వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014 విషాదాలు: విమాన ప్రమాదాలు, ఉగ్రవాదం

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: 2014 సంవత్సరం అనేక ఆనందాలతో పాటు పలు విషాద ఘటనలను కూడా తనలో ఇముడ్చుకుంది. ప్రపంచంతో పాటు దేశంలో ఈ ఏడాది జరిగిన అనేక ప్రమాద ఘటనలు వేలాది కుటుంబాల్లో విషాదాల్ని మిగిల్చాయి. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు, తాలిబన్ల చేతిలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎంహెచ్ 17, ఎంహెచ్ 370, ఎయిర్ ఏషియా విమాన ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్‌లోని పెషావర్ ఆర్మీ స్కూల్‌లో తాలిబన్లు దాడి చేసి 150 మంది విద్యార్థులు, సిబ్బంది ప్రాణాలను బలితీసుకున్నారు. జమ్మూకాశ్మీర్ వరదల్లో 200మందికిపైగా ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. రాష్ట్రంలోని పాలెంలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 45మంది సజీవ దహనమయ్యారు. ఈ ఏడాదిలో జరిగిన కొన్ని ప్రమాద ఘటనలు..

తైవాన్ విమాన ప్రమాదం

ఈ ఏడాది జులైలో తైవాన్‌కు చెందిన ఓ విమానం కూలగా 51 మంది మృతి చెందారు. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. దీంతో అందులో ఉన్న 51 మంది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఎంహెచ్ 17

ఎంహెచ్ 17

తూర్పు ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో కూలిపోయిన విమాన ప్రమాద ఘటనలో ఎంహెచ్ 17 చవిమానంలోని 298 ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మృత్యువాతపడ్డారు.

ఎంహెచ్ 370

ఎంహెచ్ 370

ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయింది. కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు.

ఎయిర్ ఏషియా

ఎయిర్ ఏషియా

సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. ఈ విమాన ప్రమాదంలో 162మంది ప్రయాణికులు సజీవ జలసమాధి అయ్యారు.

ఢిల్లీ జూ ఘటన

ఢిల్లీ జూ ఘటన

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో ఓ పులి విద్యార్థిని చంపింది. ఈ సంఘటన సెప్టెంబర్ నెలలో చోటు చేసుకుంది.

పాలెం బస్సు ప్రమాదం

పాలెం బస్సు ప్రమాదం

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర అక్టోబర్‌లో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో మంటలు వ్యాపించడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

పెషావర్ దాడులు

పెషావర్ దాడులు

డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో ఏడుగురు తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 150 మంది మృతి చెందారు.

జమ్మూకాశ్మీర్‌లో వరదలు

జమ్మూకాశ్మీర్‌లో వరదలు

జమ్మూ కాశ్నీర్‌లో ఈ ఏడాది సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 277మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎంహెచ్ 17 విమాన ప్రమాదం

తూర్పు ఉక్రెయిన్‌లో క్షిపణి దాడిలో కూలిపోయిన విమాన ప్రమాద ఘటనలో ఎంహెచ్ 17 చవిమానంలోని 298 ప్రయాణికులతోపాటు విమాన సిబ్బంది మృత్యువాతపడ్డారు. అమ్‌స్టర్‌డమ్ నుంచి కౌలాలంపూర్ బయల్దేరిన మలేషియా విమానాన్ని తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో క్షిపణి దాడి చేయడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. పెద్ద ఎత్తును మంటలు ఎగిశాయి.

ఎంహెచ్ 370 విమానం గల్లంతు

ఈ ఏడాది మార్చిలో ఎంహెచ్ 370 విమానం గల్లంతయింది. కౌలాలంపూర్ నుండి బీజింగ్‌కు వెళ్తున్న ఈ విమానంలో 239 మంది ప్రయాణీకులు ఉన్నారు. ఇందులో ఐదుగురు బారతీయులు ఉన్నారు. క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు.

ఎయిర్ ఏషియా: 162మంది జలసమాధి

సురబయ - సింగపూర్ విమానం క్యూజెడ్ 8501 విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లుగా ఇండోనేషియా అధికారులు ధృవీకరించారు. 162 మందితో అదృశ్యమైన ఎయిర్ ఏషియా విమానాన్ని గుర్తించామని ఇండోనేషియా సివిల్ ఏవియేషన్ అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ విమాన ప్రమాదంలో 162మంది ప్రయాణికులు సజీవ జలసమాధి అయ్యారు.

పెషావర్ ఆర్మీ స్కూల్: 148మందిని కాల్చి చంపిన తాలిబన్లు

డిసెంబర్ 16న పెషావర్ సైనిక పాఠశాలలో ఏడుగురు తాలిబన్ ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 150 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువమంది విద్యార్థులే కాగా, మరికొందరు ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఉన్నారు. పాఠశాలలో కాల్పుల ఘటన తర్వాత పాకిస్థాన్ ఉగ్రవాదులపై దాడులను ముమ్మరం చేసింది.

సముద్రంలో నౌక మునక, 70 మంది మృతి

ఆఫ్రికన్ ప్రవాసితులు ప్రయాణిస్తున్న నౌక ఎర్ర సముద్రంలో బోర్లాపడటంతో 70 మంది మృతి చెందారు. దేశ పశ్చిమ తీరంలో ఈ సంఘటన జరిగింది. మృతుల్లో ఎక్కువమంది ఇథియోపియాకు చెందిన వారున్నారు. ఈ ఘటన డిసెంబర్‌ మొదటి వారంలో చోటు చేసుకుంది.

జమ్మూకాశ్మీర్ వరదలు

జమ్మూ కాశ్నీర్‌లో ఈ ఏడాది సంభవించిన భారీ వర్షాలు, వరదల్లో 277మంది ప్రాణాలు కోల్పోయారు. పది రోజుల పాటు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ వరదల వల్ల జమ్మూ ప్రాంతంలో 210 మంది మృత్యువాతపడ్డారని, కాశ్మీర్ ప్రాంతంలో 60 మందికి పైగా మరణించారు.

ఢిల్లీ జూలో యువకుడిని చంపిన పులి

దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతు ప్రదర్శన శాలలో ఓ పులి విద్యార్థిని చంపింది. ఈ సంఘటన సెప్టెంబర్ నెలలో చోటు చేసుకుంది. మృతి చెందిన విద్యార్థి పన్నెండో తరగతి విద్యార్థి. విద్యార్థిని చంపింది తెల్లపులి. విద్యార్థి పైన పులి దాడి చేయగా అతనికి తీవ్రంగా గాయాలై మృతి చెందాడు.

పాలెం బస్సు ప్రమాదం: 45మంది సజీవ దహనం

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం పాలెం దగ్గర అక్టోబర్‌లో జరిగిన ఘోర ప్రమాదం జరిగింది. వోల్వో బస్సులో మంటలు వ్యాపించడంతో 45 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

English summary
Heavy accidents occured in world wide and india in 2014 year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X