వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూలో 5వ తేదీన ఏం జరిగింది..? దాడికి ప్రతీదాడే అంటోన్న ఏబీవీపీ, ‘ఇండియా టుడే స్టింగ్ ఆపరేషన్’

|
Google Oneindia TeluguNews

జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆదివారం ఏం జరిగింది. సబర్మతి హాస్టల్ వద్ద దాడికి కారకులు ఎవరు ? దాడిలో ఏబీవీపీ పాత్ర ఎంత, అంటే 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ ఔననే చెబుతోంది. ఆ రోజు ఏబీవీపీ కార్యకర్తలు జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థులపై దాడి చేశారని, స్టింగ్ ఆపరేషన్‌లో బహిర్గతమైంది. ఇంతకీ ఆదివారం ఏం జరిగింది.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..

ఆదివారం ఏం జరిగిందనే అంశంపై ‘ఇండియా టుడే' రిపోర్టర్ దాడికి పాల్పడిన అక్షత్ అవస్థి అనే విద్యార్థి ద్వారా ఏం జరిగిందనే విషయాలు తెలయజేశారు. అంతకుముందు రోజు జేఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థులు తమపై దాడికి ప్రతీకారంగానే ఆదివారం దాడి చేసినట్టు అక్షత్ అంగీకరించారు. వామపక్ష విద్యార్థులపై దాడి చేసేందుకు క్యాంపస్ బయట నుంచి కొందరినీ తీసుకొచ్చామని కూడా ఒప్పుకున్నారు. వర్సిటీలో అక్షత్ ఫ్రెంచ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నానని ‘ఇండియా టుడే' రిపోర్టర్‌కు తెలియజేశారు. జేఎన్‌యూలోని కావేరి హాస్టల్ అతను ఉంటున్నారు.

వీడియో కూడా..

వీడియో కూడా..

అంతేకాదు 5వ తేదీన జరిగిన వీడియోను కూడా రిపోర్టర్‌కు చూపించారు. కర్ర పట్టుకొని, హెల్మెట్ పెట్టుకొని హాస్టల్ కారిడార్ వద్ద పరుగెత్తుతూ కనిపించింది. చేతిలో ఏం ఉంది అని రిపోర్టర్ అడిగితే కర్ర అని.. పెరియార్ హాస్టల్ వద్ద జెండా నుంచి బయటకు తీశానని తెలిపారు. ఎవరిపైనేనా దాడి చేశారా అని ప్రశ్నిస్తే తాను కాన్పూర్ నుంచి వచ్చానని.. అక్కడ ప్రతీ వీధిలో గుండాలు ఉంటారని.. తాను కూడా రౌడీననే అర్థంతో అక్షత్ రిపోర్టర్‌కు తెలియజేశారు. ఆదివారం కన్నా ముందు పెరియార్ హాస్టల్‌పై వామపక్షవిద్యార్థులు దాడి చేయడంతో.. మరునాడు తాము దాడి చేశామని అంగీకరించారు.

20 ప్లస్ 20

20 ప్లస్ 20

జేఎన్‌యూ ఎస్‌యూ విద్యార్థులపై దాడి చేసేందుకు అంతమందిని ఎక్కడినుంచి తీసుకొచ్చారని రిపోర్టర్ అడిగితే.. క్యాంపస్ బయట నుంచి ఏబీవీపీ ఆఫీసు బేరర్ల సాయం తీసుకున్నామన్నారు. వామపక్ష విద్యార్థులు, ఉపాధ్యాయులు సబర్మతి హాస్టల్ వద్ద సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారంతో.. ప్రణాళిక ప్రకారం దాడి చేశామని చెప్పారు. అంతేకాదు హాస్టల్ ఎదురుగా ఉన్న వీధిలో వాహనాలు, ఫర్నీచర్లను కూడా ధ్వంసం చేశామని చెప్పారు. దాడి జరిగే సమయంలో అక్కడున్న మిగతావారు పారిపోయారన్నారు. ఏబీవీపీ కార్యకర్తలలో 20 మంది వర్సిటీక చెందిన వారని.. మిగతా 20 మంది బయట నుంచి తీసుకొచ్చామని రిపోర్టర్‌కు వివరించారు.

మరో విద్యార్థి

మరో విద్యార్థి

అక్షత్‌తోపాటు మరో విద్యార్థి రోహిత్ షా కూడా వర్సిటీలో తాము దాడి చేశామని రిపోర్టర్‌కు వెల్లడించారు. అక్షత్ దాడి చేసేందుకు వెళ్లగా తానే హెల్మెట్ ఇచ్చానని.. గ్లాసు పగులగొట్టే సమయంలో తప్పనిసరి అని చెప్పినట్టు రోహిత్ పేర్కొన్నారు. ఆదివారం దాడి చేసిన వారిలో 20 మంది ఉన్నట్టు రోహిత్ కూడా అంగీకరించాడు. అంతేకాదు అక్షత్.. వామపక్ష విద్యార్థులపై దాడి చేసే సమయంలో ఒక పోలీసు అధికారి సపోర్ట్ చేశాడని సంచలన విషయం వెల్లడించారు.

ముసుగెసుకొని

ముసుగెసుకొని


అంతేకాదు పోలీసులు కూడా తమకు సహకరించారని అక్షత్ పేర్కొన్నారు. లైట్లు ఆర్పివేసి దాడి చేసేందుకు సాయం చేశారన్నారు. తాము మొహలకు ముసుగు వేసుకొని దాడికి చేశామని, వారు ఇదివరకు చేసిన పనినే చేశామని చెప్పారు. అయితే ఇండియా టుడేకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వూూలో వీసీ జగదీశ్ కుమార్.. ఆదివారం దాడి కన్నా ముందే వర్సిటీలో మూకలు ప్రవేశించారని చెప్పారు. శనివారం దాడికి ప్రతీకారంగానే ఆదివారం అటాక్ జరిగి ఉంటుందని చెప్పారు.

ఎంక్వైరీకి డిమాండ్

ఎంక్వైరీకి డిమాండ్

జేఎన్‌యూలో దాడికి సంబంధించి అక్షత్, రోహిత్ షా ఇండియా టుడే సింగ్ ఆపరేషనలో సంచలన విషయాలు వెల్లడించిన వెంటనే.. ఏబీవీపీ స్పందించింది. వారికి ఏబీవీపీ సంస్థతో సంబంధం లేదని తేల్చిచెప్పింది. జేఎన్‌యూఎస్‌యూ కార్యకలపాల్లో కూడా వారు పాల్గొనలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని.. విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి నిధి త్రిపాఠి తెలిపారు.

ఏబీవీపీ హస్తం..?

ఏబీవీపీ హస్తం..?


ఇండియా టుడే సింగ్ ఆపరేషన్‌లో విద్యార్థులపై దాడి చేసింది ఏబీవీపీ అని తేలిందని సీపీఎం నేత బృందా కారత్ పేర్కొన్నారు. సిట్ టేపులతో ఏబీవీపీ ప్రమేయం స్పష్టమైందని ఆ పార్టీ నేత సీతారాం ఎచూరీ తెలిపారు.

English summary
abvp attackers in a big sting, Left role also exposed in India Today sting
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X