వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ ఆత్మ ఇచ్చిన తీర్పు: పన్నీర్, తెర మీదకు‘జయ’సెంటిమెంట్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు అపద్దర్మ ముఖ్యమంత్రి ఇప్పుడు జయలలిత సెంటిమెంట్ తో ముందుకు దూసుకుపోతున్నారు.అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక చీఫ్ శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అమ్మ సెంటిమెంట్ జోడించి తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు పన్నీర్ సెల్వం.

<strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!</strong>సీన్ రివర్స్: ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం: అధికారంలోకి డీఎంకే!

ఇది అమ్మ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, ఇది అమ్మ ఇచ్చిన తీర్పు అని ఆయన ప్రచారం మొదలుపెట్టారు. శశికళపై తిరుగుబాటు చేసే సమయంలో జయలలిత సమాధి వద్ద పన్నీర్ సెల్వం అమ్మ ఆత్మ చెప్పింది అనే సెంటిమెంట్ ను ప్రజల ముందుకు తీసుకు వచ్చారు.

ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో మరో సారి అమ్మ సెంటిమెంట్ ను తెరమీదకు తీసుకు వచ్చారు. జయలలిత ఆశించిన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకే అమ్మ ఆత్మనే ఈ తీర్పు చెప్పిందని పన్నీర్ సెల్వం అంటున్నారు.

<strong>అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ ఎన్నిక చెల్లదు: ఎన్నికల కమిషన్ కు!</strong>అన్నాడీఎంకే చీఫ్ గా శశికళ ఎన్నిక చెల్లదు: ఎన్నికల కమిషన్ కు!

Acting Tamil Nadu Chief Minister Panneerselvam started a signature campaign

అమ్మ ఆశయాలు కాపాడుకోవడానికి, అమ్మ పాలన సాగేందుకు దోహదపడడం మన కర్తవ్యం అని పన్నీర్ సెల్వం చెబుతున్నారు. అందుకే శశికళ శిభిరంలో ఉన్న ఎమ్మెల్యేలు బయటకురావాలని పిలుపునిచ్చారు. పన్నీర్ సెల్వం పిలుపుమేరకు శశికళ శిభిరంలోని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు బయటకు వచ్చేస్తున్నారు.

ఇప్పటికే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ప్రత్యక్షంగా అమ్మ సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వంతో కలిసి పనిచేస్తానని మీడియాకు చెప్పారు. జయలలిత నిజమైన వారసురాలు దీపానే అని అన్నాడీఎంకే కార్యకర్తలు ఇప్పటికే గట్టిగా చెప్పారు. కార్యకర్తల అండ ఉన్నంతరకు విజయం మనదే అని పన్నీర్ సెల్వం అంటున్నారు.

English summary
Deepa accompanied Panneerselvam and hundreds of supporters on a late-night march to Jayalalithaa’s memorial in Chennai. I and Panneerselvam will act as the two hands of the AIADMK. We will work together in future.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X