వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెచ్చగొట్టేలా మాట్లాడిన వారిపై సీరియస్ యాక్షన్, కపిల్ మిశ్రా అతీతుడేమీ కాదన్న గౌతమ్ గంభీర్

|
Google Oneindia TeluguNews

ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక పరిస్థితికి బీజేపీ నేత కపిల్ మిశ్రా కారణమని ఊహాగానాలు వినిపిస్తోన్న క్రమంలో ఆ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. హింసను ప్రేరేపించేలా ప్రవర్తించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారు ఎంతటివారైనా చర్యలు తప్పవని స్పష్టంచేశారు.

Recommended Video

Evening News Express : 3 Minutes 10 Headlines | 5 Key Deals Between India & USA | Oneindia Telugu
అతీతుడు ఏం కాదు..

అతీతుడు ఏం కాదు..

రెచ్చగొట్టే ప్రసంగం చేసిన వారు ఎవరైనా సంబంధం లేదని గౌతం గంభీర్ స్పష్టంచేశారు. కపిల్ మిశ్రా, మరేవరైనా సంబంధం లేదన్నారు. ఇతర పార్టే కాదు.. తమ పార్టీకి చెందినవారైనా సరై చర్యలు తప్పవని స్పష్టంచేశారు. ఒకవేళ రెచ్చొగొట్టేలా కపిల్ మిశ్రా మాట్లాడితే కఠిన చర్యలు తప్పవని తేల్చిచెప్పారు. ఇందులో సందేహానికి తావులేదని క్లారిటీ ఇచ్చారు.

సీఏఏకు అనుకూలం, వ్యతిరేకం..

సీఏఏకు అనుకూలం, వ్యతిరేకం..

ఈశాన్య ఢిల్లీలోని జాఫ్రాబాద్, మౌజ్‌పూర్‌ తదితర ప్రాంతాల్లో పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు చేసిన నిరసన ఉద్రిక్తతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏడుగురు చనిపోగా.. అందులో ఒకరు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. సమీప ప్రాంతాల్లో కూడా నిరసనలు కొనసాగడంతో భద్రతా బలగాలను మొహరించారు.

కేజ్రీవాల్ సమీక్ష

కేజ్రీవాల్ సమీక్ష

ఈశాన్య ఢిల్లీలో పరిస్థితిపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశమై.. సమీక్షించారు. ఆందోళనకారులు శాంతియుతంగా ఉండాలని, వారి సమస్యపై చర్చించేందుకు సిద్ధమని కేజ్రీవాల్ ప్రకటించారు. మరోవైపు జాఫ్రాబద్, మౌజ్‌పూర్-బాబర్‌పూర్, గోకుల్‌పురి, జాహ్రీ, శివ్ విహార్ మెట్రో స్టేషన్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అమిత్ షా సమీక్ష

అమిత్ షా సమీక్ష

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందును అనుసరించాల్సిన వ్యుహంపై డిస్కష్ చేశారు. అవసరమైతే ఆర్మీని రంగంలోకి దించుతామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

English summary
Delhi BJP MP Gautam Gambhir has hit out at fellow party leader Kapil Mishra for his provocative speech at the violence-hit Jaffrabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X