• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

1993 ముంబై పేలుళ్ల ప్రధాన నిందితుడి అరెస్ట్.. ఇన్నేళ్లు ఎక్కడ?

|

1993 ముంబై సీరియల్ పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకరైన మునాఫ్ హలారీని గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేసింది. పేలుళ్ల తర్వాత పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న హలారీని డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా ఏటీఎస్ అధికారులు పట్టుకున్నారు. పేలుళ్ల సూత్రధారి టైగర్ మొమెన్‌కు మునాఫ్ ప్రధాన అనుచరుడు. పాకిస్తాన్ పాస్‌పోర్టుతో దుబాయ్ పారిపోయేందుకు ఆదివారం రాత్రి మునాఫ్ ముంబై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో అరెస్ట్ చేసినట్టు ఏటీఎస్ అధికారి తెలిపారు.నార్కోటిక్స్ డ్రగ్స్ కేసులో మునాఫ్ హలారీ వాంటెడ్ లిస్టులో ఉన్నట్టు చెప్పారు.

 నార్కోటిక్ డ్రగ్స్ కేసులో..

నార్కోటిక్ డ్రగ్స్ కేసులో..

ఈ ఏడాది జనవరి 2న గుజరాత్‌ కోస్తా తీరం వెంబడి హెరాయిన్ డ్రగ్స్ రవాణా చేస్తూ ఐదుగురు పాకిస్తానీలు పట్టుబడ్డారు. ఈ ముఠా వెనుక మునాఫ్ హలారీ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 1993 ముంబై పేలుళ్లలో మునాఫ్ హస్తం కూడా ఉంది. సీబీఐ ఆదేశాల మేరకు మునాఫ్ కోసం రెడ్ కార్నర్ నోటీస్ కూడా జారీ చేశారు.

టైగర్ మొమెన్ ప్రధాన అనుచరుడు...

టైగర్ మొమెన్ ప్రధాన అనుచరుడు...

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ప్రధాన అనుచరుడు టైగర్ మొమెన్‌కు మునాఫ్ హలారీ ప్రధాన అనుచరుడు. ముంబై పేలుళ్లలో కీలకంగా వ్యవహరించిన మునాఫ్.. మూడు బ్రాండ్ న్యూ స్కూటర్స్‌లో పేలుడు పదార్థాలు నింపి.. వాటిని ముంబైలోని వివిధ ప్రాంతాల్లో పార్క్ చేసి పేలుళ్లకు పాల్పడ్డాడు. మార్చి 12,1993న చోటు చేసుకున్న ఈ పేలుళ్లలో 257 మంది మృతి చెందారు. 713 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబై పేలుళ్ల తర్వాత బరేలీకి పారిపోయిన మునాఫ్.. అక్కడినుంచి బ్యాంకాంక్‌కు పారిపోయాడు.

 నైరోబీ నుంచి కార్యకలాపాలు...

నైరోబీ నుంచి కార్యకలాపాలు...

పాకిస్తానీ అధికారుల సహకారంతో టైగర్ మొమెన్‌తో పాటు తనకూ పాకిస్తానీ పాస్‌పోర్ట్ దక్కించుకున్నాడు. అందులో తన పేరును అన్వర్ మహమ్మద్‌గా పేర్కొన్నాడు. ఆ పాస్‌పోర్టు నంబర్‌ను ఏటీఎస్ స్క్వాడ్ BM1799983గా గుర్తించారు.టైగర్ మొమెన్‌తో నిరంతరం టచ్‌లో ఉంటూ వచ్చిన మునాఫ్ హలారీ.. ముంబై పేలుళ్ల కేసు నుంచి తప్పించుకునేందుకు కెన్యాలోని నైరోబీలో తలదాచుకున్నాడు. గుజరాత్ ఏటీఎస్ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నైరోబీలో టైగర్ మొమెన్ బిజినెస్ నిర్వహించాడు. ఆ తర్వాత తృణధాన్యాలు,బియ్యం ఎగుమతులు,దిగుమతులు చేశాడు. అయితే ధాన్యం ఎగుమతులు,దిగుమతుల ముసుగులో భారత్‌కు పేలుడు పదార్థాలు పంపించేందుకు కుట్ర కూడా చేశాడు.

డ్రగ్స్ కేసులో కూపీ లాగితే..

డ్రగ్స్ కేసులో కూపీ లాగితే..

ఇటీవల గుజరాత్‌లో డ్రగ్స్ రవాణా చేస్తూ పట్టుబడిన ఐదుగురిని విచారించగా.. మునాఫ్ హలారీ పేరు బయటపడింది. ఆ ఐదుగురు నిందితులు తీసుకొచ్చిన కరాచీలోని హాజీ హసన్‌కు చెందినదిగా ఏటీఎస్ అధికారులు గుర్తించారు. పోలీసులు హాజీ హసన్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా.. మునాఫ్ హలారీ పేరు బయటపెట్టాడు. ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ వెనకాల మునాఫ్ ఉన్నట్టు చెప్పాడు.1993 ముంబై పేలుళ్ల తర్వాత భారత్ నుంచి పారిపోయిన మునాఫ్.. ఆ తర్వాత ఫేక్ పాస్‌పోర్టుపై రెండుసార్లు ఇండియా వచ్చి వెళ్లినట్టు ఏటీఎస్ అధికారులు తెలిపారు. చివరిసారిగా 2014లో అతను ఇండియా వచ్చి ముంబైకి కూడా వెళ్లినట్టు గుర్తించారు. తాజాగా ముంబై ఎయిర్‌పోర్టులో అతన్ని అదుపులోకి తీసుకున్న తర్వాత పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నారు. పాకిస్తానీ అధికారులు రెండుసార్లు దాన్ని రెన్యువల్ చేసినట్టు గుర్తించారు. 1993 ముంబై పేలుళ్లతో పాటు డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులు అతనిపై నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

English summary
A key accused in the 1993 Mumbai serial blasts, who is a close associate of the terror attack's key conspirator Tiger Memon, was arrested from the airport in Maharashtra's capital by the Gujarat Anti-Terror Squad (ATS) in a drug seizure case, a senior official said on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X