వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Actress Attack: ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చివాట్లు, జడ్జిని మార్చమంటారా ?, ఏమనుకుంటున్నారు ?, హీరోకు షాక్ !

|
Google Oneindia TeluguNews

కొచ్చి/ న్యూఢిల్లీ: ప్రముఖ నటి కిడ్నాప్, దాడి కేసు విచారణ జరుగుతున్న కోర్టు న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం చేసిన మనవిని సుప్రీం కోర్టు తిరస్కరించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వాదించిన కేరళ ప్రభుత్వం తీరును సుప్రీం కోర్టు తప్పుపట్టింది. మీరు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవాలు లేవు. న్యాయమూర్తిని మార్చాలని మీరు చెప్పినంత మాత్రాన అలా చెయ్యడం సాధ్యం కాదు, మీ డిమాండ్ లను దృష్టిలో పెట్టుకుని జడ్జిని మార్చడం సాధ్యం కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది, అసలు మీరు ఏమనుకుంటున్నారు ?, మీ వాదలను మీరే సమర్థించుకుంటారా అంటూ సుప్రీం కోర్టు మండిపడుతూ కేరళ ప్రభుత్వం పిటిషన్ ను కొట్టి వేసింది. ప్రముఖ నటి దాడి కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిని మార్చాలని వెళ్లిన కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు చివాట్లు పెట్టింది.

Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది !Lady teacher: టీచర్స్ అక్రమ సంబంధం, ఆంటీని చంపేశారు, వెంట్రుకే కదా అనుకుంటే కొంప ముంచింది !

 2017 ఫిబ్రవరిలో కలకలం

2017 ఫిబ్రవరిలో కలకలం

2017వ సంవత్సరం ఫిబ్రవరి నెలలో కేరళలోని త్రిసూర్ నుంచి కారులో కొచ్చి వెలుతున్న ప్రముఖ నటిని కొందరు కిడ్నాప్ చేసి ఆమెపై దాడి చేశారు. కేరళతో పాటు దేశవ్యాప్తంగా ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, దాడి కేసు కలకలం రేపింది. ఈ కేసులో పల్సర్ సునీతో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. ప్రముఖ నటి కేసు అప్పటి కేరళ ప్రభుత్వాన్ని, మలయాళం సినీ పరిశ్రమను కుదిపేసింది.

 80 రోజులు సెంట్రల్ జైల్లో స్టార్ హీరో

80 రోజులు సెంట్రల్ జైల్లో స్టార్ హీరో

ప్రముఖ హీరోయిన్ కిడ్నాప్, దాడి కేసులో మలయాళం సినీ రంగంలో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దిలీప్ ను పోలీసులు అరెస్టు చెయ్యడం అప్పట్లో కలకలం రేపింది. పల్సర్ సునీ అండ్ గ్యాంగ్ తో పాటు స్టార్ హీరో దిలీప్ జైలుపాలైనాడు. సుమారు 80 రోజులకు పైగా జైలు జీవితం గడిపిన హీరో దిలీప్ తరువాత బెయిల్ మీద బయటకు వచ్చాడు.

 హీరో కాదు... మా పాలిట విలన్

హీరో కాదు... మా పాలిట విలన్

బెయిల్ మీద బయటకు వచ్చిన హీరో దిలీప్ ఈ కేసులో తనకు వ్యతిరేకంగా సాక్షం చెప్పకూడదని ఈ కేసులోని సాక్షులను బెదిరించాడని ఆరోపణలు ఉన్నాయి. హీరో దిలీప్, అతని అనుచరులు, కొందరు పొలిటికల్ లీడర్స్ మమ్మల్ని బెదిరిస్తున్నారని అనేక ఫిర్యాదులు చెయ్యడం మరో వివాదానికి కారణం అయ్యింది. ఈ సందర్బంలో ప్రముఖ నటి కిడ్నాప్, దాడి కేసు విచారణ జరుగుతున్న కోర్టు న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం పై కోర్టులను ఆశ్రయించింది.

 హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

హైకోర్టులో ప్రభుత్వానికి చుక్కెదురు

ప్రముఖ నటి దాడి కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. ఈ కేసులోని న్యాయమూర్తిని తప్పించాలని, లేదా కేసు విచారణ వేరే కోర్టుకు బదిలి చెయ్యాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అది సాధ్యం కాకపోవడంతో కేసు వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆయన పదవికి రాజీనామా చేసి కేసు నుంచి తప్పుకున్నారు. ఈ కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిని మార్చాలని కేరళ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ చేస్తున్న న్యాయమూర్తిని మార్చడం సాధ్యం కాదని కేరళ ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి చెప్పింది.

 సుప్రీం కోర్టులో చివాట్లు

సుప్రీం కోర్టులో చివాట్లు

హైకోర్టులో ఎదురుదెబ్బ తగలడంతో కేరళ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ప్రముఖ నటి దాడి కేసు విచారణ చేస్తున్న కోర్టు న్యాయమూర్తి మీద మీరు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని తెలుస్తోందని, మీ వాదన సక్రమంగా లేదని సుప్రీం కోర్టు కేరళ ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. ప్రముఖ నటిని 20 మంది న్యాయవాదుల ముందు విచారణ చేశారని మీరు చెబుతున్నారని, అంత వరకు బాగానే ఉంది. మీరు న్యాయమూర్తి తీరును అవమానిస్తూ ఆయన్ను మార్చాలని చెప్పడం విడ్డూరంగా ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

 ప్రభుత్వానికి షాక్

ప్రభుత్వానికి షాక్

ఈ కేసు విచారణ వేరే కోర్టుకు మార్చడం కుదరదని, న్యాయమూర్తిని మార్చడం సాధ్యం కాదని కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కేసు వాదించడానికి కొత్తగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించుకోవడానికి కేరళ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు కొంత సమయం ఇచ్చింది. మొత్తం మీద ప్రముఖ నటి కిడ్నాప్, దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ తో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన కొందరు పెద్దలకు ఇప్పుడు మరో షాక్ ఎదురైయ్యింది.

English summary
Malayalam Actress Attack and Dileep Case: Supreme Court Rejected Kerala State Government plea.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X