చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Shock: హీరో విజయ్ ఎంజీఆర్, సంగీత జయలలిత, అన్న లాభం లేదని వదినకు బంపర్ ఆఫర్, కలకలం !

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై: విప్లవ నాయకుడు హీరో విజయ్, విప్లవ నాయకి సంగీత విజయ్ అంటూ దళపతి విజయ్ అభిమానులు వేసిన పోస్టర్లు కలకలం రేపాయి. హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఇంతకాలం పిలుపునిచ్చిన దళపతి అభిమానులు ఇక లాభం లేదని ఆయన భార్య సంగీత రాజకీయాల్లో రావాలని పిలునిస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లు ముద్రించి అతికించడంతో కలకలం రేపింది. హీరో విజయ్ ను ఆలనాటి సూపర్ స్టార్, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్)తో, ఆయన భార్య సంగీతను దివంగత ముఖ్యమంత్రి జయలలితతో పొల్చుతూ మదురై నగరంలో ఏర్పాట్లు చేసిన పోస్టర్లు రాజకీయంగా పెద్ద దూమరం రేపాయి.

Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!Torture: సినిమా ఆర్టిస్టు స్నానం చేస్తుంటే పోలీసు ఏం చేశాడంటే, మామూలోడుకాదు, ఆంటీలు రివర్స్!

 శ్రీలంక సంగీతతో తమిళ హీరో పెళ్లి

శ్రీలంక సంగీతతో తమిళ హీరో పెళ్లి

శ్రీలంకకు చెందిన ( శ్రీలంక తమిళ అమ్మాయి) సంగీతతో తమిళ హీరో విజయ్ పెళ్లి జరిగి 20 ఏళ్లు అవుతోంది. హీరో విజయ్ ని ఆయన అభిమానులు దళపతి అని ముద్దుగా పిలుచుకుంటారు. తమ అభిమాన హీరో విజయ్, సంగీత దంపతుల వివాహం జరిగి 20 ఏళ్లు అవుతోంది. హీరో విజయ్, సంగీతల వైవాహిక జీవితం కలకాలం సంతోషంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఆయన అభిమానులు తమిళనాడులో పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు, ఫెక్సీలు ఏర్పాటు చేశారు.

 అన్నఎంజీఆర్, వదిన జయలలిత

అన్నఎంజీఆర్, వదిన జయలలిత

తమిళనాడు రాజకీయాల్లో మదురైకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎవరైనా రాజకీయంగా మదురై నుంచి అడుగు పెడితో వారికి చాల ప్రత్యేక గుర్తింపు ఉంటుందని తమిళనాడు రాజకీయ నాయకులే అంటుంటారు. ఇక హీరో విజయ్ ను అలనాటి తమిళ సూపర్ స్టార్, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ తో, హీరో విజయ్ భార్య సంగీతన దివంగత ముఖ్యమంత్రి జయలలిత పోల్చుతూ మదురైలో ఏర్పాటు చేసిన పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలు ఇప్పుడు కలకలం రేపాయి.

 విప్లవ నాయకుడు విజయ్ జిందాబాద్

విప్లవ నాయకుడు విజయ్ జిందాబాద్

ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడం విప్లవ నాయకుడి లక్షణాలు, నువ్వు మాకు విప్లవ నాయకుడు అంటూ విజయ్ ను పొగుడుతూ పోస్టర్లు తయారు చేసి పెద్ద ఎత్తున అతికించారు. హీరో విజయ్ భార్య సంగీతను విప్లవ నాయకురాలిగా అభివర్ణించారు. ఇదే సమయంలో హీరో విజయ్ ను ఎంజీఆర్ గా, ఆయన భార్య సంగీతను జయలలితగా చిత్రీకరించిన పోస్టర్లు ముద్రించిన హీరో విజయ్ అభిమానులు మదురై నగరం మొత్తం వేసిన పోస్టర్లు ఇప్పుడు కలకలం రేపాయి.

 విజయ్ భార్యకు రివర్స్ ఆఫర్

విజయ్ భార్యకు రివర్స్ ఆఫర్

దళపతి హీరో విజయ్ భార్య సంగీతనకు తన భర్త అభిమానులు అంటే మొదటి నుంచి చాలా గౌరవం. హీరో విజయ్ అభిమానులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చెయ్యాలని చాలా కాలం నుంచి సంగీత పిలుపునిస్తున్నారు. ఇదే సమయంలో తమ అభిమాన హీరో విజయ్ భార్య సంగీతను రాజకీయాల్లోకి రావాలని స్వాగతం పలుకుతున్నట్లు, అందుకు మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని రివర్స్ ఆఫర్ ఇస్తూ దళపతి అభిమానులు మదురైలో వేసిన పోస్టర్లు చూసిన కొందరు రాజకీయ నాయకుల గుండెల్లో కలవరం మొదలైయ్యింది.

 ఐటీ దాడులతో రచ్చరచ్చ

ఐటీ దాడులతో రచ్చరచ్చ

గత ఏడాదిలో హీరో విజయ్ ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హీరో విజయ్ సినిమా షూటింగ్ లో ఉన్నారు. విషయం తెలుసుకున్న విజయ్ అభిమానులు నేరుగా షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి అన్నా మేము మీకు అండగా ఉంటాము, మీరు ఈ కుళ్లు రాజకీయాలకు భయపడవద్దు అంటూ ధైర్యం చెప్పారు. ఐటీ దాడులను ఎదుర్కొన్నప్పటి నుంచి హీరో విజయ్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూనే ఉన్నారు.

Recommended Video

Suriya 5 కోట్ల విరాళం..'ఆకాశమే నీ హద్దురా' రిలీజ్ డేట్ ఫిక్స్ | Soorarai Pottru || Oneindia Telugu
 మదురై రాజకీయాలకు అడ్డా

మదురై రాజకీయాలకు అడ్డా

తమిళనాడు రాజకీయాలకు, మదురైకి చాలా లింక్ ఉంది. మదురైలో రాజకీయంగా నిలదొక్కుకున్న వారు తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారని చరిత్ర చెబుతోంది. మాజీ సీఎం ఎం. కరుణానిధి పెద్ద కుమారుడు అళగిరి, ఏఐఏడీఎంకే సీనియర్ నాయకుడు, మంత్రి సెల్లూరు రాజుకు మదురైలో మంచి పట్టు ఉంది. ఎవరైనా మదురైలో రాజకీయంగా నిలదొక్కుకుంటే తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పుతారని తమిళ ప్రజలకు ఎప్పటి నుంచి వస్తున్న సెంటిమెంట్. అందుకే హీరో విజయ్ ను రాజకీయాల్లోకి రావాలని మదురై కేంద్రంగా ఆయన అభిమానులు పోస్టర్లు వేశారని కొందరు రాజకీయ నాయకులు చర్చించుకుంటున్నారు.

English summary
Political shock: Actor Vijay fans pasted a poster which says himself as MGR and his wife Sangeetha as Jayalalithaa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X