• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

covid నుంచి కోలుకున్న sonu sood -తెలంగాణ వాసులకు కీలక సాయం -పొలిటికల్ ఎంట్రీ, దేశభక్తి

|

కరోనా విలయ కాలంలో ప్రభుత్వాలే కామ్ గా ఉండిపోయిన వేళ వలస కూలీలు, పేదలకు తానున్నానంటూ ముందుకొచ్చి, గడిచిన ఏడాది కాలంగా తనకు వీలైన అన్ని మార్గాల్లో సహాయ కార్యక్రమాలు చేస్తూ, ప్రజలకు ఆరాధ్యులయ్యారు నటుడు సోనూ సూద్. కొద్ది రోజుల కిందట కరోనా కాటుకు గురైన ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు. తాజా పరీక్షల్లో తనకు కొవిడ్-19 నెగటివ్ గా నిర్ధారణ అయిందని సోనూ సూద్ శుక్రవారం ప్రకటించారు. ఐసోలేషన్ లో ఉన్నప్పటికీ తన టీమ్ ద్వారా సహాయ కార్యక్రమాలను కొనసాగించారాయన..

ఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగంఇక జస్టిస్ రమణ చేతికి న్యాయ దండం -బాగా పనిచేశా, సంతృప్తిగా పదవీ విరమణ: జస్టిస్ బోబ్డే భావోద్వేగం

కరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతోకరోనా విలయం: ఎన్నికలు యథాతథం -కేసీఆర్ సర్కారు పట్టు, ఎస్ఈసీ ప్రకటన -రద్దుకు హైకోర్టు నో చెప్పడంతో

 తెలంగాణ నుంచి విన్నపాలు..

తెలంగాణ నుంచి విన్నపాలు..

తెలుగు సినిమాల్లో అన్నీ విలన్ పాత్రలే పోషించినప్పటికీ, తెలుగు వారి మనసుల్లో మాత్రం ఆయన హీరోగానే ముద్రపడ్డారనడానికి నిదర్శనంగా, సోనూను సహాయం కోసం అర్ధించే వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందినవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సోనూ చేసిన సాహాయం వల్లే కొవిడ్ విలయం నుంచి తన వాళ్లు బతికారంటూ హైదరాబాద్ కు చెందిన హర్ష అట్లూరి ధన్యవాదాలు చెప్పారు. కరీంనగర్ జిల్లాకు చెందిన పోతు మహేశ్ బాబు అనే వ్యక్తి తన నవజాత శిశువు ఏడు నెలలకే పుట్టాడని, కడుపులో ఇన్ఫెక్షన్ నయం అయ్యేందుకు ఆపరేషన్ సాయం చేయాల్సిందిగా సోనూను కోరగా, ‘మీ బిడ్డ బాధ్యత నాది. ఆపరేషన్ నేనే చేయిస్తా'' అని సూద్ హామీ ఇచ్చారు.

ఆక్సిజన్, రెమ్‌డెసివీర్, బెడ్స్..

ఆక్సిజన్, రెమ్‌డెసివీర్, బెడ్స్..

కరోనా రెండో దశ వ్యాప్తి అత్యంత ప్రమాదరకంగా ఉండటం, దాదాపు అన్ని ప్రధాన నగరాల్లోని ఆస్పత్రులు కొవిడ్ రోగులతో నిండిపోవడం, బెడ్ల కొరతకుతోడు ఆక్సిజన్, రెమ్‌డెసివీర్ ఇంజెక్షన్ల కొరత అందరినీ కలవరపెడుతున్నది. ఈ విషయమై సోనూ సూద్ కు వేలల్లో విన్నపాలు వెళుతున్నాయి. ‘‘ఆక్సిజన్, రెమ్‌డెసివీర్, బెడ్స్.. ప్రస్తుతం ఈ మూడు పదాలే నా చెవిలో మారుమోగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి దాకా, రాత్రి నుంచి మళ్లీ తెల్లారేదాకా ఆ మూడిటి కోసమే నేను ప్రయత్నిస్తున్నాను. సహాయం కొరినవాళ్లలో కొందరికి చేయగలిగాను, ఇంకొదరికి చేయలేకపోయాను. అయితే, నేను నా ప్రయత్నాన్ని మాత్రం ఎప్పటికీ విరమించను. మీకు తోడుగా ఉంటానని మాటిస్తున్నాను..'' అని సోనూ సూద్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే,

పొలిటికల్ ఎంట్రీ, దేశభక్తి..

పొలిటికల్ ఎంట్రీ, దేశభక్తి..

ఒక వ్యక్తిగా తన శక్తికి మించి ప్రజలకు సాయం చేస్తోన్న సోనూ సూద్ ను ప్రశంసించేవాళ్లతోపాటే వెటకారాలు చేసేవాళ్లూ తక్కువేం కాదు. సోనూ ఇంత పెద్ద స్థాయిలో కార్యక్రమాలు చేస్తుండటం వెనుక ఏదో రాజకీయ ఉద్దేశం లేకపోలేదనేవారికి దిమ్మతిరిగిలే ఆయన సమాధానమిచ్చారు. ‘‘మీరు కూడా రాజకీయాల్లోకి వచ్చేయండి సార్, కావాల్సిన ప్లాట్‌ఫామ్ ఎలాగూ రెడీ చేసుకున్నారుగా''అని ఓ నెటిజన్ ప్రశ్నించగా, ‘‘చూడు బ్రదర్.. రాజకీయాలు ఫ్లాట్‌ఫామ్ పైనే జరుగుతాయి. కానీ అసలైన పని మాత్రం కార్యక్షేత్రం(గ్రౌండ్)లోనే జరుగుతుంది''అని కౌంటరిచ్చారు సోనూ సూద్. అంతేకాదు, ‘‘ఆగస్టు 15న జెండాకు వందనం చేయడం మాత్రమే దేశభక్తి అనుకునేవారికి నా సందేశమిదే.. దేశం పట్ల మన భక్తిని చూపించుకోడానికి ప్రత్యేక సందర్భాలే కాదు, ప్రతిసారి ఆ అవకాశం ఉంటుంది'' అని సోనూ సూద్ పేర్కొన్నారు.

English summary
multilingual actor and philanthropist sonu sood has tested negative for covid-19. sonu sood on friday tweeted that he has recoverd from covid-19. "There will never be an important time to do something for the country and show patriotism" says actor in A message to those showing patriotism on 15 August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X