Actress: స్టార్ హోటల్ లో చిత్రాతో ఏం జరిగిందో మొత్తం చెప్పాడు, సీక్రెట్ గా రికార్డు చేసి రిలీజ్ చేసిన ఫ్రెండ్
చెన్నై/ బెంగళూరు: బుల్లితెర నటి చిత్రా ఆత్మహత్య కేసు కొత్త మలుపు తిరిగింది. చిత్రా ఆత్మహత్య కేసులో ఇప్పటికే ఆమె సీక్రెట్ రిజిస్టర్ మొగుడు హేమంత్ అలియాస్ హేమనాథ్ ను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. తనకు బెయిల్ మంజూరు చెయ్యాలని హేమంత్ హైకోర్టును ఆశ్రయించాడు. ఇదే సమయంలో చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు ఏం జరిగింది ? అనే విషయం హేమంత్ అతని స్నేహితుడికి పూస గుచ్చినట్లు చెప్పాడు. 20 నిమిషాల సేపు హేమంత్ చెప్పిన మాటలను సీక్రెట్ గా రికార్డు చేసిన ఆడియోను అతని ఫ్రెండ్ విడుదల చెయ్యడం కలకలం రేపింది. హేమంత్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని అతని స్నేహితుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో కథ కొత్త మలుపు తిరిగింది.
Apple lady: ఆంటీ యాపిల్ లా ఉందని కుక్కలాగా కొరికేసిన పక్కింటోడు, కొడుకులు ఊరికి వెళితే పండగే !

నటి చిత్రా ఆత్మహత్య
తమిళ బుల్లితెర నటి చిత్రా గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన చెన్నైలోని ఓ స్టార్ హోటల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు హోటల్ లో ఉంటున్న గదిలో ఆమె భర్త హేమంత్ కూడా ఉన్నాడు. భర్త హేమంత్ చిత్రాను చిత్రహింసలకు గురి చెయ్యడం వలనే ఆత్మహత్య చేసుకుందని వెలుగు చూడటంతో అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.

క్లోజ్ ఫ్రెండ్ రోహిత్ ఎంట్రీ
నటి చిత్రా ఆత్మహత్య కేసును ఫెడరల్ క్రిమినల్ విభాగానికి బదిలి చేశారు. ఇప్పటికే చిత్రా ఆత్మహత్య కేసులో చెన్నై సిటీ పోలీసులు అనేక కోణాల్లో దర్యాప్తు చేసి సమాచారం సేకరించారు. చిత్రా ఆత్మహత్య కేసులో జైల్లో ఉన్న ఆమె భర్త హేమంత్ బెయిల్ కోసం మద్రాసు హైకోర్టును (చెన్నై హైకోర్టు) ఆశ్రయించాడు. ఇదే సమయంలో హేమంత్ కు బెయిల్ మంజూరు చెయ్యకూడదని అతని స్నేహితుడు రోహిత్ కోర్టులో పిటిషన్ దాఖలు చెయ్యడంతో కథ కొత్త మలుపు తిరిగింది.

ఫ్యామిలీ ఫ్రెండ్స్
తమిళనాడులోకి కాంచీపురంకు చెందిన వాడు రోహిత్. రోహిత్, అతని భార్య, హేమంత్ కలిసి చెన్నైలోని ఓ అద్దె ఇంటిలో నివాసం ఉండేవారు. గత 10 ఏళ్ల నుంచి రోహిత్, చిత్రా మొగుడు హేమంత్ క్లోజ్ ఫ్రెండ్స్. రోహిత్ నటి చిత్రాకు చాలా సన్నిహితుడు, రోహిత్, అతని భార్య, హేమంత్, చిత్రా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కావడంతో చాలా సన్నిహితంగా ఉన్నారు.

చిత్రా ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది ?
చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు 20 నిమిషాల్లో ఏం జరిగింది ? అనే విషయం హేమంత్ పూస గుచ్చినట్లు చెబుతున్న మాటలను రోహిత్ అతని మొబైల్ ఫోన్ లో సీక్రెట్ గా రికార్డు చేశాడు. చిత్రాతో గొడవ జరిగిన 20 నిమిషాల ముందు ఆమె చాలా సైలెంట్ గా ఉండిపోయిందని, నాతో గొడవ పడిన తరువాత కొంత సేపు మాట్లాడటం మానేసిందని హేమంత్ చెప్పినట్లు ఆడియో టేప్ రికార్డు అయ్యింది.

చిత్రా డ్యాన్స్ దెబ్బ..... సిగరేట్ చేసిన పని ఏమిటి ?
ఓ షోలో నువ్వు వేరే వ్యక్తితో కలిసి జంటగా డ్యాన్స్ చెయ్యకూడదని తాను చిత్రాకు చెప్పానని, అయితే నేను నటి, కొందరితో కలిసి టీవీ సీరియల్స్ లో నటిస్తున్నాను, డ్యాన్స్ చెయ్యడంలో తప్పు ఏముంది అని చిత్రా తనను ప్రశ్నించిందని, ఆ సమయంలో ఇద్దరి మద్య గొడవ జరిగిందని హేమంత్ చెప్పిన మాటలను రోహిత్ రికార్డు చేశాడు. అదే సమయంలో తాను సిగరెట్ తాగి దానిని చిత్రా ఉన్న ప్రాంతంలో విసిరేసి అక్కడి నుంచి హోటల్ కిందకు వెళ్లి పోయానని హేమంత్ చెబుతున్న మాటల ఆడియో ఇప్పుడు విడుదలైయ్యింది.

అంతే జరిగింది
చిత్రా ఉన్న గదిలో నుంచి నేరుగా హోటల్ కింద ఉన్న గార్డెన్ లోకి వచ్చి సిగరెట్ తాగానని, తరువాత రూమ్ దగ్గరకు వెళ్లి తలుపులు తియ్యాలని చెప్పినా చిత్రా ఏమాత్రం స్పందించలేదని హేమంత్ అన్నాడు. తనకు అనుమానం వచ్చి రూమ్ బాయ్ సహాయంతో తలుపులు తీసి చూస్తే చిత్రా ఉరి వేసుకుని వేలాడుతోందని హేమంత్ చెప్పినట్లు ఆడియో టేప్ విడుదల అయ్యింది. చిత్రా ఆత్మహత్య చేసుకునే ముందు ఏం జరిగింది అని ఆమె భర్త హేమంత్ స్వయంగా చెప్పిన మాటల ఆడియో విడుదల కావడం ఇప్పుడు కలకలం రేపింది.