చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరుణానిధి అంత్యక్రియలు జరిగే ప్రాంతం ఇదే: ఎంజీఆర్-జయ, అన్నా-కరుణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

మెరీనాలోనే కరుణానిధి అంత్యక్రియలు

చెన్నై: కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లో జరగనున్నాయి. మద్రాస్ హైకోర్టు తీర్పుతో అడ్డంకి తొలగిపోయింది. స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అన్నాదురై సమాధి సమీపంలోనే కరుణ ఖనానికి ఏర్పాట్లు చేయాలని కోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, సాయంత్రం నాలుగు గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆరు గంటలకు అన్నాదురై స్మారకం పక్కనే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజాజీ హాలు నుంచి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. మెరీనా బీచ్ ఒకటిన్నర కిలో మీటర్ల దూరంలో ఉంది.

Access to Anna Samadhi Cut Off as Work Begins to Ready Kalaignars Resting Place

అంతిమయాత్ర సుమారు రెండు గంటల వరకు ఉంటుంది. ఎంజీఆర్ సమాధికి వెనుక వైపు జయలలిత అంత్యక్రియలు జరిగాయి. అన్నాదురై సమాధి వెనుక ప్రాంతంలో కరుణానిధి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కాగా, మెరీనా బీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలకు చోటు కల్పించకపోవడం తనను బాధించిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. తాను తమిళనాడు సీఎం పళనిస్వామికి ఫోన్ చేశానని, కానీ అతను అందుబాటులోకి రాలేదని, ఇదే విషయమై ప్రధాని మోడీకి ఫోన్ చేశానని చెప్పారు. కరుణానిధి మృతి దేశానికి తీరని లోటు అన్నారు.

కరుణ మరణ వార్త తెలిసి కార్యకర్తల గుండె ఆగింది

కరుణానిధి మరణవార్త తెలిసి ఇద్దరు కార్యకర్తల గుండె ఆగింది. మైలాడుతురైకి చెందిన సుబ్రహ్మణ్యం, నాగపట్టణానికి చెందిన రాజేంద్రన్ పార్టీ కార్యకర్తలు. కరుణానిధికి వీరాభిమానులు. 50 ఏళ్ల పైబడిన ఈ ఇద్దరూ కరుణానిధి ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ముభావంగా ఉంటున్నారు.
మంగళవారం సాయంత్రం కరుణ మరణవార్త తెలిసిన వెంటనే కన్నీటి పర్యంతమయ్యారు. వీరు గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాల్లో విషాదం నిండింది.

English summary
Aerial shot of area where Karunanidhi will be buried on Marina beach. The Madras High Court has allowed the body of M Karunanidhi to be buried at the Marina Beach. After hearing arguments at length the court said that there is no impediment on burying the body at the Marina.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X