చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lockdown: హీరో కమల్ హాసన్ దశావతారంలో మరో అవతారం, మనమే పరిష్కారం, లాక్ డౌన్ ఎత్తేస్తే ? ఢీ !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: యూనివర్శల్ హీరో, దర్శక నిర్మాత, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ దశావతారంలో మరో అవతారం ఎత్తారు. కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి, పర్యావరణాన్ని పాకాడుకోవడానికి, పేదల ఆకలి తీర్చడానికి, వారిని ఆదువకోవడానికి నామే తీర్వు (మనమే పరిష్కారం) అనే సంఘాన్ని ఏర్పాటు చేశారు. లాక్ డౌన్ ఎత్తేస్తే ప్రజలు ఒక్కసారిగా బాహ్య ప్రపంచంలోకి వస్తారని, అప్పుడు కరోనా వైరస్ కట్టడి చెయ్యడం ఎవ్వరి వలన సాధ్యం కాదని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకు మనమే (ప్రభుత్వం కాకుండా) ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతోనే మనమే పరిష్కారం అనే సంఘాన్ని ఏర్పాటు చేశామని హీరో కమల్ హాసన్ అన్నారు. కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతిరోజు 24 గంటలు పని చేస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది పని చేస్తున్నారని, వారితో పాటు లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి పట్టెడు అన్నం పెట్టడానికి మనమే పరిష్కారం అనే సంఘాన్ని ఏర్పాటు చేశామని హీరో కమల్ హాసన్ వివరించారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

 పచ్చదనం కోసం పోరాటం

పచ్చదనం కోసం పోరాటం

కాలుష్యంతో సతమతం అవుతున్న ప్రపంచాన్ని కాపాడటానికి అనేక సంవత్సరాలుగా ఎందరో పోరాటం చేస్తున్నారని హీరో కమల్ హాసన్ గుర్తు చేశారు. ఇప్పుడు మనం పచ్చదనం కోసం అదనంగా ఏదైనా చెయ్యాల్సిన పరిస్థితి ఎదురైయ్యిందని, అందుకు ప్రతి ఒక్కరు ముందుకురావాలని హీరో కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

 ప్రజలకు మనం ఏం చేశాము ?

ప్రజలకు మనం ఏం చేశాము ?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం ప్రతిరోజు 24 గంటలు వైద్యులు, వైద్య సిబ్బంది పని చేస్తున్నారని హీరో కమల్ హాసన్ చెప్పారు. భారతదేశంలో లాక్ డౌన్ కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలు ఆకలితో అలమటిస్తున్నారని, వారికి పట్టెడు అన్నం పెట్టడానికి మనమే పరిష్కారం అనే సంఘాన్ని ఏర్పాటు చేశామని హీరో కమల్ హాసన్ వివరించారు.

 పదవులు శాశ్వతం కాదు మిత్రమా !

పదవులు శాశ్వతం కాదు మిత్రమా !

ప్రజలకు సేవ చెయ్యడానికి పార్టీలు, పదవులు అవసరం లేదని పరోక్షంగా ప్రభుత్వాలపైన హీరో కమల్ హాసన్ ద్వజమెత్తారు. ఈ విషయం కొందరు రాజకీయ నాయకులు గుర్తు పెట్టుకుంటే వారికే మంచిదని, పదవులు శాశ్వతం కాదనే విషయం గుర్తు పెట్టుకోవాలని హీరో కమల్ హాసన్ పరోక్షంగా తమిళనాడు ప్రభుత్వంపై సున్నితంగా విమర్శలు చేశారు.

 కరోనాను మించిపోయిన పేదల ఆకలి

కరోనాను మించిపోయిన పేదల ఆకలి

పేదల ఆకలి తీర్చడానికి, వారికి అన్నం పెట్టి ఆదువకోవడానికి దాతలతో పాటు కొన్ని లక్షల మంది మనమే పరిష్కారం అంటూ సహాయం చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని హీరో కమల్ హాసన్ అన్నారు. దేశంలో పేదరికం కరోనా వైరస్ ను మించిపోయిందని హీరో కమల్ హాసన్ విచారం వ్యక్తం చేశారు.

 చెన్నై కోసం ఆరాటం

చెన్నై కోసం ఆరాటం

తనలాంటి వారి కలలు సాకారం చేసిన చెన్నై నగరం నేడు కరోనా వైరస్ తో హడలిపోతున్నదని కమల్ హాసన్ విచారం వ్యక్తం చేశారు. చెన్నైని ఆదువకోవడానికి మరో ప్రయత్నంగా మనమే పరిష్కారం (నామే తీర్వు) అనే సంఘాన్ని ఏర్పాటు చేశామని, పేదలను ఆదుకుంటున్న అందర్నీ ఏకతాటిపైకి తీసుకురావడానికే ఈ సంఘం ఏర్పాటు చేశామని, ఈ సంఘానికి రాజకీయ రంగు పులమకూడదని హీరో కమల్ హాసన్ కొన్ని రాజకీయ పార్టీల నాయకులకు మనవి చేశారు.

Recommended Video

India-China Border Isssue,Talks To Be Held In Chushul Today
 లాక్ డౌన్ ఎత్తేస్తే బాహ్య ప్రపంచం !

లాక్ డౌన్ ఎత్తేస్తే బాహ్య ప్రపంచం !

కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చెయ్యడానికి లాక్ డౌన్ విదించారని, లాక్ డౌన్ ఎత్తేస్తే ఒక్కసారిగా ప్రజలు బాహ్య ప్రపంచంలోకి వస్తారని, అప్పుడు కరోనా వ్యాధి మరింత వ్యాపించే అవకాశం ఉందని హీరో కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా జరిగితే రెండు నెలలు విదించిన లాక్ డౌన్ కు ఎలాంటి ప్రయోజనం, ఫలితం ఉండదని, ప్రజల్లో కరోనా వైరస్ పై మరింత అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరు శ్రమించాలని ఆయన అభిమానులకు హీరో కమల్ హాసన్ మనవి చేశారు. పేదలకు సహాయాన్ని అందిస్తున్న అందర్నీ ఏకం చెయ్యడానికి హీరో కమల్ హాసన్ ప్రత్యేక హెల్ప్ లైన్ కోసం 63698 11111 ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

English summary
Lockdown: Makkal Neethi Maiyam president Kamal Haasan launched We are solution for the fighting against Coronavirus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X