చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఐటీ దాడులు, కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్, కంపెనీ అకౌంటెంట్ ఆత్మహత్య, భార్యకు ఫోన్ చేసి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) దాడులతో ఆందోళనకు గురైన ప్రముఖ కంపెనీ అకౌంటెంట్ సెంథిల్ కుమార్ (38) ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఆత్మహత్య చేసుకున్న అకౌంటెంట్ కంప్యూటర్ లోని హార్డ్ డిస్క్ లో సుమారు 150కి పైగా బ్లూ ఫిల్మ్స్ (పొర్న్ వీడియోలు) ఉన్నాయని ఐటీ శాఖ అధికారులు అంటున్నారు. తన విషయం మొత్తం కంపెనీ ఉద్యోగులకు, కుటుంబ సభ్యులకు తెలిసిపోందనే ఆందోళనతో అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అధికారులు అంటున్నారు. అయితే ఐటీ శాఖ అధికారులు వేదింపుల కారణంగా అతని భార్యకు ఫోన్ చేసిన తరువాత అకౌంటెంట్ ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు, ఆయన స్నేహితులు ఆరోపిస్తున్నారు.

డిగ్రీ కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు, అంతే!డిగ్రీ కాలేజ్ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రియుడు, అంతే!

ప్రముఖ కంపెనీ అకౌంటెంట్

ప్రముఖ కంపెనీ అకౌంటెంట్

చెన్నైలోని అడయార్ ప్రాంతంలోని కెనాల్ క్రాస్ రోడ్డులో అశ్వినీ ఫిష్షరీష్ (చేపలు) కంపెనీ ఉంది. ఈ అశ్వినీ కంపెనీ విదేశాలకు చేపలు ఎగుమతి చేస్తుంటుంది. అశ్వీన్ కంపెనీలో చెన్నైలోని వడపళని ప్రాంతంలో నివాసం ఉంటున్న సెంథిల్ కుమార్ (38) అకౌంటెంట్ గా ఉద్యోగం చేస్తున్నాడు.

ఐటీ శాఖ దాడులు

ఐటీ శాఖ దాడులు

విదేశాలకు చేపలు ఎగుమతి చేస్తున్న అశ్వినీ కంపెనీ నిర్వహకులు భారీ మొత్తంలో పన్ను ఎగవేస్తున్నారని, తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారని ఆరోపణలు రావడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు చెన్నైతో పాటు వివిద ప్రాంతాల్లో ఉన్న ఆ కంపెనీల కార్యాలయాల మీద దాడులు చేశారు.

మూడు రోజులు ఐటీ సోదాలు

మూడు రోజులు ఐటీ సోదాలు

మూడు రోజుల పాటు ఆదాయపన్ను శాఖ అధికారులు అశ్వినీ చేపల ఎగుమతి కంపెనీ కార్యాలయాల్లో సోదాలు చేశారు. కంపెనీ ఉద్యోగులు కంప్యూటర్లు స్వాధీనం చేసుకుని పరిశీలించారు. అశ్వినీ కంపెనీ రికార్డులు మొత్తం పరిశీలించిన ఆదాయపన్ను శాఖ అధికారులు అందులోకి వివరాలు పూర్తిగా పరిశీలించారు.

కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్ !

కంప్యూటర్లో 150 బ్లూ ఫిల్మ్స్ !

అశ్వినీ కంపెనీ అకౌంటెంట్ సెంథిల్ కుమార్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ పరిశీలించిన ఐటీ శాఖ అధికారులు హడలిపోయారని తెలిసింది. సెంథిల్ కుమార్ కంప్యూటర్ లోని హార్డ్ డిస్క్ లో సుమారు 150కి పైగా బ్లూ ఫిల్స్మ్ ఉన్న విషయం గుర్తించిన ఐటీ శాఖ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

కంపెనీలో ఆత్మహత్య

కంపెనీలో ఆత్మహత్య

ఐటీ శాఖ అధికారులు అశ్వినీ కంపెనీలో సోదాలు పూర్తి చేసి విలువైన సమాచారం చేకరించారు. తరువాత కంపెనీ కార్యాలయంలోకి కంప్యూటర్ల హార్డ్ డిస్క్ లు, అకౌంటెంట్ సెంథిల్ కుమార్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకుని వెళ్లారు. ఐటీ శాఖ సోదాలు పూర్తి అయిన తరువాత కంపెనీలో తన క్యాబిన్ ( గది)లోకి వెళ్లిన సెంథిల్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న కంపెనీ యాజమాన్యం, కంపెనీ ఉద్యోగులు హడలిపోయారు.

భార్యకు చివరి ఫోన్ !

భార్యకు చివరి ఫోన్ !

సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడని వారి బంధువు శంకర్ అంటున్నారు. భార్యకు ఫోన్ చేసిన సెంథిల్ కుమార్ మా కంపెనీలో ఐటీ శాఖ దాడులు జరిగాయని, ఐటీ శాఖ అధికారుల ప్రశ్నలతో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తన మీద ఒత్తిడి ఎక్కువ అయ్యిందని, మన పిల్లలను జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఫోన్ కట్ చేశాడని శంకర్ మీడియాకు చెప్పారు.

ఐటీ శాఖ టార్చర్ ?

ఐటీ శాఖ టార్చర్ ?

ఐటీ శాఖ అధికారులు ప్రశ్నలతో వేధింపులకు గురి చెయ్యడం వలనే సెంథిల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే సెంథిల్ కుమార్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లో 150కి పైగా బ్లూ ఫిల్మ్స్ ఉన్నాయని, ఆ విషయం కంపెనీ ఉద్యోగులు అందరికీ తెలిసిపోయిందని భయంతో ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆదాయపన్ను శాఖ అధికారులు జాతీయ మీడియాకు చెప్పారు. అడయార్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

English summary
A 38-year-old accountant allegedly killed himself inside his office, where an Income Tax (I-T) raid was in progress, in Adyar in Chennai. Police suspect that he took the extreme step as a hard disk containing ‘obscene movies’ was found in his cabin during the raid.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X