వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రముఖ నటి సామూహిక లైంగిక దాడి కేసు: కాంగ్రెస్ ఎమ్మెల్యే విచారణ, ఏం చెప్పారంటే ?

ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. థామస్ ను పోలీసులు విచారణ చేశారు. ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించి అధికారికంగా రికార్డు చేసి కోర్టులో సమర్పించడాన

|
Google Oneindia TeluguNews

కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. థామస్ ను పోలీసులు విచారణ చేశారు. ఆయన నుంచి పూర్తి వివరాలు సేకరించి అధికారికంగా రికార్డు చేసి కోర్టులో సమర్పించడానికి అధికారులు సిద్దం అయ్యారు.

నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్ !నటి నగ్న ఫోటోలు, వీడియో ఇవ్వు: రూ. కోట్లు ఇస్తా, మలయాళం హీరో దిలీప్ బంపర్ ఆఫర్ !

నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో మలయాళం ప్రముఖ హీరో దిలీప్ ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హీరో దిలీప్ తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పీటీ. థామస్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఈ కేసులో దిలీప్ ను రక్షించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారని ఆరోపణలు ఉన్నాయి.

Actress abduction case Kerala MLA PT Thomas give statment

పోలీసుల విచారణ అనంతరం బయట మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే థామస్ పోలీసుల విచారణలో తాను చెప్పిన అన్ని వివరాలు మీడియాకు చెప్పడం కుదరదని అన్నారు. అయితే బాధితురాలకి న్యాయం జరగాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులకు చెప్పానని వివరించారు.

నటి లైంగిక దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన మలయాళం హీరో దిలీప్ మేనేజర్ !నటి లైంగిక దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన మలయాళం హీరో దిలీప్ మేనేజర్ !

పోలీసులు విచారణ తరువాత ఎమ్మెల్యే థామస్ నేరుగా మాలీవుడ్ దర్శకుడు, బహుబాష నటుడు లాల్ ఇంటికి వెళ్లారు. ఫిబ్రవరి 17వ తేదీ రాత్రి నటి మీద సామూహిక లైంగిక దాడి జరిగిన తరువాత ప్రముఖ నిందితుడు పల్సర్ సునీ నేరుగా ఎమ్మెల్యే థామస్, దర్శకుడు, నటుడు లాల్ ను కలిశారని పోలీసులు అంటున్నారు.

English summary
Kerala MLA P T Thomas on Friday gave his statement to the police in the case of abduction and sexual assault of a south Indian actress on February 17 this year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X