వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగి ఆశీస్సులుంటే గోరఖ్‌పూర్ నుంచి నేనే: అల్లు అర్జున్ ‘విలన్’ రవికిషన్

|
Google Oneindia TeluguNews

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశీస్సులు లభించినట్లైతే తాను గోరఖ్‌పూర్ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నానని టాలీవుడ్ ప్రజలకు సుపరిచితుడైన సినీ విలన్, భోజ్‌పురి హీరో రవికిషన్ తెలిపారు. తెలుగులో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'రేసుగుర్రం' చిత్రంలో ఆయన విలన్‌గా నటించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

బద్ధ శత్రువులు?: యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు!బద్ధ శత్రువులు?: యోగి-ఆజంఖాన్ చేతులు కలిపారు!

కాగా, ఇటీవలే రవిశంకర్ కాంగ్రెస్ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి కావడంతో గోరఖ్‌పూర్ ఎంపీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనుంది. ఇంతకుముందు యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ ఎంపీగా ఉన్న విషయం తెలిసిందే.

 గోరఖ్‌పూర్‌పై ఆసక్తి

గోరఖ్‌పూర్‌పై ఆసక్తి

గోరఖ్‌పూర్ ఎంపీ స్థానానికి త్వరలో ఉపఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు రవికిషన్ ఆసక్తి చూపుతున్నారు.

 బీజేపీకి కంచుకోట..

బీజేపీకి కంచుకోట..

25ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న గోరఖ్‌పూర్ ఎంపీ స్థానంలో ఎవరిని నిలబెట్టాలనే విషయంలో యోగి ఆదిత్యనాథ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

 మనోజ్ తివారీ చొరవతో..

మనోజ్ తివారీ చొరవతో..

గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న రవికిషన్.. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ చొరవతో పార్టీ మారారు. 2009లో మనోజ్ తివారీ సమాజ్‌వాదీ పార్టీలో ఉన్నప్పుడు గోరఖ్‌పూర్‌లో యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

 తివారీ మద్దతుంది కానీ..

తివారీ మద్దతుంది కానీ..

ఆ తర్వాత బీజేపీలో చేరి 2014లో ఢిల్లీలో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా ఎంసీడీ ఎన్నికల్లో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. అయితే, మనోజ్ తివారీ మద్దతు ఉన్న రవికిషన్‌కు గోరఖ్‌పూర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం దక్కుతుందో లేదో వేచిచూడాలి.

English summary
Bhojpuri superstar Ravi Kishan may try his luck in politics by contesting the Gorakhpur parliamentary seat, which has fallen vacant after chief minister Yogi Adityanath quit as an MP to be a member of the state upper house.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X