వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండియన్ సినిమాలో విషాదం: బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు..!

|
Google Oneindia TeluguNews

ప్రముఖ బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇక లేరు. గత కొద్ది కాలంగా ఆయన పెద్ద ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. మంగళవారం ఆయన పరిస్థితి విషమించడంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌లో చేరారు. న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్‌తో తను పోరాడుతున్నట్లు 2018లోనే ఇర్ఫాన్‌ ఖాన్ తెలిపారు. ఇదిలా ఉంటే ఆయన మృతిని తన సన్నిహితులు ఒకరు ధృవీకరించారు. మరణించేనాటికి ఇర్ఫాన్ ఖాన్ వయస్సు 54 ఏళ్లు.

Recommended Video

Actor Irrfan Khan Lost Life at Mumbai’s Kokilaben Hospital
2018లో ఇర్ఫాన్‌ ఖాన్‌కు పెద్ద ప్రేగు క్యాన్సర్

2018లో ఇర్ఫాన్‌ ఖాన్‌కు పెద్ద ప్రేగు క్యాన్సర్

2018లో తాను ఓ క్యాన్సర్‌తో పోరాడుతున్నట్లు చెప్పారు ఇర్ఫాన్‌ఖాన్. మాటలు చాలా తక్కువగా మాట్లాడే ఇర్ఫాన్ ఖాన్... తెరమీద తన నటనతో చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇక ఇర్ఫాన్ ఖాన్ మృతిని ధృవీకరిస్తూ అతని సన్నిహితులు ఒకరు లేఖ విడుదల చేశారు. ఇర్ఫాన్‌ ఖాన్ మృతి తీరనిలోటని అందులో పేర్కొన్నారు.

అతన్ని చాలామంది స్ఫూర్తిగా తీసుకున్నారని వెల్లడించారు. 2018లో పెద్ద ప్రేగు క్యాన్సర్‌ సోకగానే దాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారని లేఖలో వివరించారు. ఆరోగ్యపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నటనకు మాత్రం దూరం కాలేదని లేఖలో పేర్కొన్నారు. ఇక తన పోరాటంలో బుధవారం రోజున ఇర్ఫాన్ ఖాన్ తుది శ్వాస విడిచారని వివరించారు.

తల్లి మరణం నుంచి కోలుకోక ముందే మరో విషాదం

తల్లి మరణం నుంచి కోలుకోక ముందే మరో విషాదం

ఇర్ఫాన్ ఖాన్ 2019లో విదేశాల్లో కూడా చికిత్స పొందారు. ఇక ఇర్ఫాన్ తల్లి సయీదా బేగం గత శనివారం మృతి చెందగా ఇప్పుడు ఆ కుటుంబంలో ఆయన మృతితో మరో విషాదం నెలకొంది. సయీదా బేగం అంత్యక్రియలను ఇర్ఫాన్ వీడియో కాల్ ద్వారా హాజరయ్యాడు. ఇక తన చివరి సినిమా విడుదలకు ముందు ఇర్ఫాన్ ఖాన్ తన అభిమానుల కోసం వీడియో ద్వారా సందేశం ఇచ్చారు. తనకు వేరే ఆప్షన్ లేదని కేవలం పాజిటివ్‌గా ధైర్యంగా ఉండటమనే ఆప్షన్ మాత్రమే ఉందని చెప్పారు.

 విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్

విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్

ఇక ఇర్ఫాన్ సినీ జీవితం చూస్తే ఇండస్ట్రీలో పలు దశాబ్దాలుగా ఉన్నారు. ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. అంతేకాదు పలు అంతర్జాతీయ సినిమాల్లో కూడా ఇర్ఫాన్ ఖాన్ మెరిశారు. స్లమ్ డాగ్ మిలియనీర్, జురాసిక్ వరల్డ్, ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ , లైఫ్ ఆఫ్ పై లాంటి సినిమాల్లో కీలక పాత్రను పోషించి సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. ఇక భారతీయ సినిమాల్లో తన తొలి చిత్రం సలామ్ బాంబే అకాడెమీ అవార్డులకు ఎంపికైంది. 2004లో విడుదలైన మక్బూల్, పాన్ సింగ్ తోమర్ (2011), ది లంచ్ బాక్స్ (2013) హైదర్(2014), గుండే (2014), పీకూ (2015), తల్వార్ (2015) హిందీ మీడియం (2017) చిత్రాలు ఇర్ఫాన్‌ఖాన్‌కు మంచి పేరును తీసుకొచ్చాయి.

పద్మశ్రీతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం

పద్మశ్రీతో గౌరవించిన కేంద్ర ప్రభుత్వం

మూడు దశాబ్దాల పాటు సినీ ఇండస్ట్రీలో ఉన్న ఇర్ఫాన్ ఖాన్ 50 సినిమాలకు పైగా నటించాడు. ఇందులో ఒక జాతీయ అవార్డు, 4 ఫిల్మ్ ఫేర్ అవార్డులను పొందాడు. 2011లో అతని నటనకుగాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. అంతేకాదు తన విలక్షణ నటనతో సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా అభిమానుల హృదయంలో కూడా చోటు దక్కించుకున్నారు. ఇక ఇర్ఫాన్ ఖాన్‌కు భార్య సుతాపా సిక్దర్, మరో ఇద్దరు పిల్లలు బాబిల్ అయాన్‌లు ఉన్నారు.

ఇర్ఫాన్ మృతికి పలువురు సంతాపం

ఇర్ఫాన్ ఖాన్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఇ:డియన్ సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయిందంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. అతని మరణ వార్త షాక్‌కు గురిచేసిందంటూ అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. భగవంతుడు ఇర్ఫాన్‌ఖాన్ ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్‌లో పేర్కొన్నారు

ఇక ఇర్ఫాన్ ఖాన్ మృతి వార్తను బాలీవుడ్ దర్శకులు షూజిత్ సర్కార్ ట్విటర్‌పై పోస్టు చేశారు. ఇర్ఫాన్ ఖాన్ బతికున్నంత కాలం పోరాడారంటూ ట్వీట్ చేసిన సర్కార్ ఇర్ఫాన్‌ఖాన్‌కు సెల్యూట్ చేస్తున్నట్లు చెప్పారు.

English summary
Actor Irrfan Khan passed away on Wednesday in Mumbai’s Kokilaben Dhirubhai Ambani Hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X