వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీటూ దెబ్బ: హై కోర్టుకు నటి శృతి హరిహరన్: ఎఫ్ఐఆర్ రద్దు, హీరో అర్జున్, పరువు నష్టం!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ హీరో అర్జున్ అలియాస్ అర్జున్ సర్జా తన మీద దాఖలు చేసిన కేసు ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యాలని బహుబాష నటి శృతి హరిహరన్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. తాను చేసిన మీటూ ఆరోపణలకు ప్రతీకారంగా తన మీద హీరో అర్జున్ తప్పుడు ఫిర్యాదు చేశారని శృతి హరిహరన్ ఆరోపిస్తున్నారు. హీరో అర్జున్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో బుధవారం విచారణ జరగనుంది.

 హీరో అర్జున్ పిటిషన్

హీరో అర్జున్ పిటిషన్

తన మీద దాఖలు అయిన లైంగిక వేధింపుల కేసు ఫిర్యాదు రద్దు చెయ్యాలని హీరో అర్జున్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. 2016 విస్మయ చిత్రం షూటింగ్ సందర్బంగా హీరో అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడని గత నెల 27వ తేదీన నటి శృతి హరిహరన్ బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సైబర్ క్రైం పోలీసులు

సైబర్ క్రైం పోలీసులు

బెంగళూరు సైబర్ క్రైం పోలీస్ స్టేషన్ లో హీరో అర్జున్ మేనేజర్ నటి శృతి హరిహరన్ మీద ఫిర్యాదు చేశారు. హీరో అర్జున్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన బెంగళూరు సైబర్ క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ తయారు చేసి విచారణ చేస్తున్నారు.

సోషల్ మీడియాలో రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ

ఫేస్ బుక్, ట్వీట్టర్ తో సహ సోషల్ మీడియాలో హీరో అర్జున్ కు వ్యతిరేకంగా ఆయన పరువుకు భంగం కలిగించే విధంగా నటి శృతి హరిహరన్ వ్యాఖ్యలు పోస్టు చేశారని ఆయన మేనేజర్ బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హై కోర్టుకు హీరో

హై కోర్టుకు హీరో

తన పరువుకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియాలో నటి శృతి హరిహరన్ ప్రచారం చేశారని ఆరోపిస్తూ హీరో అర్జున్ కర్ణాటక హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. హీరో అర్జున్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల మీద నటి శృతి హరిహరన్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.

హీరో ఫ్యామిలి

హీరో ఫ్యామిలి

తన మీద నమోదు అయిన ఎఫ్ఐఆర్ రద్దు చెయ్యాలని నటి శృతి హరిహరన్ హైకోర్టును ఆశ్రయించారు. విస్మయ చిత్రం షూటింగ్ సమయంలో హీరో అర్జున్ తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని నటి శృతి హరిహరన్ ఆరోపణలు చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం న్యాయస్థానంలో ఈ పిటిషన్ విచారణ జరగనుంది.

English summary
Actress Sruthi Hariharan moved the High Court of Karnataka seeking quash of FIR registered against her in Cyber Crime police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X