వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా టీకానే వివేక్‌ను బలి తీసుకుంది.. నటుడు మన్సూర్ అలీ ఖాన్ ఆరోపణలు

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ సెకండ్ వేవ్ కొనసాగుతోంది. వైరస్ నుంచి రక్షణ కోసం టీకా తీసుకుంటున్నారు. అయితే ఫస్ట్, సెకండ్ డోస్ టీకా తీసుకున్నవారికి కూడా కరోనా వస్తోంది. దీంతో టీకా విశ్వసనీయతపై అనుమానాలు నెలకొన్నాయి. టీకా తీసుకున్న తర్వాత మరికొందరు చనిపోతున్నారు కూడా. ప్రముఖ నటుడు వివేక్ కూడా అదేవిధంగా మృతిచెందాడు. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే వివేక్ చనిపోయాడని సహా నటుడు మన్సూర్ అలీ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు.

టీకా వల్లే..

టీకా వల్లే..

కరోనా టీకా వల్ల నటుడు వివేక్‌ చనిపోయాడని అన్నారు. టీకాతో మరణించలేదని ఎలా నిర్ధారిస్తారని మండిపడ్డారు. కరోనా కేసుల సంఖ్య పేపర్లలో వేయడం నిలిపివేయాలని సూచించారు. ఎందుకు ప్రజలను భయపెడుతూ చంపుతున్నారని ప్రశ్నించారు. అడిగేవారు లేరనేనా అని విరుచుకుపడ్డారు. దేశంలో కరోనా పరీక్షలు నిలిపివేయాలని.. ఆ మరుసటిరోజే దేశంలో వైరస్ ఉండదన్నారు.

వ్యాక్సిన్‌లో ఏ సామర్థ్యం ఉంది..?

వ్యాక్సిన్‌లో ఏ సామర్థ్యం ఉంది..?

నటుడు వివేక్‌ బాగానే ఉన్నాడుగా, ఎందుకు కరోనా టీకా వేశారు? ఆ టీకాలో ఎలాంటి సామర్ధ్యం ఉంది అని అలీఖాన్ అడిగారు. దేశంలో కరోనా లాంటి వైరస్‌ చాలా ఏళ్లుగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం కరోనా పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. టీకాతోనే వివేక్‌ మరణించలేదని ఎలా నిర్ధారిస్తారు? ఎవరు చెబుతారు? తొండాముత్తూరు నియోజకవర్గంలో ప్రచారంలో భాగంగా అందరీతో కలిసి ఉన్నానని చెప్పారు. తనకు కరోనా రాలేదే? అని ప్రశ్నించారు.

షూటింగ్‌కు కరోనా సర్టిఫికెట్

షూటింగ్‌కు కరోనా సర్టిఫికెట్

కరోనా లేదని స్పష్టంగా చెబుతున్నానని.. తనను తీసుకెళ్లి జైలులో వేయాలని కోరారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు. షూటింగ్‌లకు కరోనా సర్టిఫికెట్‌ తప్పనిసరి చేయడంతో, ఈ టెస్ట్‌కు రూ.2 వేలు ఖర్చుపెట్టుకోవాల్సి వస్తోందని చెప్పారు. అంత స్థోమత లేని జూనియర్‌ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి రోడ్లపై పడ్డారు. పనులు కోల్పోయిన ఇబ్బంది పడుతున్న ప్రతి రేషన్‌కార్డుకు రూ.1 లక్ష ఇవ్వండి. కరోనా టీకా వేయించుకొనే వారందరికి ఇన్యూరెన్స్‌ ఇవ్వండి. వ్యాధి నిరోధక శక్తి పెంచేలా పారంపర్యమైన మూలికల కషాయాలను ప్రజలకు ఉచితంగా, విరివిరిగా అందించాలని సూచించారు.

Recommended Video

Actor Vivek మరణం: కంటతడి పెట్టిన Keerthy, త్రిష, సూర్య, ఈ తరం హాస్యనటుల్లో ఆ లక్షణాలు లేవు
ఇబ్బందులు

ఇబ్బందులు

కరోనా పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బంది పెడుతూ ప్రభుత్వాలు కాలం గడుపుతున్నాయని విరుచుకుపడ్డారు. ఇది ఏ మాత్రం సరి కాదు.. పరిష్కారించాల్సిన చోట సమస్యను పెంచుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. అలీఖాన్ వ్యాఖ్యలను చెన్నై కార్పొరేషన్‌ కమిషనర్‌ ఖండించారు. వివేక్‌ మృతికి, కరోనా టీకాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.

English summary
actor vivek died due to corona vaccine co-actor mansoor ali khan alleged.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X