చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హ్యాపీ బర్త్ డే కమల్ హాసన్: ఉప ఎన్నికల్లో పోటీ, ఓటుకు నోటు వద్దు, స్టాలిన్ ఫోన్, ఫ్యాన్స్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: నీతి, నిజాయితీ కలిగిన రాజకీయాలు చెయ్యడానికి ప్రజల మద్దతు ఎంతో అవసరం అని ప్రముఖ హీరో, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అన్నారు. ఓటుకు నోటు తీసుకోకుండా ప్రజలు రాజకీయ పార్టీలకు సహకరించినప్పుడే దేశం బాగుపడుతుందని కమల్ హాసన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

అభిమానులతో భేటీ

అభిమానులతో భేటీ

బుధవారం 64వ జన్మదినం సందర్బంగా హీరో కమల్ హాసన్ తన అభిమానులతో భేటీ అయ్యారు. అభిమానులను కలుసుకున్న తరువాత కమల్ హాసన్ మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో ఖాళీ అయిన 20 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సిద్దంగా ఉందని కమల్ హాసన్ స్పష్టం చేశారు.

కరుణానిధి మరణంతో

కరుణానిధి మరణంతో

తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ ప్రజలకు ఏమీ చెయ్యలేదని, ఎలాంటి సమస్యలు తీరలేదని కమల్ హాసన్ ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో ఖాళీ అయిన నియోజక వర్గంతో సహ 20 నియోజక వర్గాల్లో ఎప్పుడు ఉప ఎన్నికలు జరిగినా తమ పార్టీ మద్దతుదారులు పోటీ చేస్తారని కమల్ హాసన్ అన్నారు.

అభిమానులు

అభిమానులు

తమిళ, తెలుగు, హిందీ, కన్నడ తదితర బాషల్లో దాదాపు 200 చిత్రాల్లో నటించిన కమల్ హాసన్ ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం చేశారు. పుట్టిన రోజు పేరుతో తన అభిమానులు డబ్బు వృదా చెయ్యరాదని, సామాజిక సేవా కార్యక్రమాలు చెయ్యాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

స్టాలిన్

స్టాలిన్

హీరో కమల్ హాసన్ కు బుధవారం ఫోన్ చేసిన డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే. స్టాలిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న కమల్ హాసన్ అభిమానులు ఆయన పేరుతో అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు.

English summary
Actor-filmmaker Kamal Haasan turns 64 today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X