వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నయా భారత్: బాబ్రీ మసీదు కూల్చివేత తీర్పుపై ప్రకాశ్ రాజ్, న్యాయం భూస్థాపితం..

|
Google Oneindia TeluguNews

బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించి లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. అద్వానీ సహా 32 మందిని జడ్జీ ప్రకటించారు. బీజేపీ, అనుకూలురు తీర్పును స్వాగతిస్తున్నారు. అయితే నటుడు ప్రకాశ్ రాజ్ మాత్రం వ్యతిరేక గళం వినిపించారు. కోర్టులను కూడా ప్రభావితం చేశారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. న్యాయ భూస్థాపితమయ్యిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏం జరిగిందంటే..

ఏం జరిగిందంటే..


1992 డిసెంబర్ 6వ తేదీన కర సేవకులు మసీదు ఉన్న స్థలాన్ని కూల్చివేశారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లబిర్హన్ కమిషన్ వేయగా.. అద్వానీ, జోషి నేరపూరిత కుట్ర ఉందని నివేదించింది. తర్వాత సీబీఐ విచారణ చేపట్టి.. అభియోగాలు మోపింది. సీబీఐ కోర్టు, అలహాబాద్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్లింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలతో 30వ తేదీన లక్నో సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పును వెల్లడించింది. 32 మందిపై అభియోగాలను రుజువు చేయడంలో సీబీఐ విఫలమయ్యిందని కోర్టు పేర్కొన్నది.

న్యాయం భూస్థాపితం

లక్నో కోర్టు సంచలన తీర్పుపై నటుడు ప్రకాశ్ రాజ్ వ్యతిరేకించారు. స్వతంత్ర్య దర్యాప్తు సంస్థ సీబీఐ ఆధారాలు నిరూపించకపోవడం ఏంటీ అని అన్నారు. బాబ్రీ మసీదు కేసును హిట్ అండ్ రన్ కేసు అని పోల్చాచు. హిట్ అండ్ రన్ కేసులో డ్రైవర్లు నిర్దోషులుగా ప్రకటించబడ్డారని ట్వీట్ చేశారు. అద్వానీ, జోషి తదితరులు రెచ్చగొట్టే ప్రసంగాలతో కర సేవకులు రెచ్చిపోయారని చెబుతుంటారు. కానీ ఇవాళ న్యాయం భూస్థాపితం అయ్యిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. ఇదీ నయా భారత్.. సరికొత్తగా ఆవిష్కృతం చెందుతుందని తెలిపారు.

47 కేసులు

47 కేసులు


మసీదు ధ్వంసం చేయడంతో చెలరేగిన ఘర్షణలతో అద్వానీ, అశోక్ సింఘాల్ సహా ఇతరులపై 47 కేసులు నమోదు చేశారు. మసీదు కూల్చివేసిన తర్వాత 10 రోజుల తర్వాత లిబర్ హన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 17 ఏళ్ల తర్వాత అద్వానా సహా నేతలు నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు కేంద్ర హోంశాఖకు నివేదిక సమర్పించింది.

48 మందిపై అభియోగాలు

48 మందిపై అభియోగాలు

1997లో 48 మంది కుట్రకు పాల్పడ్డారని లక్నో మేజిస్ట్రేట్ తేల్చారు. ఇక అప్పటినుంచి విచారణ పర్వం కొనసాగుతోంది. 2001 ఫిబ్రవరి 12వ తేదీన అలహాబాద్ హైకోర్టు అద్వానీ, జోషి, ఉమాభారతి, కల్యాణ్ సింగ్‌పై అభియోగాలు కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును సీబీఐ ఆశ్రయించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పును తప్పుపడుతూ నేరపూరిత కుట్ర కోణంలో విచారించాలని 2017 ఏప్రిల్ 19వ తేదీన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.ప్రత్యక్ష సాక్షులు, 100కు పైగా ఆడియో, వీడియో క్యాసెట్లను కోర్టు ముందు ప్రవేశపెట్టగా.. ఇవాళ కోర్టు తీర్పు చెప్పింది.

English summary
actor prakash raj response on babri masjid case. justice arrested he tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X