వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎగ్జిట్ పోల్స్ నిజం కాదు, ప్రజలు తీర్పు ముఖ్యం, నటుడు ప్రకాష్ రాజ్, అవి పగటి కలలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: దేశంలోని అనేక సర్వేలు మోడీ మళ్లీ ప్రధాని అవుతారని చెబుతున్న సమయంలో బెంగళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. సర్వేలు కాదు అధికారికంగా ఎన్నికల ఫలితాలు విడుదల కాని అంటున్నారు ప్రకాష్ రాజ్.

కొందరు పగటి కలలు కంటున్నారని ప్రకాష్ రాజ్ అంటున్నారు. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే వరకు వారిని పగటి కలలు కననివ్వండి తరువాత చూద్దం అంటున్నారు ప్రకాష్ రాజ్. ప్రజల తీర్పు మే 23వ తేది వెలుగు చూస్తుందని, సర్వేలు ఏమి చెప్పినా ప్రజల తీర్పు ముఖ్యం అంటున్నారు ప్రకాష్ రాజ్.

Actor Prakash Raj said, Exit polls will not be true.

మే 23 ఫలితాలు వెలువడుతాయని, అంత వరకూ మహాత్మగాంధీ రఘపతి రాఘవ రాజాం పాట పాడుకోవాలని ప్రకాష్ రాజ్ తన ట్వీట్ లో ప్రజలకు మనవి చేశారు. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కు ఆప్ మద్దతు ఇచ్చింది.

బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గం నుంచి సిట్టింగ్ ఎంపీ పీసీ. మోహన్, కాంగ్రెస్ నుంచి రిజ్వాన్ అర్షద్ పోటీ చేశారు. మొదటి నుంచి మోడీ మీద విమర్శలు చేస్తున్న ప్రకాష్ రాజ్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని కొందరు భావించారు.

తాను ఏ పార్టీ నుంచి పోటీ చెయ్యనని, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకాష్ అన్నారు. ఆదివారం సాయంత్రం విడుదలైన ఏ సర్వేని నమ్మడానికి వీలు కాదని, ప్రజల తీర్పు ముఖ్యం అంటున్నారు ప్రకాష్ రాజ్. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో ప్రకాష్ రాజ్ కు దెబ్బపడే అవకాశం ఉందని సమాచారం.

English summary
Exit Polls 2019: Prakash Raj, who is an actor, contested to Lok Sabha elections 2019 from Bangalore central constituency, said, Exit polls will not be true.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X