వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో ఉపేంద్ర రాజీనామా, కొత్త పార్టీకి రంగం సిద్దం, బీజేపీ ఆహ్వానం, ఫార్టీ ఫండ్ లొల్లి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: స్యాండిల్ వుడ్ రియల్ స్టార్, దర్శకుడు ఉపేంద్ర కర్ణాటక ప్రజ్ఞావంతర జనతా పార్టీ (కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ)కి గుడ్ బై చెప్పారు. కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీ (కేపీజేపీ)కి తనతో పాటు తన మద్దతుదారులు, నాయకులు రాజీనామా చేస్తున్నామని, ఇక నుంచి ఆ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని మంగళవారం మద్యాహ్నం హీరో ఉపేంద్ర ప్రకటించారు. హీరో ఉపేంద్ర మా పార్టీలో చేరుతామంటే మాకు ఎలాంటి అభ్యంతం లేదని బీజేపీ చెప్పింది.

ఉపేంద్ర చర్చలు

ఉపేంద్ర చర్చలు

బెంగళూరు నగర శివార్లలోని దోడ్డ ఆలదమరలోని ఉపేంద్రకు చెందిన రుప్పీస్ రెస్టారెంట్ లోని పార్టీ హాల్ లో మంగళవారం మద్యాహ్నం హీరో ఉపేంద్ర తన మద్దతుదారులు, కేపీజేపీకి చెందిన పలువురు నాయకులతో భేటీ అయ్యి సుధీర్ఘంగా చర్చించారు.

ఉపేంద్ర రాజీనామా

ఉపేంద్ర రాజీనామా

కర్ణాటక ప్రతిభావంతుల జనతా పార్టీకి తాను రాజీనామా చేస్తున్నానని ఉపేంద్ర ప్రకటించారు. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న గొడవలు కేపీజేపీలో ఉండకూడదనే ఉద్దేశంతోనే తనతో పాటు తన మద్దతుదారులు ఆపార్టీకి గుడ్ బై చెబుతున్నామని హీరో ఉపేంద్ర తెలిపారు.

రాజకీయాల్లో పిల్లాడు

రాజకీయాల్లో పిల్లాడు

రాజకీయాల్లో తాను ఇప్పుడే పుట్టానని హీరో ఉపేంద్ర అన్నారు. పుట్టినబిడ్డ నడవలేడని, ఏడుస్తాడని, ఇది వాస్తవం అని హీరో ఉపేంద్ర అన్నారు. తాను రాజకీయాల్లో పిల్లాడిని, నడవలేను, ఏడుస్తున్నాను, త్వరలో తమ భవిష్యత్తు గురించి మీరే నిర్ణయిస్తారని హీరో ఉపేంద్ర తన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి అన్నారు.

బీజేపీలో చేరుతున్నారా ?

బీజేపీలో చేరుతున్నారా ?

కేపీజేపీకి రాజీనామా చేస్తున్న మీరు త్వరలో బీజేపీలో చేరుతున్నారని ప్రచారం జరుగుతోందని మీడియా ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదని ఉపేంద్ర అన్నారు. దేవుడు ఉన్నాడు, మా సిద్దంతాలకు అనుగుణంగా ముందుకు సాగడానికి తన న్యాయవాదులతో చర్చిస్తున్నానని హీరో ఉపేంద్ర చెప్పారు.

ఉపేంద్ర సూటి ప్రశ్నలు

ఉపేంద్ర సూటి ప్రశ్నలు

కేపీజేపీ వ్యవస్థాపకుడు మహేష్ గౌడకు ఉపేంద్ర సూటి ప్రశ్నలు వేశారు. తన సిద్దాంతాలు మీకు నచ్చి నన్ను కేపేజేపీ అధ్యక్షుడిని చేశారు. త్వరలో జరగనున్న కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అభ్యర్థులను సిద్దం చేశాం, ఇప్పుడు వేరే అభ్యర్థులను బరిలో దింపాలని మీరు ఏలా డిమాండ్ చేస్తున్నారని హీరో ఉపేంద్ర ప్రశ్నించారు.

 పార్టీ ఫండ్ కోసం

పార్టీ ఫండ్ కోసం

శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో పార్టీ ఫండ్ వసూలు చెయ్యాలని మీరు అంటున్నారు, మొదటే చెప్పాను, ఎవ్వరి దగ్గరా ఒక్క పైసా తీసుకోకూడదని, ఇప్పుడు సిద్దాంతాలు పక్కన పెట్టి పార్టీ ఫండ్ వసూలు చెయ్యాలంటే ఎలా అని ఉపేంద్ర మహేష్ గౌడ తదితరులను ప్రశ్నించారు.

ఏ పార్టీలో చేరుతారు ?

ఏ పార్టీలో చేరుతారు ?

బీజేపీతో సహ ఏపార్టీలో నేను చేరనని, తన సిద్దాంతాలకు అనుగుణంగా కొత్త పార్టీని స్థాపిస్తానని హీరో ఉపేంద్ర చెప్పారు. త్వరలో జరగనున్న శాసన సభ ఎన్నికల్లో తమ కొత్త పార్టీ నుంచి 200 మంది అభ్యర్థులు పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని, లక్షలాధి మంది అభిమానుల మద్దతు ఉందని, త్వరలో తన తదుపరి కార్యచరణ ప్రకటిస్తానని హీరో ఉపేంద్ర వివరించారు.

ఉపేంద్రకు బీజేపీ ఆహ్వానం

ఉపేంద్రకు బీజేపీ ఆహ్వానం

హీరో ఉపేంద్ర బీజేపీలో చేరుతామంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక మాజీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఆర్. అశోక్ చెప్పారు. హీరో ఉపేంద్ర బీజేపీలో చేరితో ఆయనకు ప్రత్యేకమైన స్థానం కల్పిస్తామని, ఆయన కోసం బీజేపీ తలుపులు ఎప్పడూ తెరిచే ఉంటాయని ఆర్. అశోక్ అన్నారు.

English summary
Actor Upendra to launch new party Prajakiya and he said he will resigned to Karnataka Prajnavantara Janata Pakasha founded by Mahesh Gowda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X