వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డిసెంబర్‌ 1 నుంచి ఇంజనీరింగ్‌, బీ ఫార్మసీ ఫస్ట్ ఇయర్ క్లాసులు: ఏఐసీటీఈ తాజా ఉత్తర్వులు

|
Google Oneindia TeluguNews

ఇంజనీరింగ్‌, ఫార్మసీ కాలేజీల్లో మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థులకు డిసెంబర్‌ 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరం (2020-21)కుగానూ బీటెక్‌, బీఫార్మసీ ఫస్టియర్‌ తరగతులను డిసెంబరు 1ను నుంచి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సూచించింది.

షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్షాకింగ్: పురానాపూల్ బ్రిడ్జి డ్యామేజ్? - హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం - పనిచేయని ఐఎండీ రాడార్

కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఆగస్టు 13న ఆల్టర్నేటివ్ అకడమిక్‌‌ క్యాలెండర్‌ ప్రకటించిన ఏఐసీటీఈ.. నవంబరు 1 నాటికి అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేసి, అదే రోజు నుంచి క్లాసులు మొదలుపెట్టాలని ఆదేశించగా.. ఇప్పుడా ఉత్తర్వులను సవరిస్తూ.. ఫస్ట్ ఇయర్ క్లాసుల ప్రారంభం తేదీని డిసెంబర్ 1కి పొడిగించారు.

 Academic session in engineering colleges, technical institutions from December 1: AICTE

ఇప్పటికే ఐఐటీలు, ఎన్‌ఐటీలకు సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో పాటు పలు రాష్ట్రాల నుంచి విన్నపాలు వస్తున్న నేపథ్యంలో తరగతుల ప్రారంభంపై ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఏఐసీటీఈ సభ్య కార్యదర్శి ప్రొఫెసర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. సవరించిన ఉత్తర్వుల ప్రకారం నవంబర్ 30 నాటికి ఫస్టియర్ అడ్మిషన్లను పూర్తి చేసి డిసెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని వివరించారు.

క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్క్రిస్మస్‌ నాటికి చెదపురుగులు నాశనం-జగన్‌కు మోదీ మద్దతు వట్టి సొల్లు - ఎంపీ రఘురామ షాకింగ్ కామెంట్స్

English summary
The academic session for freshers in engineering colleges and other technical institutions across the country will begin from December 1 and the deadline for admissions has been further extended due to the COVID-19 pandemic, according to the All India Council for Technical Education (AICTE).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X