వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దిశ రవికి బెయిల్.. రూ.లక్ష పూచికత్తుపై మంజూరు

|
Google Oneindia TeluguNews

ఎట్టకేలకు పర్యావరణ వేత్త దిశ రవికి బెయిల్ లభించింది. టూల్​కిట్​ వ్యవహారంలో అరెస్టయిన దిశ రవికి ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు రూ.లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. సహ నిందితులు నికత జాకబ్​, శంతను ములుక్​తో కలిపి ప్రశ్నించారు. ఇప్పటికే జాకబ్​, ములుక్​.. సోమవారం విచారణ ఎదుర్కొన్నారు.

 13వ తేదీన అరెస్ట్.. నేడు బెయిల్

13వ తేదీన అరెస్ట్.. నేడు బెయిల్

భారతదేశంలో రైతుల నిరసనలకు మద్దతుగా గ్రెటా థన్‌బర్గ్ షేర్ చేసిన 'టూల్‌కిట్' మీద నమోదైన కేసులో దిశా రవిని ఈ నెల 13న బెంగళూరులో దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కోర్టు ఫిబ్రవరి 20న విచారణ జరిపిన తర్వాత తమ తీర్పును రిజర్వులో పెట్టింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. దిశ రవి టూల్‌కిట్ గూగుల్ డాక్యుమెంట్ ఎడిటర్. ఈ డాక్యుమెంట్‌ను తయారు చేయడంలోనూ, ప్రచారం చేయడంలోనూ ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.

వ్యతిరేక ప్రచారం..?

వ్యతిరేక ప్రచారం..?

ఖలిస్తాన్ మద్దతుదారు 'పోయెటిక్ జస్టిస్ ఫౌండేషన్‌'తో కలిసి దిశ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారాలు చేస్తున్నారు. దిశనే ఈ టూల్‌కిట్‌ను గ్రేటా థన్‌బర్గ్‌తో పంచుకున్నారు. ఈ టూల్‌కిట్ రూపొందించడం కోసం ఒక వాట్సాప్ గ్రూప్‌ను కూడా దిశ ఏర్పాటు చేశారు. టూల్ కిట్ పైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన బృందంతో దిశ కలిసి పనిచేశారని ఢిల్లీ కోర్టులో పోలీసులు చెప్పారు. జనవరి 26వ తేదీన ఢిల్లీలో జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారమే జరిగాయని, అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర ఉందని" పోలీసులు పేర్కొన్నారు.

రైతుల ఆందోళనతో అరెస్ట్, విడుదల...

రైతుల ఆందోళనతో అరెస్ట్, విడుదల...

ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన దిశా రవి.. బెంగళూరులోని ఓ ప్రైవేటు కాలేజీలో ఆమె బీబీఏ డిగ్రీ చదువుతున్నారు. 2018లో గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణ దిశగా 'సేవ్ ది ఎన్విరాన్‌మెంట్ క్యాంపెయిన్‌'తో ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనాన్ని సృష్టిస్తున్న సమయంలోనే దిశా రవి 'ఫ్రైడేస్ ఫర్ ఫ్యూచర్ ఇండియా' ప్రచారం మొదలుపెట్టారు. భారత్‌లో వాతావరణ మార్పుల నియంత్రణకు నిర్వహిస్తున్న చాలా ఉద్యమాల్లో దిశ పాల్గొన్నారు. ఇదే అంశంపై గతంలో ఆమె బెంగళూరులో నిరసనలు కూడా చేపట్టారు. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపి.. అరెస్ట్ అయ్యారు.

English summary
Activist Disha Ravi, 22, was on Tuesday granted bail by a Delhi court in the 'tool-kit' case
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X