వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీవీపీ v/s జేఎన్‌యూఎస్‌యూ: జేఎన్‌యూ వర్సిటీ వద్ద మరోసారి ఉద్రిక్తత, ముసుగెసుకొని దాడులు

|
Google Oneindia TeluguNews

Recommended Video

JNU Issue : ABVP vs JNUSU || Politicians React On JNU Issue || Oneindia Telugu

ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ వర్సిటీలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వామపక్షాలు, ఏబీవీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగినట్టు తెలుస్తోంది. కానీ సబర్మతి, ఇతర హాస్టళ్లలోకి ఇతరులు ప్రవేశించి దాడి చేశారని జేఎన్‌యూఎస్‌యూ విద్యార్థి సంఘం పేర్కొన్నది. వారు ముసుగు ధరించి వచ్చి.. కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపింది.

దాడిలో ఆరెస్సెస్ అనుబంధ సంస్థ ఏబీవీపీ విద్యార్థి సంఘం ప్రమేయం ఉందని.. సబర్మతి హాస్టల్ వద్ద ఉన్న ఆస్తికి నష్టం కలిగించినట్టు జేఎన్‌యూఎస్‌యూ ఆరోపించింది. ఏబీవీపీ చేసిన దాడిలో జేఎన్‌యూఎస్‌యూ అధ్యక్షుడు ఐషే ఘోష్, ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర యాదవ్ గాయపడ్డారు. దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతోంది. ఐషే ఘోష్ తల నుంచి రక్తస్రావం వస్తోంది.

abvp members barged into jnu hostels, attacked students with sticks..

ముసుగులు ధరించిన గుండాలు తనపై దాడి చేశారని ఘోష్ తెలిపారు. వారి దాడిలో తలపై తీవ్రమైన గాయాలయ్యాయని పేర్కొన్నారు. హాస్టల్లో దాడికి సంబంధించి హాస్టల్ ఫీజు పెంపు, సెమిస్టర్ పరీక్షల ముందు రిజిస్ట్రేషన్ బహిష్కరణ నేపథ్యంలో జరిగిందని మరికొందరు అంటున్నారు. ఇదిలా ఉంటే పెరియార్ హాస్టల్ వద్ద వామపక్ష సంఘాల కార్యకర్తలు దాడిచేశారని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపించారు. ఘటనలో ఏబీవీపీకి చెందిన మనీశ్ తీవ్రంగా గాయపడ్డారు.

English summary
students at the Sabarmati and other hostels of jnu have allegedly been attacked.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X