వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో ట్విస్ట్: హీరో విశాల్ నామినేషన్‌‌ను అధికారికంగా తిరస్కరించిన ఈసీ

|
Google Oneindia TeluguNews

Recommended Video

RK Nagar by-Polls : Vishal's Nomination Rejected, Accepted And Rejected Again

చెన్నై: ఆర్కే నగర్ ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంది. నటుడు విశాల్‌ నామినేషన్‌ను మొదట తిరస్కరించిన ఎన్నికల సంఘం.. ఆ తర్వాత ఆమోదం తెలిపింది. ఆ తర్వాత గంటల్లోనే విశాల్ నామినేషన్ ను అధికారికంగా తిరస్కరిస్తున్నట్లు ఈసీ ప్రకటించడం గమనార్హం.

విశాల్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వేలుస్వామి ప్రకటించారు. నామినేషన్‌ పత్రాలను పూర్తిగా పరిశీలించిన అనంతరం ఈ ప్రకటన చేశారు.

 Actor Vishal's Nomination For RK Nagar By-Poll Rejected, Then Accepted

అంతకుముందు ఈసీ తన నామినేషన్ ను స్వీకరించడంతో 'సుదీర్ఘ పోరాటం తర్వాత ఆర్కేనగర్‌ ఎన్నికలకు సంబంధించిన నా నామినేషన్‌కు ఆమోదముద్ర పడింది. సత్యం జయించింది' అంటూ విశాల్ వెల్లడించారు. తొలుత విశాల్‌ సమర్పించిన నామినేషన్‌ పత్రాలు అసంపూర్తిగా ఉన్నాయని, అందుకే తిరస్కరించామని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి స్పష్టం చేశారు.

300 మంది అనుచరులతో కలిసి సోమవారం సాయంత్రం చివరి నిమిషంలో విశాల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఆర్కేనగర్‌ నియోజవర్గంలో ఆయన గట్టి పోటీ ఇచ్చే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో నామినేషన్‌ తిరస్కరణకు గురికావడం చర్చనీయాంశమైంది.

నామినేషన్‌పై ఈసీ షాక్: ఫ్యాన్స్‌తో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగిన హీరో విశాల్ అరెస్టునామినేషన్‌పై ఈసీ షాక్: ఫ్యాన్స్‌తో కలిసి రోడ్డుపై ధర్నాకు దిగిన హీరో విశాల్ అరెస్టు

అయితే తన నామినేషన్‌ తిరస్కరించడాన్ని వ్యతిరేకిస్తూ సినీనటుడు విశాల్‌ ఆర్కేనగర్‌ రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఉద్దేశ పూర్వకంగానే తన నామినేషన్‌ తిరస్కరించారని, దీని వెనుక కుట్ర ఉందని విశాల్‌ ఆరోపించారు.

అయితే పలు చర్చల అనంతరం విశాల్ విరణ తీసుకుని ఎన్నికల అధికారులు ఆయన నామినేషన్‌కు ఆమోద ముద్ర వేశారు. అయితే, గంటల్లోనే నామినేషన్ తిరస్కరించినట్లు ఈసీ ప్రకటించడం సంచలనంగా మారింది. కాగా, మరో అభ్యర్థి దీపా జయకుమార్ నామినేషన్ కూడా ఈసీ తిరస్కరించిన విషయం తెలిసిందే.

English summary
The Election Commission on Tuesday cited 'technical' reasons for rejecting actor Vishal Krishna's nomination as an independent candidate for the December 21 RK Nagar bypoll, but later in the day, cancelling its earlier decision, allowed him to contest from the same.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X