బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్ కుమార్ స్మారకం పక్కనే ప్రభుత్వ లాంచనాలతో రెబల్ స్టార్ అంత్యక్రియలు: సీఎం, పుకార్లు వద్దు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బహుబాషనటుడు, కన్నడ రెబల్ స్టార్, కేంద్ర మాజీ మంత్రి అంబరీష్ (66) అంత్యక్రియలు సోమవారం బెంగళూరు నగరంలోని కంఠీరవ స్టూడియోలోని రాజ్ కుమార్ స్మారకం పక్కనే ప్రభుత్వ లాంచనాలతో నిర్వహిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. అంబరీష్ అంత్యక్రియల విషయంలో వస్తున్న పుకార్లను అభిమానులు నమ్మకూడదని ఆయన కుటుంబ సభ్యులు మనవి చేశారు.

Recommended Video

Ambareesh : అంబరీష్ చివరి చూపుకోసం తరలి వస్తున్న సినీ రాజకీయ ప్రముఖులు | Oneindia Telugu
మా స్నేహం వేరు

మా స్నేహం వేరు

స్యాండిల్ వుడ్ లో అంబరీష్ ప్రత్యేక నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారని, రాజకీయంగా ఆయన ప్రజలకు చేసిన సేవ ఎప్పటికి గుర్తుండిపోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి అన్నారు. సినీరంగంలో, రాజకీయాల కంటే మామధ్య చెప్పుకోవడానికి వీలులేని స్నేహం ఉందని సీఎం కుమారస్వామి కన్నీరు పెట్టుకున్నారు. పార్టీలు ఎవైనా మేము ఇద్దరు ఎంతో స్నేహంగా ఉన్నామని, అంబరీష్ లేరనే ఒక్క విషయం జీర్ణించుకోలేకపోతున్నానని కుమారస్వామి కన్నీరు పెట్టుకున్నారు.

రాజకుమార్ స్మారకం

రాజకుమార్ స్మారకం

కంఠీరవ స్టూడియోలోని కన్నడ కంఠీరవడు డాక్టర్ రాజ్ కుమార్ స్మారకం పక్కనే రెబల్ స్టార్ అంబరీష్ అంత్యక్రియలు నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే అంబరీష్ పార్థీవశరీరం జేపీనగర్ లోని ఆయన నివాసానికి చేరుకుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు అంతిమదర్శనం చేసుకున్న తరువాత కంఠీరవ స్టూడియోకు పార్థీవదేహాన్ని తరలిస్తారని సమాచారం.

ప్రత్యేక బస్సులు

ప్రత్యేక బస్సులు

అంబరీష్ మండ్య జిల్లాలో జన్మించారు. మండ్య నుంచి మూడు సార్లు ఎంపీగా, ఎమ్మెల్యేగా పని చేశారు. కేంద్ర మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు దగ్గర అయ్యారు. అంతకు ముందే రెబల్ స్టార్ గా మండ్య ప్రజకు అత్యంత సన్నిహితుడు అయ్యారు. అంబరీష్ అనారోగ్యంతో మరణించడంతో ఆయనను అంతిమదర్శనం చేసుకోవడానికి బెంగళూరు వస్తున్న మండ్య జిల్లా ప్రజల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు.

అంబరీష్ జోకులు

అంబరీష్ జోకులు

స్నేహితులు, సన్నిహితులు, మీడియా, అభిమానులు ఇలా ఎవరైనా సరే ఎదైన ప్రశ్నలు వేస్తే వెంటనే సమాధానం ఇవ్వడం లేదా జోకులు వెయ్యడం అంబరీష్ కు అలవాటు. ఆయనతో మాట్లాడిన వ్యక్తులు నవ్వకుండా అక్కడి నుంచి వెళ్లారంటే అది నమ్మబుద్దికాదు. ఎందుకంటే ఏదో ఒక సందర్బంలో అంబరీష్ ఒక్క జోకు అయినా వేసి వచ్చిన వారిని నవ్వించి తిరిగి పంపిస్తుంటారని ఆయన అభిమానులు అంటున్నారు.

English summary
Karnataka Chief Minister H.D.Kumaraswamy said that, The last rites of Kannada senior actor and Former minister M.H.Ambareesh will be held in Kanteerava studio, Bengaluru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X