వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశ ప్రజలందరికీ ఎల్పీజీ: మోడీ ప్రభుత్వంలో ‘ఉజ్వల’మే

ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం 2016, మేలో ప్రారంభించబడింది. వచ్చే మూడేళ్లలో దేశంలోని 5కోట్ల బీపీఎల్ కుటుంబాలకు ఎల్బీజీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి ఉజ్వల యోజన(పీఎంయూవై) అనేది నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం. ఈ పథకం 2016, మేలో ప్రారంభించబడింది. వచ్చే మూడేళ్లలో దేశంలోని 5కోట్ల బీపీఎల్ కుటుంబాలకు ఎల్బీజీ కనెక్షన్స్ అందించడమే దీని ప్రధాన లక్ష్యం. ఈ కథనం ముఖ్యంగా ఉజ్వల పథకాన్ని ప్రభుత్వం ఏవిధంగా అమలు చేస్తోందనే విషయంపై దృష్టి సారించింది.

ఉజ్వల ప్రాముఖ్యత ఏమిటి?

దేశంలోని లక్షలాది కుటుంబాలు ఇప్పటికీ వంట చెరకుగా కిరోసిన్, కట్టెలు, బొగ్గు, ఆవు పేడ, తదితరాలను ఉపయోగిస్తున్నాయి. కాలుష్య నివారణ, పేదల ఆరోగ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం దేశంలోని పేదలందరికీ ఎల్పీజీ సౌకర్యాన్ని కల్పించాలని సంకల్పించి ఉజ్వల పథకాన్ని ప్రారంభించింది.

ఎల్పీజీ వల్ల కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు మహిళలు, పిల్లలకు ఇంతర వంటచెరకు వల్ల వచ్చే ఊపిరిత్తుల వ్యాధులను దరిచేరకుండా చేయాలనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం. పైన తెలిపిన వంటచెరకును కాల్చడం ద్వారా ఇంట్లో 400 సిగరేట్లను కాల్చినమేర కాలుష్యం జరిగినట్లవుతుంది.

Achieving Universal LPG Coverage? Tracking the Progress of Ujjwala under Modi Government

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం.. అపరిశుభ్రమైన ఇంధనాలుఉపయోగించడం ద్వారా ప్రతి ఏడాదీ 5లక్షల మంది మహిళలు మృతి చెందుతున్నారు. ఎల్పీజీ సౌకర్యం పేదలకు కల్పించడం ద్వారా దేశంలోని మహిళల ఆరోగ్య స్థితిని మెరుగుపర్చవచ్చు. ఉజ్వల పథకంలో ఎల్పీజీ కనెక్షన్లు కూడా మహిళల పేరుతోనే అందించడం జరుగుతోంది. ప్రభుత్వం అందించే సబ్సిడీ మొత్తం కూడా మహిళల ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుంది. దీని ద్వారా వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగయ్యే అవకాశం ఉంది.

ఉజ్వల కార్యక్రమం ఎలా ముందుకెళ్తోంది?

ఈ పథకం ప్రారంభించి ఏడాది పూర్తయింది. ఇప్పటికే దేశంలోని 694 జిల్లాల్లో ఎల్పీజీ సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ పథకం కింద 2.2కోట్ల కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. గత ఒక్క సంవత్సరంలోనే ఎల్పీజీ కనెక్షన్లు 10శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం దేశంలోని ప్రతీ 10మందిలో 7గురికి ఎల్పీజీ కనెక్షన్ కల్పించడం జరిగింది.

దేశంలో 2016-17 సంవత్సరానికి గానూ 3.25 కొత్త ఎల్పీజీ కనెక్షన్లు(ఉజ్వల-నాన్ ఉజ్వల ఎల్పీజీ కనెక్షన్లు కలిపి) నమోదయ్యాయి. ఇదే ఒక ఏడాదిలో అత్యధిక ఎల్పీజీ కనెక్షన్లు కల్పించిన సంవత్సరంగా చరిత్ర సృష్టించింది. ప్రభుత్వం నిర్ణయించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఉజ్వల పథకం కొనసాగుతుండటం మంచి పరిణామం. అంతేగాక, యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ గ్రామీణ ఎల్పీజీ వితరణ్ యోజన(ఆర్‌జీజీ ఎల్పీవై) కంటే కూడా ఎన్నో రేట్లు ఎక్కువగా ఈ పథకం ద్వారా పేదలకు ఎల్పీజీ కనెక్షన్లు ఇవ్వడం జరిగుతోంది.

ఆర్థిక క్రమశిక్షణ

ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సీఎస్ఆర్ నిధులు ఆర్‌జీజీ ఎల్పీవైకి నిధులు మంజూరయ్యేవి. కాగా, ఉజ్వల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రూ.8000కోట్లను ప్రస్తుత ప్రభుత్వం కేటాయించింది. ప్రభుత్వంపై భారీగా భారం పడకుండా సంపన్నులు సబ్సిడీని వదులుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కోటిమంది(1.05కోట్లు)కి పైగా తమ సబ్సిడీని వదులుకోవడం(గివ్ ఇట్ అప్)తో ఆ మేర పేద కుటుంబాలకు సబ్సిడీ ఎల్పీజీ కనెక్షన్లను అందించింది ప్రభుత్వం. పహల్ కార్యక్రమం ద్వారా ఎల్పీజీ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోంది.

ముందుకు సాగుతోందిలా..

ఉజ్వల పథకం అమలు సమర్థవంతంగా సాగుతోంది. పథకం అమలైన ఏడాదిలోనే మెరుగైన ఫలితాలను నమోదు చేసింది. పథకం అమలులో ఎలాంటి లోపాలు లేకుండా ఇలానే కొనసాగిస్తే ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకున్న సమయానికి ముందే నెరవేరుతుంది. కొందరు గ్రామీణ పేదలు ఎల్పీజీ సౌకర్యం అందుబాటులోకి వస్తోన్న సాంప్రదాయ వంటచెరకునే ఉపయోగించుకునేందుకు ఇష్టపడుతుండటం కూడా కొంత మేర పథకం అమలుకు సమస్యగా మారుతోంది. ఇలాంటి వారిని కూడా ఎల్పీజీ ప్రయోజనాలను వివరించి కనెక్షన్లను తీసుకునేలా చేయాల్సిన అవసరం ఉంది.

(రాన్నితి కన్సల్టింగ్ అండ్ రీసెర్చ్ మేనేజింగ్ పాట్నర్ నితిన్ మెహతా, ఇండిపెండెంట్ రీసెర్చర్ ప్రణవ్ గుప్తా)

English summary
Pradhan Mantri Ujjwala Yojana (PMUY) is one of the flagship programmes of the Modi government. The scheme was launched in May 2016, with the aim of providing 5 crore LPG connections to BPL families over the next three years. This article focuses on the progress made by the government in the implementation of Ujjwala, and existing gaps in this scheme which may need government attention.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X