వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2014: మోడీ ముందు మోకరిల్లారు! రజనీకాంత్‌పై ఆశ వదిలేశారు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మోకరిల్లాయి! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన దేశాలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, ప్రధాని అయ్యాక రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. లోకసభ ఎన్నికల్లో మోడీ మేజిక్ పని చేసింది. మిత్రపక్షాలతో కలిసి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తారని అందరు భావించారు. కానీ, మోడీ ప్రభావంతో బీజేపీయే మేజిక్ ఫిగర్ దాటింది.

మోడీ ధాటికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ మాత్రం మోడీ వేవ్‌ను తట్టుకొని నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేనంత దిగజారిపోయింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా వ్యూహంతో యూపీలో కమలం 73 స్థానాల్లో జెండా ఎగురవేసింది.

బీజేపీకి స్పష్టమైన మెజార్టీ వచ్చినప్పటికీ మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లోను మోడీ హవా కనిపించింది. దీంతో అమిత్ షా 2014 సంవత్సరాన్ని బీజేపీ విజయనామ సంవత్సరంగా అభివర్ణించారు.

అంతర్జాతీయంగా చూస్తే స్కాట్లాండ్, క్రిమియాలలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలు ప్రపంచాన్ని ఆకర్షించాయి. రెండుచోట్ల కూడా కలిసి ఉందామనే అభిప్రాయం వ్యక్తమయింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. థాయ్‌లాండులో ఫిబ్రవరిలో హింసాకాండ చెలరేగింది. దీంతో ఆపద్ధర్మ ప్రధాని షినవత్రా రాజధాని వదిలి పెట్టారు. కోర్టులో ఆమెకు చుక్కెదురయింది.

ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా మార్చిలో స్వతంత్ర దేశంగా అవతరించింది. ప్రపంచవ్యాప్తంగా ఇసిస్ ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పలువురిని మట్టుబెట్టారు. పాకిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. పెషావర్ పాఠశాలలో 149 మంది పిల్లలు, టీచర్లను బలిగొన్నారు. పాక్‌కు చెందిన మలాలా, భారత్‌కు చెందిన సత్యార్థి నోబెల్ అందుకున్నారు.

నరేంద్ర మోడీ

నరేంద్ర మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ ముందు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు మోకరిల్లాయి! గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు వీసా ఇవ్వడానికి నిరాకరించిన దేశాలు.. సార్వత్రిక ఎన్నికల్లో విజయ ఢంకా మోగించి, ప్రధాని అయ్యాక రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి.

మోడీ

మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 2వ తేదీన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2019 వరకు జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్న క్లీన్ ఇండియా సాకారం కావాలని ఆకాంక్షిస్తున్నారు.

పెషావర్

పెషావర్

పాకిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోయారు. పెషావర్ పాఠశాలలో 149 మంది పిల్లలు, టీచర్లను బలిగొన్నారు.

రాంపాల్

రాంపాల్

హర్యానాకు చెందిన సంత్ రామ్ పాల్ జైలు పాలయ్యారు. ఆయన ఆశ్రమంలో జరిగిన కాల్పులలో పలువురు మృతి చెందారు.

నవాజ్ షరీఫ్

నవాజ్ షరీఫ్

ప్రధాని నరేంద్ర మోడీ తాను బాధ్యతలు స్వీకరించే సమయంలో పాకిస్తాన్‌కు చెందిన నవాజ్ షరీఫ్‌ను కూడా ఆహ్వానించారు.

మోడీ

మోడీ

మోడీ ధాటికి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దాదాపు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంది. తమిళనాడులో జయలలిత, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్ మాత్రం మోడీ వేవ్‌ను తట్టుకొని నిలబడ్డారు.

రజనీకాంత్

రజనీకాంత్

సార్వత్రిక ఎన్నికల ముందు మోడీ.. సూపర్ స్టార్ రజనీకాంత్‌ను కలవడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీలో చేరుతారనే ఊహాగానాలు వినిపించాయి. ఇప్పుడు రజనీ కాంత్ పైన బీజేపీ ఆశలు వదిలేసుకుంది.

మోడీ

మోడీ

ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

మోడీ

మోడీ

ఎన్నికల్లో గెలిచాక మోడీ తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు. బీజేపీ అగ్రనేత అద్వానీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi wields the broom during a surprise visit to the Mandir Marg Police Station after launch of 'Swachh Bharat Abhiyan' in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X