బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బహుబాష నటుడు ప్రకాష్ రాజ్ కు ఊహించని ఎదురు దెబ్బ, బెంగళూరు సెంట్రల్ లో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ నటుడు, దర్శక నిర్మత ప్రకాష్ రాజ్ బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల కౌంటింగ్ లో ప్రకాష్ రాజ్ కు ఉహించని ఎదురుదెబ్బ తగిలింది. ఊహించిన విదంగా ప్రకాష్ రాజ్ ను ప్రజలు ఆదరించలేదు.

బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజక వర్గంలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రకాష్ రాజ్ కు మొదటి రౌండ్ పూర్తి అయిన తరువాత 1, 263 ఓట్లు మాత్రం వచ్చాయి. బెంగళూరు సెంట్రల్ లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ ఒక్క రౌండ్ పూర్తి అయిన తరువాత బీజేపీ అభ్యర్థి పీసీ మోహన్ కు 36, 928 ఓట్లు రావడంతో 1, 089 ఓట్ల అధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల సంకీర్ణ అభ్యర్థి రిజ్వాన్ కు 35, 836 ఓట్లు వచ్చాయి.

Actor Prakash Raj trailing in Bangalore Centrral Lok Sabha seat.

ఖార్గేకి ఎదురు దెబ్బ
లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖార్గేకి ఊహించని ఎదురు గాలి వీస్తోంది. 1972 నుంచి 2014 వరకు కులబురిగి లోక్ సభ నియోజక వర్గం ఎంపీగా విజయం సాదించిన మల్లికార్జున్ ఖార్గేకి 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఎదురైయ్యింది.

కులబురిగి లోక్ సభ నియోజక వర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన డాక్టర్ ఉమేష్ జాదవ్ మల్లికార్జున్ ఖార్గేకి గట్టి పోటీ ఇచ్చారు. కులబురిగి లోక్ సభ నియోజక వర్గంలో రెండు రౌండ్లు పూర్తి అయిన తరువాత డాక్టర్ ఉమేష్ జాదవ్ 14, 000 మెజారిటీతో ముందంజలో ఉన్నారు. కర్ణాటకలోని అనేక లోక్ సభ నియోజక వర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

English summary
Actor Prakash Raj trailing in Bangalore Centrral Lok Sabha seat.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X