• search
 • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Drug mafia: రకుల్ ప్రీత్ కు రగులుతుంది మొగలిపొద గ్యారెంటి ?, ఆ రోజు దంచేసి ఈ రోజు ?, కలికాలం !

|

ముంబాయి/ న్యూఢిల్లి/ బెంగళూరు: బాలీవుడ్ ను కుదిపేస్తున్న Drug mafia కేసులో భాగంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ కు బ్లాక్ అండ్ వైట్ సినిమా కష్టాలు మొదలైనాయి. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) అధికారుల ముందు హాజరైన నటి రకుల్ ప్రీత్ సింగ్ ను 4 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించి విచారణ చేసిన అధికారులు విలువైన సమాచారం సేకరించారని తెలిసింది. మొత్తం మీద రకుల్ ప్రీత్ కు 'రగులుతుంది మొగలిపొద' గ్యారెంటి ? అంటూ కలవరం మొదలైయ్యిందని తెలిసింది. డ్రగ్స్ కు వ్యతిరేకంగా అమ్ముడు రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ లో ఆ రోజు దంచేసింది, ఈ రోజు అదే డ్రగ్స్ కేసులో చిక్కుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ దంచ్చుకొట్టుడు కొట్టిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వినేవాడు ఉంటే చెప్పేవాడికి లోకువ అనే సామెత అక్షరాలా రకుల్ ప్రీత్ సింగ్ కు వర్థిస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. మొత్తం మీద డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికి వెలుతుందో ? అంటూ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.

Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !Drugs racket: కంగనాకు షాక్, డ్రగ్స్ లింక్ పై విచారణ, సోనియా గాంధీని సీన్ లోకి లాగిన క్వీన్ !

 రియా దెబ్బకు రకుల్ కు రింగరింగ... రింగారింగా !

రియా దెబ్బకు రకుల్ కు రింగరింగ... రింగారింగా !

బాలీవుడ్, ముంబాయి డ్రగ్స్ మాఫియా కేసు విచారణ చేస్తున్న ఎన్ సీబీ అధికారుల జాబితాలో మొదట ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పేరు లేదని సమాచారం. అయితే డ్రగ్స్ దందా కేసులో అరెస్టు అయ్యి ముంబాయిలోని బైకుల్లా జైల్లో ఉంటున్న బాలీవుడ్ బ్యూటీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు రకుల్ ప్రీత్ సింగ్ పేరు టక్కున తెరమీదకు వచ్చింది.

 దెబ్బకు రకుల్ ప్రీత్ ఢమాల్ !

దెబ్బకు రకుల్ ప్రీత్ ఢమాల్ !

ప్రస్తుతం బాలీవుడ్ నటి రియా చక్రవర్తి పరిస్థితి మరీదీనంగా ఉంది. బైకుల్లా మహిళా సెంట్రల్ జైల్లో సాధారణ ఖైదీలతో పాటు రియా చక్రవర్తి కాలం గడుపుతోంది. అయితే ఎన్ సీబీ అధికారుల విచారణలో ఫేమస్ నటీనటుల పేర్లు రెండు సంఖ్యల్లో చెప్పిన రియా చక్రవర్తి చేతులు దులుపుకుందని తెలిసింది. మేడమ్ రియా చక్రవర్తి దెబ్బకు ఇప్పుడు అనేక మంది సెలబ్రిటీల గుండెల్లో నాన్ స్టాప్ ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిగెడుతున్నాయి. రియా దెబ్బతోనే రకుల్ ప్రీత్ సింగ్ కు అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

