వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పౌరసత్వ సవరణ బిల్లు, ఆరోగ్యంగా ఉంటే ఆపరేషన్ చేస్తారా, చంపేస్తారా ? హీరో కమల్ హాసన్ !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కేంద్ర ప్రభుత్వం లోక్ సభ, రాజ్యసభలో ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో బహుబాష నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్ స్పంధించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పౌరసత్వ సవరణ బిల్లుతో దేశాన్ని ఉద్దరిస్తారా ? అంటూ హీరో కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ చేసినట్లు ఉందని హీరో కమల్ హాసన్ ఎద్దేవ చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుతో ఓ వర్గం వారికి న్యాయం చేసి మరో వర్గానికి అన్యాయం చేసే విధంగా ఉంటే ప్రజలు కచ్చితంగా తిరగబడుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని హీరో కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

తారతమ్యం చూపిస్తే ?

తారతమ్యం చూపిస్తే ?

పౌరసత్వ సవరణ బిల్లు వలన ప్రజల మధ్య మరింత తారతమ్యం ఏర్పడే అవకాశం ఉందని హీరో కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ (ఎన్డీఏ) తీరు చూస్తుంటే ప్రజలను విభజించు పాలించు అంటూ ముందుకు వెలుతున్నట్లు ఉందని, వీరి తీరు అలాగే ఉందని స్పష్టంగా కనిపిస్తోందని హీరో కమల్ హాసన్ ఆరోపించారు.

ఆరోగ్యంగా ఉంటే ఆపరేషన్ చేస్తారా ?

ఆరోగ్యంగా ఉంటే ఆపరేషన్ చేస్తారా ?

పౌరసత్వ సవరణ బిల్లు చూస్తుంటే ఆరోగ్యంగా ఉన్న వ్యక్తిని బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి ఆపరేషన్ (శాస్త్ర చికిత్స) చేసినట్లు ఉందని హీరో కమల్ హాసన్ ఎద్దేవ చేశారు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అలాగే ఉంటే బాగుంటుందని, అనవసరంగా ఆపరేషన్లు చేస్తే తరువాత అతను అనారోగ్యానికి గురై చచ్చిపోయే అవకాశం ఉందని హీరో కమల్ హాసన్ అన్నారు.

దేశానికి ద్రోహం చేస్తున్నారు

దేశానికి ద్రోహం చేస్తున్నారు

కేంద్ర ప్రభుత్వం తీరు చూస్తుంటే రాజ్యంగాన్ని గౌరవించడంలేదని అనుమానం వ్యక్తం అవుతోందని, మొండిగా పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశ పెట్టి దేశానికి ద్రోహం చేసినట్లు అవుతోందని హీరో కమల్ హాసన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీరును, పౌరసత్వ సవరణ బిల్లును నేటి యువత వ్యతిరేకించాలని, ఇలాంటి పనులు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని హీరో కమల్ హాసన్ యువతకు పిలుపునిచ్చారు.

రాజ్యసభలో చర్చ జరుగుతుంటే !

రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లు ప్రవేశపెట్టి ఒక వైపు చర్చ జరుగుతుంటే దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలో పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రజలు, యువత రోడ్ల మీదకు రావడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏమి జరుగుతుందో అంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ మండిపడుతున్నారు. పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది.

English summary
Makkal Needhi Maiam President Kamal Haasan says that trying to make changes in constitution is betrayal to people and to democracy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X