వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రక్షాళనకు కార్యాచరణ: గంగానదిలో ఉమ్మేస్తే జైలుకే..

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గంగానది ప్రక్షాళనను నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మోడీ ప్రభుత్వం అందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే పనిలో ఉంది. గంగానదిలో ఎవరైనా ఉమ్మేసినా లేదా చెత్త, పాలిథీన్ కవర్లు వేసినా కనిపిస్తే వారికి మూడు రోజుల జైలు శిక్ష లేదా రూ.10 వేల జరిమానా విధించే యోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది.

గంగా శుద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శాఖ బాధ్యతలు చేపట్టిన కేంద్ర మంత్రి ఉమాభారతి 'అవిరళ గంగ-నిర్మల గంగ' కోసం కృషి చేస్తామని, ప్రాచీన కాలంలో గంగ ఎంత శుద్ధంగా ఉండేదో తిరిగి అంత స్వచ్ఛంగా ఉండేలా చర్యలు చేపడతామని ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Action plan to clean Ganga river

భారత్‌లోని ముఖ్యమైన నగరాలలో కోల్‌కతా అత్యుత్తమని, చండీగఢ్‌లో ప్రజా జీవనం అత్యంత దుర్లభమని ఓ అధ్యయనంలో తేలింది. ఐటీ హబ్‌గా పేర్కొంటున్న మన హైదరాబాద్‌ది ఈ అధ్యయనంలో చివరి నుంచి ఐదో స్థానమని తేలింది. పాట్నా, రాంచీ, ముంబై తదితర నగరాలు హైదరాబాద్ కంటే ఎంతో మెరుగుగా తేలాయి.

చట్టాల అమలు, పటిష్టమైన విధానాలు, బాధ్యతాయుతమైన యంత్రాంగం, మెరుగైన జీవన ప్రమాణాలు ఇలా పలు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని భారత్‌లోని ముఖ్యమైన నగరాలలో చేసిన అధ్యయనంలో కోల్‌కతా పరిస్థితే ఉన్నంతలో మెరుగ్గా ఉంది. జనాగ్రహ్ సంస్థ నిర్వహించిన ఈ అధ్యయనంలో ప్రపంచంలోని ఇతర ముఖ్య నగరాలతో మన నగరాలు ఏ మాత్రం పోటీ పడలేదు.

English summary
PM Narendra Modi's NDA government is formulating action plan to clean Ganga river.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X