చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

లంచం డబ్బుతో సబ్ కలెక్టర్ జల్సాలు, రాసలీలలు, రూ. కోట్ల అక్రమాస్తులు, కన్ను పడితే ఫినిష్, చివరికి !

|
Google Oneindia TeluguNews

చెన్నై/వేలూరు: సహాయం కోసం వచ్చే వారి నుంచి లంచాలు తీసుకుని అనేక మంది మహిళలు, యువతులతో రాసలీలలు సాగిస్తున్న సబ్ కలెక్టర్ ను తమిళనాడులోని వేలూరులో అరెస్టు చేసి జైలుకు పంపించారు. కార్యాలయంలో పని చేసే మహిళా ఉద్యోగి సహాయంతో పలువురి దగ్గర భారీగా లంచాలు తీసుకుంటున్న సబ్ కలెక్టర్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. సొంత పనుల మీద కార్యాలయానికి వచ్చే మహిళల మీద కన్ను పడిన తరువాత వారిని ఆకర్షించే విధంగా మాట్లాడి అనంతరం వారితో చనువుగా ఉండేవాడని తెలిసింది. ఆ రకంగా మహిళలను లొంగదీసుకుని లంచాలు తీసుకున్న డబ్బు వారికి ఎరవేసి రాసలీలలు సాగించాడని, రూ. కోట్ల విలువైన అక్రమాస్తులు సంపాధించాడని అవినీతి నిరోదక దళం (డీవీఏసీ) అధికారులు గుర్తించారు.

14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!14 ఏళ్ల బాలుడితో ముగ్గురు పిల్లల తల్లి రొమాన్స్, రాత్రి ఆ పని కోసం టార్చర్, గొంతు కోసి చంపేశాడు!

 పూర్వికుల భూమి పత్రాలు

పూర్వికుల భూమి పత్రాలు

తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పోలూరుకు చెందిన రంజిత్ కుమార్ గత ఆగస్టు నెలలో తన పూర్వికుల భూమిని అతని పేరు మీద మార్చుకున్నాడు. ఆ సమయంలో ప్రభుత్వ భూమి విలువకంటే తక్కువగా రిజిస్టర్ పత్రాలు తీసుకున్నారని సబ్ రిజిస్టార్ కు తెలియడంతో ఆయన వేలూరు సబ్ కలెక్టరేట్ లోని ప్రత్యేక సబ్ కలెక్టర్ దినకరన్ ను కలవాలని సూచించారు.

 రూ. 50 వేలు డిమాండ్

రూ. 50 వేలు డిమాండ్

సమస్య పరిష్కరించాలంటే వెంటనే రూ. 50 వేలు లంచం ఇవ్వాలని సబ్ కలెక్టర్ దినకరన్ డిమాండ్ చెయ్యడంతో రంజిత్ కుమార్ షాక్ కు గురైనాడు. అంత డబ్బులు చెల్లించలేని రంజిత్ కుమార్ సబ్ కలెక్టర్ దినకరన్ తో చర్చలు జరిపాడు. ఫలితం లేకపోవడంతో వేలూరులోని అవినీతి నిరోదక దళం (ఏసీబీ) అధికారులకు రంజిత్ కుమార్ ఫిర్యాదు చేశారు.

 రెడ్ హ్యాండెడ్ గా చిక్కన సబ్ కలెక్టర్

రెడ్ హ్యాండెడ్ గా చిక్కన సబ్ కలెక్టర్

ఏసీబీ అధికారులు దాడి చేసి రంజిత్ కుమార్ నుంచి లంచం తీసుకుంటున్న సబ్ కలెక్టర్ దినకరన్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతర సబ్ కలెక్టర్ దినకరన్ కార్యాలయం, ఇంటిలో సోదాలు చేసిన డీవీఏసీ అధికారులు, డీఎస్పీ దేవనాథన్, పోలీసులు రూ. 77. 94 లక్షల నగదు, కీలక డాక్యూమెంట్లు, కంప్యూటర్, ల్యాప్ టాప్ స్వాధీనం చేసుకున్నారు.

