వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరిగేషన్ స్కాం: అజిత్ పవార్‌కు ‘క్లీన్‌చిట్’ ఇవ్వలేదని ఏసీబీ క్లారిటీ, డజన్లకుపైగా కేసులున్నాయ్!

|
Google Oneindia TeluguNews

ముంబై: ఇరిగేషన్ స్కాంకు సంబంధించి 9 కేసుల విచారణను అవినీతి వ్యతిరేక విభాగం(ఏసీబీ) మూసివేసింది. ఈ స్కాంలో విచారణను ఎదుర్కొంటున్నవారిలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఉన్నారు. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో భాగమైనందునే అజిత్ పవార్‌పై ఉన్న కేసులు మూసివేస్తున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

రెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనేరెండోసారి మహరాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ తొలి సంతకం ఆ చెక్కుపైనే

రెండు డజన్లకుపైగా..

రెండు డజన్లకుపైగా..

కాగా, ఏసీబీ సీనియర్ అధికారులు ఈ విషయంపై స్పందించారు. ఇప్పటి వరకు సాధారణ రీతిలోనే విచారణ జరిగిందని, ఏ రాజకీయ నేతను కూడా ఇప్పటి వరకు విచారించలేదని చెప్పారు. కొన్ని వేల కోట్ల స్కాంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామం ప్రభావం చూపలేవని సోమవారం స్పష్టం చేశారు. ఈ స్కాంలో రెండు డజన్లకుపైగా ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయని చెప్పారు.

ఏ కేసులోనూ అజిత్ పవార్ నిందితుడిగా లేరు..

ఏ కేసులోనూ అజిత్ పవార్ నిందితుడిగా లేరు..

ఏ కేసులోనూ అజిత్ పవార్‌ను నిందితుడిగా ఇప్పటి వరకు చేర్చలేదని ఏసీపీ డీజీపీ సంజయ్ బార్వే తెలిపారు. అయితే నవంబర్ 2018లో సమర్పించిన అఫిడవిట్‌లో అజిత్ పవార్ పేరు వచ్చిందని తెలిపారు. ఇరిగేషన్ ప్రాజెక్టు కాంట్రాక్టులు, మొబైలైజేసన్ అడ్వాన్సులు(ఎంఏ), నిబంధనలను అతిక్రమించి ప్రాజెక్టు వ్యయ అంచనాలు పెంచడానికి ఆమోదించడంలో అజిత్ పవార్ జోక్యం చేసుకున్నారని పేర్కొనడం జరిగింది.

24 కేసుల్లో కేవలం 9దే మూసేశాం.. విచారణ కొనసాగుతుంది..

24 కేసుల్లో కేవలం 9దే మూసేశాం.. విచారణ కొనసాగుతుంది..


ఈ స్కాంలో 24 ఎఫ్ఐఆర్లకుపైగా నమోదయ్యాయని, ఇతర విషయాల్లో విచారణ జరుగుతోందని చెబుతున్నారు. ఈ స్కాంలో 9 విచారణలను మాత్రమే తాము మూసివేశామని చెప్పారు. ఈ స్కాంలో విచారణ పురోగతి నివేదికను నవంబర్ 28న బాంబే హైకోర్టుకు సమర్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులు, ఎఫ్ఐ
ఆర్‌లపై విచారణ కొనసాగుతుందని ఓ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.

ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ..

ప్రజాస్వామ్యం ఖూనీ అంటూ..

కాగా, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అజిత్ పవార్ సహకరించడం వల్లే ఆయనపై ఉన్న కేసులను ఎత్తివేస్తున్నారని కాంగ్రెస్, శివసేన పార్టీలు విమర్శిస్తున్నాయి. అధికారం కోసం బెదిరింపులకు గురిచేస్తోందని మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇరిగేషన్ స్కాంలో సుమారు రూ. 72వేల కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి.

English summary
The Anti Corruption Bureau Monday closed nine inquiries related to the irrigation scam. Deputy Chief Minister Ajit Pawar is one of the people being investigated in the scam.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X