చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మద్యం మత్తులో సినిమా హీరోయిన్ అత్యాచారం?

By Pratap
|
Google Oneindia TeluguNews

 Actress alleges sexual assault
చెన్నై: నూతన సంవత్సరం వేడుకల్లో జరగరాని సంఘటన జరిగింది. డిసెంబ‌ర్ 31వ తేదీ రాత్రి జ‌రిగిన నూతన సంవత్సరం వేడుకల్లో కోలీవుడ్ సినీ పరిశ్రమలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. కోలీవుడ్ సినీ పరిశ్రమలో ఓ హీరోయిన్‌పై అత్యాచార య‌త్నం జ‌రిగిన‌ట్టుగా చెన్నైలోని కొడంబాకం ప్రాంతంలోని పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు అయింది.

ఆ సంఘటనతో కోలీవుడ్ సినిమా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. అత్యాచారానికి గురైనట్లు భావిస్తున్న సినీ నటి ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్‌గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ చేసింది. గ‌త కొన్ని సినిమాల నుండి చిన్న పాటి సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తోంది. 31వ తేదీ రాత్రి జ‌రిగిన నూతన సంవత్సరం వేడుకల్లో ఓ నిర్మాత ఇచ్చిన విందుకు ఆమె హాజరైంది.

నూతన సంవత్సరం వేడుకల్లో మద్యం సేవించిన నటిపై తెల‌వారు జామను నాలుగు గంట‌ల‌కు ఇద్దరు మేనేజ‌ర్లు, ఓ నిర్మాత ఆమె అంగీకారం లేకుండా అత్యాచారానికి పాల్పడ‌ట్టుగా ద‌గ్గర‌లోని పోలీస్‌స్టేష‌న్‌లో నిందితుల‌పై ఫిర్యాదు చేసింది.

అత్యాచారం ఆరోపణలు ఎదుర్కుంటున్నవారు మాత్రం తామ కావాల‌ని చేసింది కాద‌ని, ఇదంతా ఆమెకు ముందుగానే తెలుస‌ని అంటున్నారు. ఈ విష‌యంపై ఇంకా దర్యాప్తు కొన‌సాగుతోంది. ఈ మేరకు మీడియాలో వార్తలు వచ్చాయి.

English summary
A Kollywood actress has complained against a producer and managers alleging sexual assault against her during new yaer celebrations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X