌లో పడింది. దీంతో తాజాగా, సోమవారం అతడు మరోసారి వివాహం చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు.

ఈ సందర్భంగా అతడు వివాహం చేసుకునేందుకు తాత్కాలిక బెయిల్‌కు అనుమతిస్తూ.. బాంబే హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజా పిటిషన్‌లో పేర్కొన్నాడు.

English summary
A month after the special TADA court held him guilty of being party to the conspiracy+ behind the March 12, 1993, Mumbai bomb blasts that killed 257 and left 713 injured, Abu Salem has sought permission to visit a marriage registrar's office to solemnize his wedding vows with a Mumbra woman.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X