 జల్లికట్టు కోసం లంచం, రూ. 2 వేల నోట్లు వద్దు

జల్లికట్టు కోసం లంచం, రూ. 2 వేల నోట్లు వద్దు

ఏసీబీ అధికారుల విచారణలో దినకరన్ ఒక్కొక్క వ్యవహారం వెలుగు చూసింది. జల్లికట్టుకు అనుమతి ఇవ్వడానికి ఉత్సవ కమిటీ సభ్యుల నుంచి తన పర్సనల్ కారు డ్రైవర్ రమేష్ కుమార్ (45) సహాయంతో రూ. వేల రూపాయల లంచం తీసుకున్నాడని వెలుగు చూసింది. ఇటీవల రూ. 2 వేల నోట్లు చలామణి కావని ప్రచారం జరగడంతో తనకు లంచంగా రూ. 500, రూ. 200 నోట్లు మాత్రమే ఇవ్వాలని కారు డ్రైవర్ రమేష్ కుమార్ ద్వారా సబ్ కలెక్టర్ దినకరన్ పలువురికి సమాచారం ఇచ్చాడని డీవీఏసీ అధికారులు గుర్తించారు.

కలెక్టర్ ఆఫీసులో లేడీ కిలాడీ

కలెక్టర్ ఆఫీసులో లేడీ కిలాడీ

సబ్ కలెక్టర్ దినకరన్ వేలూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ మహిళా అధికారి ఎంత డబ్బులు అడిగితే అంత డబ్బులు ఇచ్చేవాడని, ఎవరైనా సహాయం చెయ్యాలని వస్తే ముందుగా ఆ మహిళా అధికారితో చర్చించాలని సూచించేవాడని డీవీఏసీ అధికారులు తెలిపారు. ఇలా సబ్ కలెక్టర్ దినకరన్ సహాయం కోసం వచ్చే వారి నుంచి ఆ మహిళా అదికారిని లంచం వసూలు చేసి తరువాత సబ్ కలెక్టర్ దినకరన్ కు చేరవేస్తుందని డీవీఏసీ అధికారుల విచారణలో వెలుగు చూసింది.

లేడీఎస్ పిచ్చి, వలవేసి రాసలీలలు

లేడీఎస్ పిచ్చి, వలవేసి రాసలీలలు

మహిళలు అంటే సబ్ కలెక్టర్ దినకరన్ కు ఎక్కువ పిచ్చి ఉందని డీవీఏసీ అధికారులు చెప్పారు. సొంత పనులపై తన కార్యాలయానికి వచ్చే మహిళలను ఆకర్షించి మాట్లాడుతున్న సబ్ కలెక్టర్ దినకరన్ తరువాత వారి అవసరాలను ఆసరాగా తీసుకుని వారికి వల వేసి రాసలీలలు సాగిస్తున్నాడని తెలిసింది.

Recommended Video

Watch Woman Gives Birth To Child On Street | బిడ్డకు జన్మనిచ్చే తల్లి భూమికి భారమా ? | Oneindia
 రూ. కోట్ల విలువైన అక్రమ ఆస్తులు

రూ. కోట్ల విలువైన అక్రమ ఆస్తులు

వేలూరు సబ్ కలెక్టర్ గా పని చేస్తున్న దినకరన్ ఇటీవలే రాణిపేట్ లో రూ. కోటి విలువైన బంగ్లా కొనుగోలు చేశాడని, రూ. కోట్ల విలువైన అక్రమ ఆస్తులు సంపాధించారని వెలుగు చూసిందని డీవీఏసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకోవాలి అనే జాబితాను తయారు చేస్తున్న సబ్ కలెక్టర్ దినకరన్ ఆ లిస్టు కారు డ్రైవర్ రమేష్ కుమార్ దగ్గరకు ఇచ్చి అతని సహాయంతో లంచాలు వసూలు చేస్తున్నాడని తమ విచారణలో వెలుగు చూసిందని డీవీఏసీ అధికారులు తెలిపారు. సబ్ కలెక్టర్ దినకరన్ ను కోర్టు ముందు హాజరుపరిచిన డీవీఏసీ అధికారులు ఆయన్ను వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు.

గత కొన్ని సంవత్సరాల నుంచి తమిళనాడులోని పలు ప్రభుత్వ శాఖల్లో సబ్ కలెక్టర్ దినకరన్ విధులు నిర్వహించాడు.

English summary
The sleuths of Directorate of Vigilance and Anti-Corruption (DVAC), attached to Tamil Nadu Police have nabbed a deputy collector in Vellore and seized a whopping sum of Rs.77.94 lakhs from his house in the city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X