కిరాతకం : పెళ్ళి ప్రతిపాదనను వ్యతిరేకించినందున కొడుకుపై యాసిడ్ దాడి
తనను పెళ్ళిచేసుకొనేందుకు ఓ వివాహిత ఒప్పుకోకపోవడంతో ఆమె రెండేళ్ళ కొడుకును కిడ్నాప్ చేసి యాసిడ్ పోసి గాయపర్చాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ :తనను పెళ్ళిచేసుకొనేందుకు తిరస్కరించిందనే కోపంతో ఆమె రెండేళ్ళ కొడుకును కిడ్నాప్ చేసి యాసిడ్ పోసి గాయపర్చాడు. ఈ ఘటన న్యూఢిల్లీలో చోటుచేసుకొంది.
న్యూఢిల్లీలో జామ్నా, సోనీలు దంపతులు కూలీ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వారికి ఆదిత్య అనే రెండేళ్ళ కొడుకు ఉన్నాడు. సోనిపై కన్నేసిన మంగళ్ అనే వ్యక్తి ఆమెను వేధించసాగాడు. భర్తను వదిలేసి తనను వివాహం ఆడాలని పదేపదే కోరుతున్నాడు.

అయితే ఈ ప్రతిపాదనను సోని తిరస్కరిస్తోంది.పలు మార్లు ఆమెకు నచ్చచెప్పేందుకు మంగళ్ ప్రయత్నించాడు.కాని ఆమె ససేమిరా అంది.దీంతో ఆమెపై కక్ష పెంచుకొన్నాడు మంగళ్.
మంగళవారం నాడు తన ఇంటి వద్ద ఆడుకొంటున్న ఆదిత్యను మంగళ్ కిడ్నాప్ చేశాడు. అతనిపై యాసిడ్ పోసి గాయపర్చాడు. వెంటనే పక్కనే ఉన్న చెత్తకుండీలో ఆదిత్యను వేసి పారిపోయాడు.
చెత్తకుండీలో నుండి పిల్లవాడి ఏడుపును విన్న చెత్త ట్రాలీ డ్రైవర్ స్థానికులకు సమాచారం ఇచ్చాడు. అయితే అప్పటికే బాలుడు ముఖం 20 శాతం పైగా కాలిపోయింది. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు.
ఆదిత్యకు చికిత్స చేస్తున్నారు.అయితే ఆదిత్య ఓ కన్నును కోల్పోవల్సి వచ్చింది. ప్రాణాపాయం తప్పిందని వైద్యులు చెప్పారు. అయితే సిసి టీవి పుటేజ్ ఆదారంగా పోలీసులు నిందితుడిని అరెస్టుచేశారు.












Click it and Unblock the Notifications