వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎర్రకోట వద్దకు దీప్ సిద్ధు , ఇక్బాల్ సింగ్ ... రిపబ్లిక్ డే నాటి హింస, సీన్ రీక్రియేట్ చేస్తున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, వాటిని రద్దు చేయాలన్న డిమాండ్ తో అన్నదాతలు చేస్తున్న ఆందోళనలో భాగంగా రిపబ్లిక్ డే రోజున రైతులు ట్రాక్టర్ పరేడ్ నిర్వహించారు. కిసాన్ పరేడ్ పేరుతో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారడంతో అది దేశవ్యాప్త చర్చకు కారణమైంది. కిసాన్ పరేడ్ సందర్భంగా నిర్వహించిన ట్రాక్టర్స్ ర్యాలీలో చారిత్రాత్మక స్మారక చిహ్నమైన ఎర్రకోట వద్ద జరిగిన హింస ఘటనలో ప్రధాన నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఈరోజు వారిని తిరిగి ఎర్రకోట వద్దకు తీసుకువెళ్లారు.

 నిన్న దీప్ సిద్ధూ .. నేడు ఇక్బాల్ సింగ్ .. ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్ నిన్న దీప్ సిద్ధూ .. నేడు ఇక్బాల్ సింగ్ .. ఎర్రకోట హింస కేసులో మరో నిందితుడు అరెస్ట్

సీన్ రీ క్రియేట్ చేసేందుకు నిందితులను ఎర్ర కోట వద్దకు తీసుకెళ్ళిన పోలీసులు

సీన్ రీ క్రియేట్ చేసేందుకు నిందితులను ఎర్ర కోట వద్దకు తీసుకెళ్ళిన పోలీసులు


రిపబ్లిక్ డే రోజు జరిగిన హింసాత్మక ఘటనల సన్నివేశాలను సీన్ రీ క్రియేట్ చేసేందుకు నిందితులను ఎర్ర కోట వద్దకు తీసుకొని వెళ్లారు. పంజాబీ నటుడు, రైతు ఉద్యమకారుడు దీప్ సిద్ధూ తోపాటు మరో నిందితుడు ఇక్బాల్ సింగ్ ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శనివారం ఎర్రకోటకు వద్దకు తీసుకువెళ్లి నాటి సీన్ రీ క్రియేట్ చేశారు.

ఎర్ర కోట వద్ద జనవరి 26 హింసాకాండ మరియు విధ్వంసాల వెనుక ప్రధాన నిందితుడు దీప్ సిద్దూ పోలీసుల అభిప్రాయం.

నిఖితా శర్మ గ్లామర్ షో.. లేటేస్ట్ ఫోటోషూట్‌తో హంగామా!

ఎర్రకోట వద్ద ఏం జరిగిందో విచారణ .. సంఘటనా స్థలానికి నటుడు దీప్ సిద్ధు, ఇక్బాల్ సింగ్

ఎర్రకోట వద్ద ఏం జరిగిందో విచారణ .. సంఘటనా స్థలానికి నటుడు దీప్ సిద్ధు, ఇక్బాల్ సింగ్


హర్యానాలోని కర్నాల్ బైపాస్ నుంచి ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ బృందం అతన్ని అరెస్టు చేసి, ఏడు రోజుల పోలీసు కస్టడీకి పంపింది. రిపబ్లిక్ డే హింసపై దర్యాప్తులో భాగంగా సిద్దూ మరియు ఇక్బాల్ సింగ్ లను క్రైమ్ బ్రాంచ్ బృందం ఎర్ర కోటకు తీసుకెళ్లిందని ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

ఈ కేసును దర్యాప్తు చేస్తున్న బృందం వారు ఎర్రకోట వద్దకు చేరుకున్న మార్గం, ఎర్రకోటలో వారి కార్యకలాపాలు మరియు హింసాకాండ జరిగినప్పుడు స్మారక చిహ్నం వద్ద వారు జెండా ఎగరవేసిన విధానం వంటి ఘటనలను ధృవీకరించడానికి ఆ స్థలానికి నిందితులను తీసుకు వెళ్లారు.

ఎర్రకోట వద్ద హింస కేసు .. నిందితుల ఆచూకీ కోసం పోలీసుల రివార్డు

ఎర్రకోట వద్ద హింస కేసు .. నిందితుల ఆచూకీ కోసం పోలీసుల రివార్డు

ఎర్రకోటపై మతపరమైన జెండాను ఎగురవేసిన చర్యలో నటుడు దీప్ సిద్ధూ , జుగ్రాజ్ సింగ్, గుర్జోత్ సింగ్ మరియు గుర్జంత్ సింగ్ లపై కేసు నమోదు చేశారు. వీరి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డు ఇస్తామని ప్రకటించారు . ఈ కేసులో నిందితులైనసుఖ్ దేవ్ సింగ్,బూటాసింగ్,జజ్బీర్ సింగ్, ఇక్బాల్ సింగ్ ల ఆచూకి చెప్పినవారికి 50 వేల చొప్పున నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు

. పోలీసులను బెదిరించిన వ్యవహారంలో ఇక్బాల్ సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Actor-activist Deep Sidhu and another accused Iqbal Singh were taken to the Red Fort by the Delhi Police's Crime Branch on Saturday to recreate the scene of events that unfolded at the historic monument on Republic Day during the farmers' tractor parade, a police officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X