వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో ఉపేంద్ర కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం, బ్లాక్ మెయిల్, అందుకే జంప్, చెక్ పవర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రియల్ హీరో ఉపేంద్ర కాంగ్రెస్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ విషయం మాకు తెలిసి ప్రశ్నిస్తే ఏకంగా పార్టీ నుంచి ఆయన నేరుగా జంప్ అయ్యి బయటకు వెళ్లిపోయారని, చెక్ పవర్ తనకే కావాలని బ్లాక్ మెయిల్ చేశారని, ఏమైనా సమస్యలు ఉంటే చర్చించవచ్చు కదా అని కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ఆరోపించారు. మంగళవారం ఉపేంద్ర కేపీజేపీకి పార్టీ రాజీనామా చేసిన తరువాత ఆ పార్టీ ఉపాధ్యక్షుడు శివకుమార్ ఒన్ ఇండియాతో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

 ప్రచారం చెయ్యలేను

ప్రచారం చెయ్యలేను

ఫేస్ బుక్, ట్వీట్టర్, సోషల్ మీడియా, టీవీల్లో అభ్యర్థుల తరపున తాను ప్రచారం చేస్తానని ఉపేంద్ర చెప్పారని, కర్ణాటకలో ఎన్నిగ్రామాల్లో ఇంటర్నెట్ ఉందని, ఈయన ప్రచారం చేస్తారని టీవీల్లో సినిమాలు, సీరియల్స్ చూడకుండా ప్రజలు ఆయన ప్రకటనల కోసం వేచి చూస్తారా అని శివకుమార్ ప్రశ్నించారు,

 బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్

బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు, జేడీఎస్ కు చెందిన నాయకులు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశారని, కేపీజేపీ నుంచి మీరు ప్రచారం మొదలు పెట్టాలి అంటే అలాంటి ప్రచారం మనకు వద్దని ఉపేంద్ర అన్నారని, ప్రజల దగ్గరకు వెళ్లకుంటే వారు ఓట్లు ఎలా వేస్తారని శివకుమార్ ప్రశ్నించారు.

ఉపేంద్ర రాలేదు

ఉపేంద్ర రాలేదు

ఫిబ్రవరి 2వ తేదీన కేపీజేపీ రాష్ట్రస్థాయి నాయకుల సమావేశం జరిగిందని, ఆ సమావేశానికి హీరో ఉపేంద్ర రాలేదని శివకుమార్ అన్నారు. సమావేశం జరుగుతున్న ప్రాంతానికి ఉపేంద్ర సోదరుడు సుధీంద్ర వచ్చారని, తరువాత ఉపేంద్రకు ఆయన ఫోన్ మాకు ఇచ్చారని శివకుమార్ అన్నారు.

ఉపేంద్ర బ్లాక్ మెయిల్

ఉపేంద్ర బ్లాక్ మెయిల్

ఉపేంద్ర సమావేశం జరుగుతున్న ప్రాంతం సమీపంలో కారులో కుర్చుకుని పార్టీకి చెందిన అన్ని వ్యవహారాలకు సంతకం చేసే పవర్, చెక్ పవర్ తనకు ఒక్కడికే ఇవ్వాలని, లేదంటే సమావేశానికి రానని, పార్టీని విడిచి వెళ్లిపోతానని హీరో ఉపేంద్ర ఫోన్ లో బ్లాక్ మెయిల్ చేశారని శివకుమార్ ఆరోపించారు.

కాంగ్రెస్ తో ఒప్పందం

కాంగ్రెస్ తో ఒప్పందం

కేపీజేపీ శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడం ఉపేంద్రకు ఇష్టం లేదని, అంతకు ముందే హీరో ఉపేంద్ర కాంగ్రెస్ పార్టీతో ఈ విషయంపై రహస్య ఒప్పందం చేసుకున్నాడని, అందుకే ప్రచారం చెయ్యకుండా, అభ్యర్థుల ఎంపిక విషయంలో ఇప్పటి వరకూ ఆసల్యం చేశాడని ఆపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ఆరోపించారు.

English summary
Upendra did not have an intention contest in assembly elections. Because he joined hand with Congress, had an agreement to not contest in elections, alleges KPJP state vice president Shivakumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X