వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో విశాల్ రాజకీయాల్లోకి: రజనీకాంత్, కమల్ హాసన్ కర్ణాటకను ప్రశ్నించాలి, అన్యాయం!

|
Google Oneindia TeluguNews

చెన్నై/మదురై: బహుబాష నటుడు, తమిళ సినీ నిర్మాతల మండలి అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కారద్యర్శి విశాల్ త్వరలో రాజకీయ పార్టీ పెట్టడానికి సిద్దం అవుతున్నారు. స్థానిక, సంస్థల ఎన్నికలు జరిగే తేదీ ప్రకటించిన తరువాత తన నిర్ణయం వెళ్లడిస్తానని హీరో విశాల్ చెప్పారు. ఇదే సమయంలో తమిళనాడులో త్వరలో మంచిరోజులు వస్తాయని హీరో విశాల్ జోస్యం చెప్పారు. రజనీకాంత్, కమల్ హాసన్ కావేరీ నీటి విషయంలో కర్ణాటకను ప్రశ్నించాలని విశాల్ మనవి చేశారు.

ఆర్ టీసీ బస్సు చార్జీలు

ఆర్ టీసీ బస్సు చార్జీలు

తమిళనాడు ప్రభుత్వం ఒక్క సారిగా బస్సు చార్జీలు పెంచి ప్రజల మీద బండరాయి వేసిందని హీరో విశాల్ మండిపడ్డారు. ఒక్కసారిగా బస్సు చార్జీలు పెంచితే పేద ప్రజలు ఎలా ప్రయాణిస్తారని విశాల్ ప్రశ్నించారు. వెంటనే బస్సు చార్జీలు తగ్గించాలని హీరో విశాల్ తమిళనాడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రజనీ, కమల్ ఏమంటారు ?

రజనీ, కమల్ ఏమంటారు ?

కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వాన్ని సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్, బహుబాష నటుడు, దర్శక నిర్మాత కమల్ హాసన్ ప్రశ్నించాలని హీరో విశాల్ మనవి చేశారు. కావేరీ నీటి పంపిణి విషయంలో కర్ణాటక ప్రభుత్వం తమిళనాడు రైతులకు అన్యాయం చేస్తోందని హీరో విశాల్ ఆరోపించారు.

ఆరోజు చెబుతాను

ఆరోజు చెబుతాను


మీరు రాజకీయాల్లోకి వస్తున్నారా ? లేదా ? అంటూ మీడియా ప్రశ్నించగా 18 నెలల నుంచి వాయిదా పడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల తేదీ ప్రకటించిన తరువాత తన నిర్ణయం చెబుతానని హీరో విశాల్ సమాధానం ఇచ్చారు. రాజకీయాల్లో వస్తాను అంటూ హీరో విశాల్ పరోక్షంగా చెప్పారు.

మదురై అగ్ని ప్రమాదం

మదురై అగ్ని ప్రమాదం


మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదం లాంటి ఘటన తమిళనాడులో మరో చోట జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హీరో విశాల్ మనవి చేశారు. మీనాక్షి అమ్మవారి ఆలయంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం చాల బాధ కలిగించిందని విశాల్ అన్నారు.

మంచి పని కోసం వస్తా

మంచి పని కోసం వస్తా

తమిళనాడు ప్రజలకు మంచి చెయ్యడానికి తాను రాజకీయాల్లోకి వస్తానని హీరో విశాల్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తాన నామినేషన్ ఎలా తిరస్కరణకు గురైయ్యిందో ఆ దేవుడికే తేలియాలి అని విశాల్ చెప్పారు.

కచ్చితంగా వస్తా

కచ్చితంగా వస్తా


ప్రజలకు మంచి చెయ్యడానికి అవసరం అయితే కచ్చితంగా తాను రాజకీయాల్లోకి వస్తానని హీరో విశాల్ అన్నారు. సినిమా రంగం నుంచి చాల మంది రాజకీయాల్లోకి వస్తున్నారని, తాను రావడంలో ఎలాంటి తప్పు లేదని హీరో విశాల్ అన్నారు.

English summary
Actor Vishal says that he will decide about starting new political party only after Civic polls date announces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X