వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీరా మితున్ సంచలనం: సీఏఏకు అనుకూలంగా వీడియో, ప్రధాని మోడీపై ప్రశంసలు

|
Google Oneindia TeluguNews

పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై దేశం భగ్గుమంటోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొదలైన హింస ఉత్తర భారతదేశంలో విధ్వంసం సృష్టించింది. విపక్షాలు సహా కొన్ని వర్గాల మేధావుల నుంచి కూడా నిరసన వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలా ఉంటే కోలివుడ్ నటి మీరా మితున్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఓ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

పౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులుపౌరసత్వ సవరణ చట్టం ఎఫెక్ట్ : ముస్లిం కుటుంబాలకు పోలీసుల వేధింపులు

వివాదాస్పద వీడియోలు..

మీరా మితున్.. ఇదివరకు చాలా కాంట్రవర్సీ వీడియోలను పోస్ట్ చేశారు. ఆమెపై పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. బిగ్ బాస్-3 తమిళ్‌లో కూడా పార్టిసిపేట్ చేసిన తర్వాత ఆమె లైమ్‌లైట్‌లోకి వచ్చారు. తర్వాత సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తన పంథా మాత్రం మార్చుకోలేకపోయారు.

మద్దతుగా వీడియో

సీఏఏకు అనుకూలంగా ఓ వీడియో పోస్ట్ చేశారు. ఎన్డీఏ కొన్ని భాగస్వామ్య పక్షాలు కూడా సపోర్ట్ చేయని పరిస్థితుల్లో మీరా మితున్ మద్దతు చర్చానీయాంశమైంది. అంతేకాదు ప్రధాని మోడీకి మరింత శక్తినిచ్చేందుకు మనమంతా నిశ్శబ్ధంగా ఉండాలని ఉచిత సలహా కూడా ఇచ్చింది. ఆమె వీడియోలో ఏమన్నారో ఆమె మాటల్లోనే..

మంచిని స్వాగతించరట..

మంచిని స్వాగతించరట..

మంచిని ప్రజలు ఎప్పుడూ స్వాగతించరు అని మీరా మితున్ వీడియోలో సందేశం ప్రారంభించారు. కొన్ని దశాబ్ధాల తర్వాత మనకు మంచి జరుగుతుందని పేర్కొన్నారు. సీఏఏతో భవిష్యత్ బాగుంటుందని, ప్రధాని మోడీ చేసింది వందశాతం మంచి పని అని పేర్కొన్నారు. అందుకే మీరు ప్రధానమంత్రి అయ్యారని పొగడ్తలతో ముంచెత్తారు.

59 సెకన్ల వీడియో..

59 సెకన్ల వీడియో..

59 సెకన్ల నిడివిగల వీడియోలో సీఏఏ గురించి పొగిడారు. తీవ్రవాదం రూపుమాపాలన్న, భవిష్యత్ బాగుండాలన్న పౌరసత్వ సవరణ చట్టం అమలు కావాల్సిందేనని కరాఖండిగా చెప్పేశారు. ప్రధాని మోడీ చేసింది మనకోసమేనని చెప్పుకొచ్చారు.

English summary
actor Meera Mitun praise caa, pm modi also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X