శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆర్య సమాజ్ నేత, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త, ఆర్య సమాజ్ నేత స్వామి అగ్నివేశ్(80) కన్నుమూశారు. పలు అనారోగ్య సమస్యలు, కాలేయ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిల్లరీ సైన్సెస్(ఐఎల్‌బీఎస్)లో చేరారు.

నాలుగు రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయనకు శుక్రవారం సాయంత్రం గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

Activist and Arya Samaj Leader Swami Agnivesh Dies At 80 After Multi-organ Failure

1939 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళంలో జన్మించారు. నాలుగేళ్లకే తండ్రి మరణించడంతో తాత వద్దే పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ గ్లేవియర్ కాలేజీ నుంచి లా, కామర్స్‌లో పట్టా పొందారు. ఆర్య సమాజ్ సూత్రాలతో 1970లో ఆర్యసభ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.

1977లో హర్యానాలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అంతేగాక, మంత్రిగానూ ఆయన సేవలందించారు. బాలల వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించేందుకు బాండెడ్ లేబర్ లిబరేషన్ ఫ్రంట్‌ను స్థాపించారు. మాయిస్టులతో చర్చలు జరపడంలో కీలకంగా వ్యవహరించారు.

కాగా, ఆయన మహిళల హక్కులు, బ్రుణ హత్యలకు వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశారు. స్వామి అగ్నివేశ్ మరణం పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్నివేశ్ మరణం తీరనిలోటని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యానించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూాడా అగ్నివేశ్ మరణంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన సేవలను మరువలేమని చెప్పారు.

English summary
Former Haryana MLA and Arya Samaj leader Swami Agnivesh, who was hospitalised due to liver cirrhosis and was in a critical condition, died at a hospital in New Delhi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X