 హైదరాబాద్ లో దంచేసిన రకుల్

హైదరాబాద్ లో దంచేసిన రకుల్

టాలీవుడ్ ను రకుల్ ప్రీత్ సింగ్ ఓ ఊపు ఊపేస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా టాలీవుడ్ టాప్ హీరోలు అందరితో రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. 2017లో హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఓ అవగాహనా సదస్సు ఏర్పాటు చేశారు. ఆ సందర్బంలో నేటి యువతతో పాటు ప్రతిఒక్కరు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలంటూ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ జోరుగా ప్రచారం చేశారు. ఇప్పుడు అదే డ్రగ్స్ కేసులో అమ్మడు రకుల్ ప్రీత్ సింగ్ ను ఎన్ సీబీ అధికారులు విచారణ చేశారు. ఆ రోజు హైదరాబాద్ లో రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఫోటోలు, వీడియో నేడుసోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 ఇంటర్వూలో ఇరగదీసిన రకుల్ ప్రీత్

ఇంటర్వూలో ఇరగదీసిన రకుల్ ప్రీత్

రకుల్ ప్రీత్ సింగ్ ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్లూలో సైతం డ్రగ్స్ కు అందరూ దూరంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని, మనం ప్రతిరోజు వ్యాయామం చెయ్యాలని, వాకింగ్ చెయ్యాలని, శరీరం వంచాలని ఉచితసలహాలు ఇచ్చారు. స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇచ్చిన ఇంటర్వూ వీడియో ఇప్పుడు మళ్లీ తెరమీదకు వచ్చింది.

 నీకేం తల్లి... నీతులు ఎన్నైనా చెబుతావు

నీకేం తల్లి... నీతులు ఎన్నైనా చెబుతావు

మేడమ్ ఆరోజు మాకు నీతులు చెప్పి ఈ రోజు మీరు డ్రగ్స్ దందా కేసుల్లో చిక్కుకున్నారా ? అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. నీకేం తల్లి నువ్వు మాకు నీతులు ఎన్నైనా చెబుతావు, నువ్వు పాటిస్తున్నావా ? అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నిస్తున్నారు. నీకు డ్రగ్స్ కేసుతో సంబధం లేకపోతే అధికారుల ముందు హాజరు కావడానికి ముందు ఎందుకు ఆలోచించావు ? అంటు కొందరు అభిమానులు రకుల్ ప్రీత్ సింగ్ పై మండితున్నారు.

 నీళ్లు నమిలిన రకుల్ ప్రీత్ సింగ్ ?

నీళ్లు నమిలిన రకుల్ ప్రీత్ సింగ్ ?

బాలీవుడ్ వయ్యారిభామ రియా చక్రవర్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎన్ సీబీ అధికారులు అనేకకోణాల్లో విచారణ చేస్తున్నారుని తెలిసింది. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ కు డ్రగ్స్ దందాతో సంబంధాలు ఉన్నాయని మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అన్ని వివరాలు క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత నటి రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు మరికొందరు ఎన్ సీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మొత్తం మీద రకుల్ ప్రీత్ సింగ్ వ్యవహారంతో ఆమె అభిమానులు అయోమయంలో పడిపోయారు.

  COVID-19 సహా వైరల్ ఇన్ఫెక్షన్లను చంపడానికి APT™ T3X Ointment తో కరోనా వైరస్ కు చెక్ ! || Oneindia
   ఈ రోజు ఏం జరుగుతుందో ?

  ఈ రోజు ఏం జరుగుతుందో ?

  ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ను శుక్రవారం విచారణ చేసిన ఎన్ సీబీ అధికారులు శనివారం బాలీవుడ్ ప్రముఖ నటి దీపిక పదుకొనేని, మరోసారి కరిష్మా ప్రకాశ్ ను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. దీపికా పదుకొనే పద్మావతిలాగా క్లీన్ చిట్ తీసుకుని బయటకు రావాలని, ‘డ్రగావతి' లాగా అవతారం ఎత్తకూడదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

  English summary
  Drug mafia: Actor Rakul Preet Singh questioned NCB drugs case in Mumbai. Hyderabad Police promoted #SayNoToDrugs with Rakul Preet Singh in 2017. now, this picture went to viral.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X