వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఆప్’కు నా మద్దతు లేదు: ఈసికి తెలిపిన అమీర్‌ఖాన్

|
Google Oneindia TeluguNews

ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీతోపాటు మిగితా ఏ ఇతర పార్టీలకి తాను మద్దతు పలకడం లేదని, సమర్థించడం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు 'ధూమ్' హీరో అమీర్ ఖాన్ తమ పార్టీకి మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ఫొటోతో ట్విట్టర్‌లో ప్రచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అమీర్ ఈసికి లేఖ రాసినట్లు తెలుస్తోంది. తాను ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీ కూడా మద్దతు తెలపడం లేదని ఎన్నికల సంఘానికి రాసిన లేఖలో అమీర్ పేర్కొన్నారు.

Actor Aamir Khan writes to EC, clarifies he is not supporting AAP

తాను ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు పలుకుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతున్నట్లు తన దృష్టికి వచ్చినట్లు అమీర్ తెలిపారు. అందుకే తాను కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారని, తన లేఖలో ఏ పార్టీకి తన మద్దతు తెలియజేయడం లేదని అమీర్ పేర్కొన్నట్లు ఆయన వ్యక్తిగత అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

‘నేను ఏ రాజకీయ పార్టీకి మద్దతు తెలపడం లేదు. ప్రత్యేకించి ఏ రాజకీయ పార్టీని సమర్థించడం లేదు. ఏ పార్టీ తరపున ప్రచారం కూడా నిర్వహించడం లేదు' అని అమీర్ ఖాన్ తన లేఖలో పేర్కొన్నట్లు అమీర్ వ్యక్తిగత అధికార ప్రతినిధి తెలిపారు. ఇప్పటికే అమీర్ ఖాన్ ఎన్నికల సంఘం తరపున ఓటింగ్‌పై ప్రజలకు అవగాహన పెంచేందుకు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

English summary
Superstar Aamir Khan has written a letter to the Election Commission (EC) clarifying that he is not endorsing any particular political party, including the Aam Aadmi Party (AAP).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X