వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కావేరీ సమస్య, అందుకే పెరియార్, సిగ్గుండాలి, హీరో కమల్ ఫైర్, తమిళ జాతి క్షమించదు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో పెరియార్ రామస్వామి విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటనపై సినీ నటుడు, ఇటీవల రాజకీయాల్లోకి వచ్చిన హీరో కమల్ హాసన్ స్పంధించారు. పెరియార్ రామస్వామి విగ్రహాల ధ్వంసాన్ని ద్రవిడ జాతి క్షమించదని పరోక్షంగా బీజేపీ నాయకులను కమల్ హాసన్ హెచ్చరించారు. పెరియార్ విగ్రహాన్ని ధ్వసం చేసినందుకు తమిళ ప్రజలకు బీజేపీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కమల్ హాసన్ డిమాండ్ చేశారు.

 ప్రపంచంలోని తమిళ ప్రజలు

ప్రపంచంలోని తమిళ ప్రజలు

పెరియార్ విగ్రహాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిమీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాని కమల్ హాసన్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పెరియార్ ను అవమానిస్తే ప్రపంచంలోని తమిళ ప్రజలు అందర్నీ అవమానించినట్లే అని కమల్ హాసన్ అన్నారు

 ప్రభుత్వానికి సిగ్గుచేటు

ప్రభుత్వానికి సిగ్గుచేటు

బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్. రాజా మీద ఎలాంటి చర్యలు అవసరంలేదని స్వయంగా తమిళనాడు ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటు అని కమల్ హాసన్ మండిపడ్డారు. బీజేపీ నాయకుడు హెచ్. రాజా క్షమాపణలను తమిళ ప్రజలు అంగీకరించరాదని కమల్ హాసన్ మనవి చేశారు.

బీజేపీ కఠిన చర్యలు

బీజేపీ కఠిన చర్యలు

పెరియార్ విగ్రహాల విషయలో బీజేపీ నాయకుడు హెచ్. రాజా క్షమించరాని నేరం చేశాడని, తమిళ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో అతని క్షమించరాదని, అతనికి తమిళ ప్రజలు తగిన బుద్ది చెబుతారని కమల్ హాసన్ అన్నారు. హెచ్. రాజా మీద బీజేపీ నాయకులే కఠిన చర్యలు తీసుకోవాలని కమల్ హాసన్ డిమాండ్‌ చేశారు.

కావేరీ సమస్య

కావేరీ సమస్య

కావేరీ నదీనీటి పంపణి నిర్వహణ బోర్డు ఏర్పాటు చేసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ విషయం పక్కదారి పట్టించడానికి పెరియార్ విగ్రహాల వివాదాన్ని తెరమీదకు తీసుకువచ్చిందని కమల్ హాసన్ అనుమానం వ్యక్తం చేశారు.

 తమిళ ప్రజలకు తెలుసు

తమిళ ప్రజలకు తెలుసు

పెరియార్ విగ్రహాలను ఎలాకాపాడుకోవాలో తమిళ ప్రజలకు తెలుసని కమల్ హాసన్ అన్నారు. పెరియార్ విగ్రహాలు తొలగించాలనే నిచమైన ఆలోచన ఎలా వచ్చింది అని కమల్ హాసన్ మండిపడ్డారు. ఇదే సమయంలో పరోక్షంగా బీజేపీ నాయకుల తీరుపై కమల్ హాసన్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

English summary
Kamal Hassan says that H.Raja's comment on Periyar is a activity to divert people and political parties from Cauvery issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X