వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi violence: ఐబీ అధికారి హత్య కేసులో తాహిర్ హుస్సేన్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్లలో ఇంటెలీజెన్స్ బ్యూరో(ఐబీ) అధికారి అంకిత్ శర్మను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత, కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్ పాత్ర ఉందన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో అతడు పరారీలో ఉన్నాడు.

కాగా, తాను కోర్టులో లొంగిపోతానంటూ తాహిర్ హుస్సేన్ అభ్యర్థించినప్పటికీ కోర్టు తిరస్కరించింది. తాహిర్ హుస్సేన్‌ను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది.

ముందస్తు బెయిల్ కావాలంటూ మంగళవారం తాహిర్ హుస్సేన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. అయితే, విచారణను కోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఈ క్రమంలో గురువారం తాహిర్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు.. అరెస్టుకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గురువారం తాహిర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Accused in IB Staffers Murder: Expelled AAP Corporator Tahir Hussain Arrested

అంకిత్ శర్మ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తాహిర్ హుస్సేన్‌పై కేసు నమోదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్(ఐపీసీ) సెక్షన్ 365(అపహరణ), 302(హత్య) నేరం కింద తాహిర్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఢిల్లీ అల్లర్లు జరిగిన సమయంలో తాహిర్ హుస్సేన్.. తన నివాసం వద్దే ఉన్నారని, అక్కడే చాలా మంది గుమిగూడి ఉన్నారని పోలీసులు తెలిపారు.

అయితే, ఫిబ్రవరి 26న అంకిత్ శర్మ మృతదేహాన్ని డ్రైనేజీ నుంచి బయటికి తీసిన తర్వాత నుంచి తాహిర్ హుస్సేన్ అందుబాటులో లేడని పోలీసులు తెలిపారు. ఆయన ఇంట్లో వెతికినప్పటికీ దొరకలేదని, అతడు పరారీలో ఉన్నాడని పోలీసలు చెప్పారు.
కాగా, తాహిర్ హుస్సేన్‌కు చెందిన భవనంలోకి చేరిన ఆందోళనకారులు అక్కడ్నుంచి సమీపంలోని ఇళ్లపై పెట్రోల్ బాంబులు విసిరినట్లు పలు వీడియోలు కూడా బయటికి రావడం గమనార్హం.

కాగా, తాహిర్ హుస్సేన్.. అల్లర్లు జరుగుతున్న సమయంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ తో టచ్ లో ఉన్నాడని ఓ బీజేపీ నేత ఆరోపించారు. ఈశాన్యఢిల్లీలో అల్లర్లను ప్రోత్సహించారనే ఆరోపణలు రావడంతో తాహిర్ హుస్సేన్ ను అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. విచారణలో నిర్ధోషిగా తేలితేనే తిరిగిపార్టీలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

విచారణలో భాగంగా దర్యాప్తు జరిపిన పోలీసులు.. తాహిర్ హుస్సేన్ భవనంలో అల్లర్లలో ఉపయోగించిన ఇటుకలు, పెట్రోల్ బాంబులు, కర్రలు లభ్యమయ్యాయి. అయితే, తాను అమాయకుడినని, అల్లర్లతోనూ, ఆ హత్యతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని తాహిర్ హుస్సేన్ తెలిపారు.

English summary
Accused in IB Staffer's Murder: Expelled AAP Corporator Tahir Hussain Arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X