వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా సిద్దే చేశాడు..? రైతు నేతల సంచలన ఆరోపణలు.. కాంగ్రెస్ కూడా.. అబ్బే అదేం లేదట..?

|
Google Oneindia TeluguNews

వివాదాస్పద వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. జనవరి 26వ తేదీన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసతో హై టెన్షన్ నెలకొంది. అయితే ఆందోళనకారులను నటుడు, సింగర్ దీప్ సిద్దు రెచ్చగొట్టారని హర్యానా భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్ గుర్నామ్ సింగ్ చాదునీ ఆరోపించారు. వారిని సిద్దు తప్పుదోవ పట్టించాడని సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆందోళనతో రైతు నేతలకు ఏం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం చేశారు.

 ఎర్రకోటకు ఎలా..?

ఎర్రకోటకు ఎలా..?

కొందరీతో ఉన్న సమూహం ఎర్ర కోటకు వెళ్లిందని గుర్నామ్ తెలిపారు. వాస్తవానికి తాము ఎర్రకోటకు వెళ్లాలని అనుకోలేదని చెప్పారు. అక్కడ పతాకం ఎగరవేశారని వివరించారు. ఇదీ కేవలం సిద్దు ప్రేరేపించడం వల్ల మాత్రమే జరిగిందని వెల్లడించారు. గుర్నామ్ ఆరోపణలను స్వరాజ్ ఇండియా లీడర్ యోగేంద్ర యాదవ్ కూడా అంగీకరించారు. ఆయన వల్లే ఎర్రకోట వద్ద భీతవాహ పరిస్థితి తలెత్తిందని చెప్పారు. అడ్డుకునేందుకు శతవిధలా ప్రయత్నించామని వివరించారు. కానీ పరిస్థితి చేయిదాటి పోయిందని చెప్పారు.

క్షమించరాని నేరం

క్షమించరాని నేరం

ఎర్రకోట వద్ద జరిగిన ఘటన మాత్రం క్షమించరానిది అని చెప్పారు. తమతో ఉన్నవారంతా దేశబంధువులు అని.. తొలిరోజు నుంచి అంకితభావంతో పనిచేస్తున్నారని చెప్పారు. కానీ ఇవాళ జరిగిన ఘటనతో అందరికీ చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఇంతకీ దీప్ సిద్దు ఎర్ర కోట వద్దకు ఎలా చేరుకున్నారో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులను సిద్దు పలుమార్లు రెచ్చగొట్టాడని.. అందుకే వారు అలా చేశారని పేర్కొన్నారు.

 బీజేపీతో సన్నిహిత సంబంధాలు

బీజేపీతో సన్నిహిత సంబంధాలు

దీప్ సిద్దుకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. అంతేకాదు ఎంపీ సన్నీ డియోల్ ఎన్నికల సందర్భంలో ఏజెంట్‌గా కూడా పనిచేశారని తెలిపారు. ప్రధాని మోడీతో కూడా పలు సందర్భాల్లో కనిపించారని వివరించారు. దీనికి సంబంధించి తాము పోలీసులకు తెలిపామని.. కానీ వారు ఎలాంటి చర్య తీసుకోలేదని చెప్పారు. వీరితోపాటు కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కూడా హింసకు బాధ్యత వహించాలని చెప్పారు.

Recommended Video

Farmers Tractor Rally: Protesters Enter Delhi's Red Fort, Wave Their Flags From The Ramparts
సిద్దు బాధ్యుడు

సిద్దు బాధ్యుడు

ఘటనకు సిద్దు బాధ్యుడని కాంగ్రెస్ ఎంపీ రవ్ నీత్ సింగ్ బిట్టు తెలిపారు. అతను సిక్కులకు న్యాయం చేయాలనే అతివాద భావజాలంతో ఉంటారని తెలిపారు. కానీ దీప్ సిద్దు మాత్రం తాము శాంతియుతంగా నిరసన తెలియజేశామని.. జాతీయ జెండాను తొలగించలేదని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు.

English summary
Punjabi singer and actor Deep Sidhu of inciting and misguiding protesters Chief of the Haryana unit of the Bharatiya Kisan Union, Gurnam Singh Chaduni alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X