వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాంగ్రెస్ పార్టీ ''తిట్ల డిక్షనరీ '' అందులో ప్రేమ కూడ ఉంటుంది ! ఇది సినిమా క్యాప్షన్ కాదు

|
Google Oneindia TeluguNews

పిచ్చి కుక్క , నల్లీ, , కోతి, వైరస్ ఎలుక, తేలు, పాము, ఎద్దు, హిట్లర్ , జులాయి , రావణుడు, దావుద్ ఇబ్రహిం , బస్మాసురుడు ,బాధ్యత లేని కొడుకు, ఇవన్ని పేర్లు అనుకుంటున్నారా ? కాదు పేర్లతో కూడిన తిట్లపురాణం. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధాని నరేంద్ర మోడీని తిట్టిన తిట్లు ,కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఏమన్నారో ,ఎన్నేన్ని వ్యాఖ్యలు చేశారో చెబుతూ ప్రధాని మోడీ హర్యానలోని ఎన్నికల సభలో ఎకరవు పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిట్ల డిక్షనరీ.

నన్ను ఎవరు తిట్టారో అవన్ని గుర్తు పెట్టుకుంటాను, మోడీ

నన్ను ఎవరు తిట్టారో అవన్ని గుర్తు పెట్టుకుంటాను, మోడీ

ప్రధాని నరేంద్రమోడీని ఎవరు ఏం తిట్టారు. రాజకీయ విమర్శల్లో భాగంగా ఎంతమంది ప్రధాని మోడీపై తిట్ల దండకం మొదలు పెట్టారు. రాజకీయా నాయకులను తిట్టే తిట్లను ఎవరైన గుర్తుపెట్టుకుంటారా అంటే నో అనే సమాధానం వస్తుంది. కాని దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న ప్రధాని మాత్రం కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్ని తిట్లు తిట్టారో మరి వల్లే వేసి చెప్పారు. ఓవైపు పార్లమెంట్ లో కౌగిలించుకుంటూ మరో వైపు తిట్లపురాణం మొదలు పెట్టారని స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ ప్రస్థావించారు.

ఓవైపు ప్రేమ మరో వైపు తిట్లు

ఓవైపు ప్రేమ మరో వైపు తిట్లు

ఓవైపు ప్రేమను చూపిస్తారు మరోవైపు తిట్ల పురాణం కొనసాగిస్తారు. ఘనచరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎందరో మహమహులు ఉన్నారు అంటూ పీఎం నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ నేతలను తీవ్రంగా దుయ్యబట్టారు, ఓవైపు పార్లమెంట్‌లో హత్తుకుని ప్రేమను చూపిస్తూ... ,మరోవైపు తనను తిట్లతో ముంచేత్తున్నారని ఇది కాంగ్రెస్ పార్టీ ప్రేమతో కూడిన ''తిట్ల డిక్షనరీ ''అంటూ ప్రదానమంత్రి నరేంద్ర మోడీ హర్యాన ఎన్నికల ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరు ఏమని అన్నారో వివరిస్తూ చెప్పారు. వాటిలో

కాంగ్రెస్ తిట్ల డిక్షనరీ

కాంగ్రెస్ తిట్ల డిక్షనరీ

''ఒకరు నన్ను నల్లీ అంటే మరోక నాయకుడు పిచ్చి కుక్క అన్నారు ఇంకోకరు బస్మాసురా అంటూంటే మరో మాజీ విదేశీ వ్యవహారల మంత్రి అయితే కోతి అనగా ఒకమంత్రి దావూద్ ఇబ్రహింతో పోల్చాడు.వీటీతో పాటు హిట్లర్, వైరస్ ,రెబీస్ వ్యాధి సోకిన కుక్క తోపాటు పాము, ఎలక ,అని కూడ అన్నారు" ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అవీనితిని అడ్డుకోవడంతోపాటు పార్టీ రాజరిక వ్యవస్థను ప్రశ్నించాను అందుకే ఆత్మీయత ముసుగులో నన్ను తిడుతున్నారు అంటూ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ

రాజీవ్ గాంధీ పై అవీనితీ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ విమర్శలు

రాజీవ్ గాంధీ పై అవీనితీ వ్యాఖ్యల నేపథ్యంలో రాజకీయ విమర్శలు

ప్రధాని నరేంద్ర మోడీ రాజీవ్ గాంధిపై అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో పార్టీ నేతలు నరేంద్ర మోడీపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు దీంతో డిఫేన్స్ లోపడిన నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ దాడులకు మరింత పదును పెంచారు . ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలను ఎకరవు పెట్టారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ మాట్లాడే మాటల ప్రభావం కుటుంభాల్లోని చిన్నపిల్లలు, స్కూల్ ,కాలేజీ విద్యార్థులపైన పడుతుందని అన్నారు .ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీలో ఎవరైన బాధ్యత వహిస్తారా అంటూ ప్రశ్నించారు.

English summary
Prime Minister Narendra Modi at a public meeting in Kurukshetra, Haryana on Wednesday took potshots at the Congress party for hurling abuses at him, while claiming to go by the "dictionary of love" and accusing the BJP of using bad language in campaigns.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X